Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4dc61ae5-8676-4ac9-9537-c76b4e541d62-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4dc61ae5-8676-4ac9-9537-c76b4e541d62-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ లో సుధీర్‌, రష్మి జోడీ ఎంత పాపులర్‌ అయ్యిందో ఆ తర్వాత వర్ష, ఇమ్మాన్యుయెల్‌ జంట కూడా పాపులర్‌ అయ్యింది. అలాంటిది రష్మిపై ఇమ్మూ షాకింగ్‌ కామెంట్‌ చేశాడు.జబర్దస్త్ షోలో చాలా వరకు పెయిర్‌ని కలపడం కామన్‌గా మారింది. పెయిర్‌తో షోని రక్తికట్టిస్తూ టీఆర్‌పీ రేటింగ్‌ పెంచుకుంటుంటారు. సుడిగాలి సుధీర్‌, రష్మిల మధ్య, అలాగే వర్ష, ఇమ్మాన్యుయెల్‌ ల మధ్య, రాకేష్‌, సుజాతల మధ్య ఇలాంటి పులిహోర కలిపే ప్రోగ్రామ్‌ పెట్టారు. షోని రక్తికట్టించారు.ఇప్పుడు సుధీర్‌, రష్మి దూరమయ్యారు. ఇప్పుడు ఇమ్మాన్యుయెల్‌, వర్షలsocialstars lifestyle{#}gowtam;Pulihora;Aqua;varsha;Friday;prema;television;Raccha;marriage;Husband;Love;Manamసుధీర్‌ని వదిలేసి రష్మీ మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందా..??సుధీర్‌ని వదిలేసి రష్మీ మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందా..??socialstars lifestyle{#}gowtam;Pulihora;Aqua;varsha;Friday;prema;television;Raccha;marriage;Husband;Love;ManamTue, 12 Mar 2024 16:00:00 GMTజబర్దస్త్ లో సుధీర్‌, రష్మి జోడీ ఎంత పాపులర్‌ అయ్యిందో ఆ తర్వాత వర్ష, ఇమ్మాన్యుయెల్‌ జంట కూడా పాపులర్‌ అయ్యింది. అలాంటిది రష్మిపై ఇమ్మూ షాకింగ్‌ కామెంట్‌ చేశాడు.జబర్దస్త్ షోలో చాలా వరకు పెయిర్‌ని కలపడం కామన్‌గా మారింది. పెయిర్‌తో షోని రక్తికట్టిస్తూ టీఆర్‌పీ రేటింగ్‌ పెంచుకుంటుంటారు. సుడిగాలి సుధీర్‌, రష్మిల మధ్య, అలాగే వర్ష, ఇమ్మాన్యుయెల్‌ ల మధ్య, రాకేష్‌, సుజాతల మధ్య ఇలాంటి పులిహోర కలిపే ప్రోగ్రామ్‌ పెట్టారు. షోని రక్తికట్టించారు.ఇప్పుడు సుధీర్‌, రష్మి దూరమయ్యారు. ఇప్పుడు ఇమ్మాన్యుయెల్‌, వర్షల మధ్య కెమిస్ట్రీ పండిస్తూ రక్తికట్టించే ప్రోగ్రామ్‌ పెట్టుకుంటున్నారు. అయితే జోడీ మార్చడంతో చాలా సార్లు అది వర్కౌట్‌ కావడం లేదు. కానీ తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంతోఇంతో నవ్వులు పూయిస్తూనే ఉన్నారు.తాజాగా ఇమ్మాన్యుయెల్‌, వర్షలు కలిసి లేటెస్ట్ ఎపిసోడ్‌లో స్కిట్‌ చేశారు. అయితే ఈ సారి శ్రీకాంత్, రాశీ కలిసి నటించిన ప్రేమసి రావే సినిమాలోని శ్రీకాంత్‌, రాశీల మధ్య లవ్‌ సీన్లని తీసుకున్నారు. ఇందులో రాశీ కోసం శ్రీకాంత్‌ పడే తపన, రూమ్‌కి రమ్మని తన ప్రేమని వ్యక్తం చేసిన తీరుని స్పూఫ్‌ చేశారు ఇమ్మూ, వర్ష. ఈ సందర్భంగా వర్ష, ఇమ్మాన్యుయెల్‌ మధ్య ఇంట్రెస్టింగ్‌గా ట్రాక్‌ నడిచింది. ప్రేమపై మీ ఓపీనియన్‌ ఏంటని అడగ్గా, మనల్ని చాలా మంది ప్రేమిస్తారని, మనం మాత్రం ఒక్కరినే ప్రేమిస్తామని తెలిపింది వర్ష. ఆ ఒక్కరు ఎవరో చెప్పొచ్చు కదా సెట్‌ మొత్తం వెయిటింగ్‌ అని అడగ్గా వర్ష సిగ్గులు పోయింది.ఆ తర్వాత మీకు కావాల్సిన వాడు ఎలా ఉండాలో చెప్పాలని ఇమ్మాన్యుయెల్‌ అడగ్గా, ఆరు అడుగులుండాలని, సిక్స్ ప్యాక్‌ ఉండాలని తెలిపింది వర్ష. మరి మాకు తెలిసిన వాడికి అవన్నీ లేవు కదా అని ఇమ్మూ చెప్పగా, వెంటపడి కొట్టింది వర్ష. ఇది ఆద్యంతం నవ్వులు పూయించింది.ఇక బాబుతోని పెళ్లి చేసుకుని అతను వీల్‌ చైర్‌ నుంచి లేవలేని స్థితిలో ఉండగా, ఆయనకు వర్ష సపర్యాలు చేస్తుంది. అది చూసిన ఇమ్మాన్యుయెల్‌ కరిగిపోయాడు, కదిలిపోయాడు. వర్షని అలాంటి పరిస్థితిలో చూడలేకపోయాడు. భర్త పరిస్థితి చూసి మనిద్దరం పెళ్లి చేసుకుందామని ఇమ్మూ అడగ్గా, వర్ష రెచ్చిపోయింది. నీకేం తెలుసురా మా ప్రేమ అంటూ మండిపడింది.ఇక ఇమ్మాన్యూయెల్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇక్కడికి వచ్చి చూడవే, నీ పేరే వినిపిస్తుంది. ప్రవహించే ప్రతి నీటి బొట్టులోనూ నీ రూపమే కనిపిస్తుందని, మొగుడి కోసం ప్రియుడిని వదిలేసిన ప్రేయసి పతివ్రత అయితే, రష్మి కూడా పతివ్రతనేనే అంటూ రెచ్చిపోయాడు.వర్షతో గొడవ పడేంత వరకు బాగానే ఉంది. కానీ ఇందులోకి రష్మిపై అంత పెద్ద కామెంట్‌ చేయడం ఇప్పుడు రచ్చ అవుతుంది. యాంకర్‌ రష్మిపై ఇమ్మూ చేసిన షాకింగ్‌ కామెంట్‌ చర్చనీయాంశం అవుతుంది. ఈ గొడవకి, రష్మికి సంబంధమేంటనేది ఇప్పుడు పెద్ద ఇష్యూగా మారుతుంది.

ఇది విన్న యాంకర్‌ రష్మి సైతం నోరెళ్లబెట్టింది. ఇమ్మాన్యూయెల్‌ ఉద్దేశ్యమేంటి? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు. రష్మి కూడా మొగుడి కోసం ప్రియుడిని వదిలేసిందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. రష్మి ఆ పని చేసిందా? మున్ముందు చేయబోతుందా? అనేది మరో చర్చకు తావిస్తుంది.రష్మి గౌతమ్‌, సుడిగాలి సుధీర్‌ లవర్స్ అనే ప్రచారం ఇప్పటి వరకు జరుగుతుంది. కానీ ఈ మధ్య ఈ ఇద్దరు దూరమయ్యారు. సుధీర్‌ టీవీ షో మానేయడంతో ఇద్దరి మధ్య గ్యాప్‌ పెరిగింది. అయితే ఇమ్మాన్యుయెల్‌ కామెంట్స్ వెనుక అర్థం రష్మి.. సుధీర్‌ని వదిలేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందా? మొగుడి కోసం సుధీర్‌ని వదిలేస్తుందా? అనే చర్చ స్టార్ట్ చేశారు.మొత్తానికి ఫన్‌ కోసం చేసిన ఈ స్కిట్‌ ఆద్యంతం నవ్వులు పూయించింది. ఈ సందర్భంగా రష్మి గౌతమ్‌ రియాక్షన్స్ మాత్రం అదిరిపోయేలా ఉండటం విశేషం. ఈ ప్రోమో వైరల్‌ అవుతుంది. ఈ శుక్రవారం ఈటీవీలో ఇది ప్రసారం కానున్న విషయం తెలిసిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>