Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/onlinelo-bagane-target-avutunna-family-star75cd0595-fc8b-40a4-b616-5a305ce620a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/onlinelo-bagane-target-avutunna-family-star75cd0595-fc8b-40a4-b616-5a305ce620a9-415x250-IndiaHerald.jpgఇంకో ఇరవై రెండు రోజుల్లో విడుదల కాబోతున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మీద క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా టీజర్, రెండు లిరికల్ వీడియోలు వచ్చాయి.మంచి బజ్ పెంచాయి. కుటుంబ ప్రేక్షకులకు సమ్మర్ ఛాయస్ గా ఉంటుందనే నమ్మకాన్ని బయ్యర్లలో కలిగించాయి. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ ఈ ప్రమోషనల్ కంటెంట్ లో లాజిక్స్ వెతుకుతున్న నెటిజెన్లు తమ ప్రశ్నల బాణాలను సంధిస్తున్నారు. నిన్న రిలీజ్ చేసిన కళ్యాణి వచ్చా పాటలో ఒక మధ్య తరగతి యువకుడు అంత ఖరీదైన పెళ్లి ఎలా చేసుకుంటాడని క్వశ్చన్ చేస్తున్నారు. నిజంగా పsocialstars lifestyle{#}abinaya;gopi sundar;kushi;parasuram;Kushi;Geetha Govindam;Gita Govindam;kalyani;Joseph Vijay;king;producer;Producer;vijay deverakonda;Darsakudu;rashmika mandanna;Blockbuster hit;media;Director;marriageఆన్ లైన్లో బాగానే టార్గెట్ అవుతున్న ఫ్యామిలీ స్టార్..!!ఆన్ లైన్లో బాగానే టార్గెట్ అవుతున్న ఫ్యామిలీ స్టార్..!!socialstars lifestyle{#}abinaya;gopi sundar;kushi;parasuram;Kushi;Geetha Govindam;Gita Govindam;kalyani;Joseph Vijay;king;producer;Producer;vijay deverakonda;Darsakudu;rashmika mandanna;Blockbuster hit;media;Director;marriageWed, 13 Mar 2024 18:15:00 GMTఇంకో ఇరవై రెండు రోజుల్లో విడుదల కాబోతున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మీద క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా టీజర్, రెండు లిరికల్ వీడియోలు వచ్చాయి.మంచి బజ్ పెంచాయి. కుటుంబ ప్రేక్షకులకు సమ్మర్ ఛాయస్ గా ఉంటుందనే నమ్మకాన్ని బయ్యర్లలో కలిగించాయి. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ ఈ ప్రమోషనల్ కంటెంట్ లో లాజిక్స్ వెతుకుతున్న నెటిజెన్లు తమ ప్రశ్నల బాణాలను సంధిస్తున్నారు. నిన్న రిలీజ్ చేసిన కళ్యాణి వచ్చా పాటలో ఒక మధ్య తరగతి యువకుడు అంత ఖరీదైన పెళ్లి ఎలా చేసుకుంటాడని క్వశ్చన్ చేస్తున్నారు. నిజంగా పాయింటే.ఒకవేళ సినిమాలో డ్రీమ్ సాంగ్ అయ్యుండొచ్చనే కామెంట్ ఫ్యాన్స్ వైపు నుంచి వినిపిస్తోంది. మాములుగా కల్లో డ్యూయెట్లు వేసుకుంటారు కానీ పెళ్లి పాటలు కాదనేది ఇంకో వాదన. ఎవరిది నిజమో ఏప్రిల్ 5 తేలుతుంది. మరొకరు టీజర్ లో చూపించిన ఒక సీన్లో విజయ్ దేవరకొండ దోస పెనం మీద పేపర్ లాంటిది తీస్తూ ఎదురుగా ఉన్న అభినయ ప్లేట్ లో వేస్తాడు. స్లో మోషన్ లో చూస్తే అది స్పష్టంగా కాగితమని అర్థమైపోతుంది. సోషల్ మీడియా లో ఒక వ్యక్తి దీని గురించి ప్రశ్నిస్తే ఏకంగా ఎస్విసి అఫీషియల్ హ్యాండిల్ నుంచి కాస్త ఓపిక పట్టమని సమాధానం రావడం కొసమెరుపు.సో ఫ్యామిలీ స్టార్ ఆన్ లైన్లో బాగానే టార్గెట్ అవుతున్నాడు. విజయ్ కు దీని మీద చాలా ఆశలున్నాయి. ఖుషి మీద బోలెడు నమ్మకం పెట్టుకుంటే వసూళ్లు బాగానే వచ్చాయి కానీ బ్లాక్ బస్టర్ స్థాయికి చేరుకోలేదు. కాకపోతే లైగర్ గాయాన్ని తగ్గించింది. గీత గోవిందం లాంటి అల్టిమేట్ హిట్ ఇచ్చిన దర్శకుడు కావడంతో పరశురామ్ మీద నిర్మాత దిల్ రాజు భారీ పెట్టుబడి పెట్టేశారు. లక్కీ గర్ల్ మృణాల్ ఠాకూర్ తో పాటు రష్మిక మందన్న చిన్న క్యామియో చేసిన ఈ ఎంటర్ టైనర్ లో గోపి సుందర్ సంగీతం మరో అట్రాక్షన్ గా నిలవనుంది. వారం ముందు వచ్చే టిల్లు స్క్వేర్ తప్ప ఎలాంటి పోటీ లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>