PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan2588cbf1-aa34-45c2-8ab6-12c306392c1d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan2588cbf1-aa34-45c2-8ab6-12c306392c1d-415x250-IndiaHerald.jpgపొత్తులు కష్టపడి కుదిర్చాను మూడు పార్టీల మధ్య 2014 నాటి బంధాన్ని పునరుద్దరించాను అని చెప్పుకుంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ పొత్తుల వల్ల సాధించింది ఏంటి అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాశం అయింది. ఈ పొత్తుల వల్ల పవన్ కి ఇచ్చే సీట్లు అంతకంతకు తగ్గి పోతున్నాయి. గత నెల 24న చంద్రబాబు పవన్ కూర్చొని విడుదల చేసిన జాబితా ప్రకారం జనసేనకు 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మధ్య దిల్లీ వెళ్లి బీజేపీతో పొత్తు కుదుర్చుకొని సమయంలో జనసేన ఎంపీ స్థానాల్లో ఒకటి తగ్గిందిpawan{#}Anakapalle;Pawan Kalyan;Janasena;Assembly;CBN;king;King;TDP;MP;Bharatiya Janata Partyపొత్తుల ఎత్తులు: పవన్‌ బలయ్యారా.. బలి చేశారా?పొత్తుల ఎత్తులు: పవన్‌ బలయ్యారా.. బలి చేశారా?pawan{#}Anakapalle;Pawan Kalyan;Janasena;Assembly;CBN;king;King;TDP;MP;Bharatiya Janata PartyWed, 13 Mar 2024 09:23:18 GMTపొత్తులు కష్టపడి కుదిర్చాను మూడు పార్టీల మధ్య 2014 నాటి బంధాన్ని పునరుద్దరించాను అని చెప్పుకుంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ పొత్తుల వల్ల సాధించింది ఏంటి అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాశం అయింది. ఈ పొత్తుల వల్ల పవన్ కి ఇచ్చే  సీట్లు అంతకంతకు తగ్గి పోతున్నాయి.


గత నెల 24న చంద్రబాబు పవన్ కూర్చొని విడుదల చేసిన జాబితా ప్రకారం జనసేనకు 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మధ్య దిల్లీ వెళ్లి బీజేపీతో పొత్తు కుదుర్చుకొని సమయంలో జనసేన ఎంపీ స్థానాల్లో ఒకటి తగ్గింది. అనకాపల్లి ఎంపీ సీటును జనసేన వదులుకున్నట్లు  ప్రచారం జరగుతుంది. ఇక తాజాగా గజేంద్ర సింగ్ షెకావత్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో గంటల తరబడి భేటీ అయి చర్చలు సాగించి అమాంతం బీజేపీ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలను పెంచేశారు.


ఆరు సీట్లలో పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆరు కాస్తా పది అయింది. అయితే పవన్ ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. వాస్తవానికి ఇప్పుడు టీడీపీకి అటు జనసేన, ఇటు బీజేపీ రెండింటి మద్దతు అత్యవసరం. అందుకు అనుగుణంగా చంద్రబాబు పావులు కూడా కదిపారు. కానీ జనసేన ఇంత స్థాయిలో సీట్లు తగ్గించుకొని చంద్రబాబు కోసం ఎందుకు త్యాగం చేయవలసి వచ్చిందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

ముందుగా అనుకున్న ప్రకారం బీజేపీ జనసేన కలిస్తే 175 స్థానాల్లో పోటీ చేయవచ్చు. కనీసం 50 స్థానాలపై ఫోకస్ చేస్తే కనీసం 20కి పైగా సొంతంగా గెలిచే అవకాశం ఉంటుంది. అప్పుడు టీడీపీ ఓటు బ్యాంకు కు గండి పడుతుంది. అప్పుడు ఈ రెండు పార్టీలే కింగ్ మేకర్ అయ్యేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు ఇచ్చిన 30 సీట్లలో ఫోకస్ చేసినా గెలిచేది ఆ 20 సీట్లే. ఇప్పుడు పవన్ తన సీట్లు త్యాగం చేసి మరీ పొత్తు ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఏమోచ్చింది అని జనసైనికులే ప్రశ్నిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>