PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-ramachandraiah-vamsi-jagan1f47c1f1-0ee7-4ca8-bf80-63f525f851f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-ramachandraiah-vamsi-jagan1f47c1f1-0ee7-4ca8-bf80-63f525f851f2-415x250-IndiaHerald.jpgవైసీపీ తరపున ఎంపికైన ఇద్దరు రెండుపార్టీల్లోకి జంప్ చేసేశారు. సీ రామచంద్రయ్యేమో టీడీపీలో చేరారు. వంశీయేమో జనసేనలో చేరిపోయారు. పార్టీ మారేటప్పుడు ఇద్దరు కూడా తమ పదవులకు రాజీనామాలు చేయలేదు. అందుకనే మండలిలో వైసీపీ చీఫ్ విప్ మేరుగ మురళీకృష్ణ ఛైర్మన్ కు రాతమూలకంగా ఫిర్యాదుచేశారు. పార్టీ ఫిరాయించిన ఇద్దరిపైన అనర్హత వేటు వేయాలని చీఫ్ విప్ తన ఫిర్యాదులో ఛైర్మన్ను కోరారు. దాంతో ఛైర్మన్ వెంటనే పై ఇద్దరు ఎంఎల్సీలకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు. ycp ramachandraiah vamsi jagan{#}murali krishna;రాజీనామా;tuesday;king;News;central government;YCP;Tammineni Seetha Ram;Reddy;Party;Sasanamandaliఅమరావతి : ఇద్దరిపైనా వేటు పడిందిఅమరావతి : ఇద్దరిపైనా వేటు పడిందిycp ramachandraiah vamsi jagan{#}murali krishna;రాజీనామా;tuesday;king;News;central government;YCP;Tammineni Seetha Ram;Reddy;Party;SasanamandaliWed, 13 Mar 2024 05:00:00 GMT

ఇద్దరు ఫిరాయింపు ఎంఎల్సీలపై శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు వేటు వేశారు. వైసీపీ తరపున ఎంపికైన ఇద్దరు ఎంఎల్సీలు సీ రామచంద్రయ్య, వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్ పై మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. ఎంఎల్సీలు ఇద్దరిపైన అనర్హత వేటు వేసి అదే విషయాన్ని ఛైర్మన్ కేంద్ర ఎన్నికల కమీషన్ కు సమాచారం అందించారు. ఇద్దరికీ సుమారు మూడున్నర సంవత్సరాల పదవీకాలం మిగిలుంది. ఇంతకీ అనర్హత వేటు ఎందుకు వేశారంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారనే.





వైసీపీ తరపున ఎంపికైన ఇద్దరు రెండుపార్టీల్లోకి జంప్ చేసేశారు. సీ రామచంద్రయ్యేమో టీడీపీలో చేరారు. వంశీయేమో జనసేనలో చేరిపోయారు. పార్టీ మారేటప్పుడు ఇద్దరు కూడా తమ పదవులకు రాజీనామాలు చేయలేదు. అందుకనే మండలిలో వైసీపీ చీఫ్ విప్ మేరుగ మురళీకృష్ణ ఛైర్మన్ కు రాతమూలకంగా ఫిర్యాదుచేశారు. పార్టీ ఫిరాయించిన ఇద్దరిపైన అనర్హత వేటు వేయాలని చీఫ్ విప్ తన ఫిర్యాదులో ఛైర్మన్ను కోరారు. దాంతో ఛైర్మన్ వెంటనే పై ఇద్దరు ఎంఎల్సీలకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు.





విచారణకు వచ్చిన వాళ్ళిద్దరు  ఛైర్మన్ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా తమిష్టంవచ్చిన పద్దతిలోనే సమాధానాలు చెప్పారట. దాంతో ఎన్నిసార్లు వీళ్ళని విచారించినా ఎలాంటి ఉపయోగం ఉండదని అర్ధమైన తర్వాత ఛైర్మన్ మంగళవారం ఇద్దరిపైనా అనర్హత వేటు వేశారు. నిజానికి ఒకపార్టీలో పదవితీసుకుని మరో పార్టీలోకి వెళ్ళేటపుడు సదరు పదవికి రాజీనామా చేయటం అన్నది  సంప్రదాయం. ఇది పూర్తిగా నైతికత కిందకు వస్తుంది. అయితే దురదృష్టం ఏమిటంటే చాలామంది సంప్రదాయాం, నైతికతను పట్టించుకోవటంలేదు.





దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇదేపద్దతి ఉందికాబట్టి తెలుగురాష్ట్రాలు ముఖ్యంగా ఏపీలో ఈ పరిస్ధితి మరింతగా పెరిగిపోయింది. ఈ పరిస్ధితికి పార్టీల అధినేతలనే తప్పుపట్టాలి. సరే విషయం ఏదైనా ఈమధ్యనే ఎనిమిది మంది ఎంఎల్ఏలపైన స్పీకర్ తమ్మినేని సీతారామ్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. చంద్రబాబునాయుడు హయాంలో పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఏలపై ఎలాంటి చర్చలు తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రం మొత్తం పదిమంది ప్రజాప్రతినిదులపై అనర్హత వేటుపడింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>