BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-tipsa1e0f02a-b9d4-44fa-b40f-099470b94107-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-tipsa1e0f02a-b9d4-44fa-b40f-099470b94107-415x250-IndiaHerald.jpgతలలో దురద రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. చెమట, చుండ్రు, తల చర్మం పొడిబారడం, తల చర్మం యొక్క పిహెచ్ స్థాయిలల్లో మార్పులు రావడం, హార్మోన్ల అసమతుల్యత, తలలో వైరస్ ఇంకా అలాగే బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ లు రావడం ఇలా చాలా కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. తలలో దురద వంటి సమస్యతో బాధపడే వారు చాలా రకాల షాంపులను, నూనెలను వాడుతూ ఉంటారు. ఇలా షాంపులను వాడడంతో పాటు ఇప్పుడు చెప్పే కొన్ని టిప్స్ పాటించడం వల్ల కూడా ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.తలలో దురద సమస్యతో బాధపడే వారు రసాయనాలు కలిగిన షాంపులకు బBeauty Tips{#}Neemతలలో దురద తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి?తలలో దురద తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి?Beauty Tips{#}NeemTue, 12 Mar 2024 14:50:59 GMTతలలో దురద రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. చెమట, చుండ్రు, తల చర్మం పొడిబారడం, తల చర్మం యొక్క పిహెచ్ స్థాయిలల్లో మార్పులు రావడం, హార్మోన్ల అసమతుల్యత, తలలో వైరస్ ఇంకా అలాగే బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ లు రావడం ఇలా చాలా కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. తలలో దురద వంటి సమస్యతో బాధపడే వారు చాలా రకాల షాంపులను, నూనెలను వాడుతూ ఉంటారు. ఇలా షాంపులను వాడడంతో పాటు ఇప్పుడు చెప్పే కొన్ని టిప్స్ పాటించడం వల్ల కూడా ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.తలలో దురద సమస్యతో బాధపడే వారు రసాయనాలు కలిగిన షాంపులకు బదులుగా యాపిల్ సైడ్ వెనిగర్, పెరుగు, గుడ్డు, బేకింగ్ సోడా, నిమ్మరసం వంటి వాటిని వాడాలి. అలాగే పుదీనా, టీ ట్రీ, జోజోబా, వేప నూనెలను వాడడం వల్ల దురద నుండి ఉపశమనం కలుగుతుంది. తల చర్మానికి రక్తప్రసరణ పెరిగేలా మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దురద తగ్గడంతో పాటు జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది.పోషకాలు కూడా చక్కగా అందుతాయి. అదే విధంగా తలస్నానం చేసేటప్పుడు వేడి నీటిని ఉపయోగించడం మానేయాలి.


చల్లటి నీరు లేదా గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వేడి నీళ్లతో తలస్నానం చేయడం వల్ల తలచర్మంపై ఉండే సహజ నూనెలు తొలగిపోయి చర్మం పొడిబారుతుంది. అలాగే వారానికి మూడుసార్లు మాత్రమే తలస్నానం చేయాలి. ఇక తలచర్మం పొడిబారకుండా ఉండాలంటే నీటిని ఎక్కువగా తాగాలి. నీటిని తాగడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అలాగే రోజూ సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.తలలో దురద సమస్యతో బాధపడే వారు ముందుగా ఇతరుల దువ్వెనలను, దిండ్లను, టోపీలను వాడడం మానేయాలి. అలాగే వీరి దువ్వెనలను కూడా ఇతరులు వాడవద్దు. తలలో దురద సమస్యను తగ్గించడంలో కలబంద జెల్ కూడా ఎంతగానో సహాయపడుతుంది. తల చర్మానికి కలబంద గుజ్జు రాసి 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలచర్మం పొడిబారకుండా ఉంటుంది. తల చర్మానికి తగిన తేమ అందుతుంది. దురద కూడా తగ్గుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>