Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2ef507a0-de5b-4977-a50a-51c2d49c939d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2ef507a0-de5b-4977-a50a-51c2d49c939d-415x250-IndiaHerald.jpgసయ్యద్ సోహెల్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ లో బుల్లితెరతో పాటు వెండితెర ప్రేక్షకులకు కూడా సోహెల్ సుప్రసిద్ధుడే. ప్రస్తుతం ఇతను హీరోగా ఎదిగేందుకు ఎంతగానో కష్టపడుతున్నాడు. గత ఏడాది ఆర్గానిక్ గా మామ హైబ్రీడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన సోహెల్.. ఇటీవల బూట్ కట్ బాలరాజు మూవీ తో వచ్చాడు. శ్రీ కొన్నేటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సోహెల్ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా సైతం వ్యవహరించాడు.ఫిబ్రవరి 2న విడుదలైన బూట్ కట్ బాలరాజు పరాజయం పాలయింది. ఆ సంగతి socialstars lifestyle{#}krishnaveni;Balaraju;Turmeric;Bigboss;Telangana;sree;television;Mister;Event;Athadu;Hero;gold;Industry;Tollywoodవైరల్ అవుతున్న బిగ్ బాస్ సోహెల్ ఆసక్తికర విషయాలు..!!వైరల్ అవుతున్న బిగ్ బాస్ సోహెల్ ఆసక్తికర విషయాలు..!!socialstars lifestyle{#}krishnaveni;Balaraju;Turmeric;Bigboss;Telangana;sree;television;Mister;Event;Athadu;Hero;gold;Industry;TollywoodWed, 13 Mar 2024 18:45:00 GMTసయ్యద్ సోహెల్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ లో బుల్లితెరతో పాటు వెండితెర ప్రేక్షకులకు కూడా సోహెల్ సుప్రసిద్ధుడే. ప్రస్తుతం ఇతను హీరోగా ఎదిగేందుకు ఎంతగానో కష్టపడుతున్నాడు. గత ఏడాది ఆర్గానిక్ గా మామ హైబ్రీడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన సోహెల్.. ఇటీవల బూట్ కట్ బాలరాజు మూవీ తో వచ్చాడు. శ్రీ కొన్నేటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సోహెల్ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా సైతం వ్యవహరించాడు.ఫిబ్రవరి 2న విడుదలైన బూట్ కట్ బాలరాజు పరాజయం పాలయింది. ఆ సంగతి పక్కన పెడితే.. సోహెల్ నటుడిగా ముఖ పరిచయమే తప్ప అతని పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఈ నేపథ్యంలోనే సోహెల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? సినిమాలోకి రాకముందు అతడు ఏం పని చేసేవాడు..? వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1991 ఏప్రిల్ 18న తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్‌లో సయ్యద్ సోహెల్ జన్మించాడు.

 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ అయిన సోహెల్ కు చిన్నతనం నుంచి సినిమాలు అంటే విపరీతమైన ఆసక్తి. ఆ ఆసక్తితోనే చదువు అనంతరం ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. ఎటువంటి సినీ నేపథ్యం లేకపోవడం వల్ల సోహెల్ కు అంత త్వరగా అవకాశాలు రాలేదు. దాంతో డబ్బుల కోసం క్యాటరింగ్ వర్క్ చేశాడు. వెడ్డింగ్ ఈవెంట్స్ లో క్యూ మెంబర్ గా పని చేశాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. ఆ సమయంలోనే కొత్త బంగారు లోకం చిత్రంలో అవకాశం వచ్చింది. ఇదే సోహెల్ ఫస్ట్ ఫిల్మ్‌. 2008లో విడుదలైన ఈ చిత్రంలో హీరో క్లాస్మేట్ గా సోహెల్‌ నటించాడు.ఆ తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అంతకుముందు ఆ తర్వాత, ఢీ ఫర్ దోపిడి, జనతా గ్యారేజ్ తదితర చిత్రాల్లో గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. అలాగే మరోవైపు సీరియల్స్‌ ద్వారా టెలివిజన్ రంగంపై అడుగు పెట్టాడు. పసుపు కుంకుమ, నాటిచరామి, కృష్ణవేణి వంటి సీరియస్ ద్వారా బుల్లితెరపై క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. తనదైన ఆటతీరు, ప్రవర్తతతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ షో తర్వాత సోహెల్ కు హీరోగా అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి. అలా యురేక, లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు.. ఇలా హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఎలాగైనా హీరోగా నిలదొక్కుకోవాలని తాపత్రయపడుతున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>