Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohirj8e770e3a-1a66-4ad9-984c-e80c1393a04f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohirj8e770e3a-1a66-4ad9-984c-e80c1393a04f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత జట్టుకు మూడు ఫార్మట్లలో కూడా సారధిగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మకు ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంలో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతూ ఏకంగా ముంబై చెట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించిన సారధిగా ఉన్న రోహిత్ శర్మను ఆ జట్టు యాజమాన్యం అర్ధాంతరంగా సారాధ్య బాధ్యతలు నుంచి తప్పించింది. ఈ క్రమంలోనే రోహిత్ లాంటి వ్యక్తిని ఇక కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని అభిమానులు ఎవరు కూడా జీర్ణించుకోలRohirj{#}Ambati Rayudu;Rohit Sharma;MS Dhoni;Chennai;Mumbai;Yevaru;News;Indian;CricketCSK కెప్టెన్ గా రోహిత్.. అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు?CSK కెప్టెన్ గా రోహిత్.. అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు?Rohirj{#}Ambati Rayudu;Rohit Sharma;MS Dhoni;Chennai;Mumbai;Yevaru;News;Indian;CricketTue, 12 Mar 2024 14:15:00 GMTప్రస్తుతం భారత జట్టుకు మూడు ఫార్మట్లలో కూడా సారధిగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మకు ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంలో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతూ ఏకంగా ముంబై చెట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించిన సారధిగా ఉన్న రోహిత్ శర్మను ఆ జట్టు యాజమాన్యం అర్ధాంతరంగా సారాధ్య బాధ్యతలు నుంచి తప్పించింది. ఈ క్రమంలోనే రోహిత్ లాంటి వ్యక్తిని ఇక కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని అభిమానులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.


 అందరూ రోహిత్ లాంటి కెప్టెన్ మాకు దొరికితే బాగుండు.. అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు అని భావిస్తుంటే ముంబై ఇండియన్స్ మాత్రం కెప్టెన్ గా ఉన్న రోహిత్ ని ఆ బాధ్యతలనుంచి పక్కన పెట్టడం విడ్డూరంగా ఉంది అంటూ ఎంతో మంది విమర్శలు కూడా చేశారు. ఈ క్రమంలోనే రానున్న ఐపీఎల్ సీజన్ లో రోహిత్ ముంబైని వీడి మరో జట్టులోకి వెళ్లి కెప్టెన్సీ చేపట్టే అవకాశం ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏ జట్టుకు రోహిత్ కెప్టెన్ గా మారితే బాగుంటుంది అనే విషయంపై కొంతమంది మాజీ ఆటగాళ్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు.


 ఇక ఇదే విషయంపై ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ అంబటి రాయుడు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ కి రోహిత్ నాయకత్వం వహించాలి అంటూ అభిప్రాయపడ్డాడు. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని రూమర్స్ వస్తున్నాయి. ఇక ఈ రూమర్స్ నేపథ్యంలో ఒకవేళ ధోని రిటైర్ అయితే.. గనక 2025 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రోహిత్ ఆడాలని కోరుకుంటున్నా.. రోహిత్ కూడా ధోనిలా నాయకత్వం వహించగలరుడు. మరో ఐదారేళ్లపాటు రోహిత్ ఐపీఎల్ ఆడగలడు. ఏ జట్టుకు కెప్టెన్ అవ్వాలనుకున్న అవుతాడు అని ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అంబటి రాయుడు. అయితే రోహిత్ శర్మ సన్రైజర్స్ కు కెప్టెన్ అవ్వాలని మరి కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>