MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ... నందమూరి నట సింహం బాలకృష్ణ ... విజయ్ దేవరకొండ ... మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో అల్లు అర్జున్ మరియు మరి కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధిtelugu shutings{#}Balakrishna;lion;Ramoji Film City;Vishakapatnam;Allu Arjun;Tollywood;vijay deverakonda;Chiranjeevi;Hero;Cinemaబన్నీ.. బాలయ్య.. విజయ్.. చిరు మూవీ షూటింగ్ వివరాలు ఇవే..!బన్నీ.. బాలయ్య.. విజయ్.. చిరు మూవీ షూటింగ్ వివరాలు ఇవే..!telugu shutings{#}Balakrishna;lion;Ramoji Film City;Vishakapatnam;Allu Arjun;Tollywood;vijay deverakonda;Chiranjeevi;Hero;CinemaTue, 12 Mar 2024 23:01:51 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ... నందమూరి నట సింహం బాలకృష్ణ ... విజయ్ దేవరకొండ ... మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీ గా ఉన్నారు . ఇక పోతే ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఏ ప్రాంతం లో జరుగుతున్నాయి అనే వివరాలను తెలుసు కుందాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో అల్లు అర్జున్ మరియు మరి కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామోజీ ఫిలిం సిటీ లో బాలకృష్ణ పై ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు మల్టిపుల్ లొకేషన్ లలో విజయ్ దేవరకొండ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హైదరాబాదు లోని ఓ ప్రాంతంలో ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేక సెట్ లో ఈ మూవీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ నాలుగు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>