MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2b68eb68-ecdf-44f0-9c9d-24741750ae0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2b68eb68-ecdf-44f0-9c9d-24741750ae0e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణంగా ఇతర భాషల్లో సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి అని తెలిసిన తర్వాత ఆ సినిమాలని తెలుగులో రీమేక్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు విక్టరీ వెంకటేష్. అలా ఇప్పుడు బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్న ఒక సినిమాకి రీమేక్ చేయాలి అని అనుకుంటున్నాడట వెంకటేష్. ఇక ఆ సినిమా మరేదో కాదు సైతాన్. బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అజయ్ దేవగన్ జ్యోతిక కలిసి నటించిన ఈ సినిమా లో మాధవన్ విలన్ గా కనిపించాడు. కాగా ఈ tollywood{#}Venkatesh;Ajay Devgn;Madhavan;anil ravipudi;dil raju;Gujarat - Gandhinagar;bollywood;Cinema;Hindi;Blockbuster hit;Remake;Saturday;Hero;Success;Manamమరో రీమేక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకటేష్..!?మరో రీమేక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకటేష్..!?tollywood{#}Venkatesh;Ajay Devgn;Madhavan;anil ravipudi;dil raju;Gujarat - Gandhinagar;bollywood;Cinema;Hindi;Blockbuster hit;Remake;Saturday;Hero;Success;ManamTue, 12 Mar 2024 18:10:00 GMTటాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణంగా ఇతర భాషల్లో సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి అని తెలిసిన తర్వాత ఆ సినిమాలని తెలుగులో రీమేక్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు విక్టరీ వెంకటేష్. అలా ఇప్పుడు బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్న ఒక సినిమాకి రీమేక్ చేయాలి అని అనుకుంటున్నాడట  వెంకటేష్. ఇక ఆ సినిమా మరేదో కాదు సైతాన్. బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

అజయ్ దేవగన్ జ్యోతిక కలిసి నటించిన ఈ సినిమా లో మాధవన్ విలన్ గా కనిపించాడు. కాగా ఈ సినిమాకి మొదట మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ దాని తర్వాత వసూళ్ల పరంగా మాత్రం మంచి సక్సెస్ అందుకుంది అని చెప్పాలి. ఇక ముంబైలో శనివారం వీకెండ్ అర్ధరాత్రి కూడా వేశారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో. కాగా గుజరాత్ లో వష్ గా వచ్చిన ఈ  బ్లాక్ బస్టర్ మూవీకి రీమేక్ గా సైతాన్ సినిమాను హిందీలో రీమేక్ చేశారు. ఇప్పుడు వెంకీ చూపు 'వష్‌' మీద పడింది అంటున్నారు.

ఆ సినిమాను తీసుకొని ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టు మార్పులు చేయించి సినిమా చేద్దాం అనుకుంటున్నారట. అయితే 'సైతాన్' సినిమాలో మాధవన్ వన్ మ్యాన్ షో చేశాడు. పేరుకే విలన్‌ అయినా… సినిమాలో హీరో తరహాలో ఎలివేషన్లు, సీన్లు ఉన్నాయట. దీంతో తెలుగులో అలానే తీస్తారా? లేక మారుస్తారా అనేది చూడాలి. ఒకవేళ హిందీ తరహాలో వెళ్తే హీరోయిజం సరిగ్గా ఉండదు, పండదు కూడా.  వెంకటేశ్‌ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా చేస్తారని టాక్‌. ఈ సినిమాకు 'సంక్రాంతికి వస్తున్నాం' అనే పేరు కూడా పరిశీలనలో ఉందట. ఈ సినిమా తర్వాత 'రానా నాయుడు' సీజన్ 2 ఉంటుందట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>