PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjp-3822ff0c-5554-4611-a34b-d81f2571def2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjp-3822ff0c-5554-4611-a34b-d81f2571def2-415x250-IndiaHerald.jpgనగేష్ ను పార్టీలోకి చేర్చుకున్న విషయమై బంజారా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. మొత్తంమీద అధిష్టానం ఆలోచనలు ఏమిటో ఒకపట్టాన ఎవరికీ అర్ధంకావటంలేదు. నగేష్ ను చేర్చుకోవటం అంటే రాబోయే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వటం కోసమే అని అందరికీ అర్ధమవుతోంది. అయితే బాపూరావుకు టికెట్ ఇవ్వటంలేదని కాని, నగేష్ కే టికెట్ కేటాయించబోతున్నట్లు కాని అధిష్టానం ఎక్కడా ప్రకటించలేదు. దాంతో పార్టీలో ఏమి జరుగుతోందో కూడా చాలామందికి అర్ధంకావటంలేదు. telangana bjp {#}Adilabad;Delhi;MLA;Yevaru;Party;Bharatiya Janata Party;MPతెలంగాణా : బీజేపీలో ఆదిలాబాద్ చిచ్చు ?తెలంగాణా : బీజేపీలో ఆదిలాబాద్ చిచ్చు ?telangana bjp {#}Adilabad;Delhi;MLA;Yevaru;Party;Bharatiya Janata Party;MPTue, 12 Mar 2024 09:00:00 GMT

వీలైనంత తొందరగా తెలంగాణాలో ఎంపీ టికెట్లను ప్రకటించాలని అధిష్టానం ఎంత గట్టిగా ప్రయత్నిస్తోందో అంతగా జాప్యంజరుగుతోంది. తాజాగా పార్టీలో ఆదిలాబాద్ చిచ్చు మొదలైంది. పార్టీ తరపున ఇప్పటికి తొమ్మిదిమంది అభ్యర్ధులను ప్రకటించారు. ఇందులో నలుగురు సిట్టింగ్ ఎంపీలుండగా ముగ్గురికి మాత్రమే టికెట్లను అధిష్టానం ప్రకటించింది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు టికెట్ ను పెండింగులో పెట్టింది. ఎందుకు పెండింగులో పెట్టిందనే విషయం ఎవరికీ తెలీదు.





ఒకవైపు టికెట్ పెండింగులో పెట్టడమే కాకుండా మరోవైపు మాజీ ఎంపీ నగేష్ ను పార్టీలో చేర్చుకున్నది. దాంతో బాపూరావు మద్దతుదారులంతా నానా గోలచేస్తున్నారు. దీంతో పాటు మాజీ ఎంపీలు రమేష్ రాథోడ్, మాజీ ఎంఎల్ఏ రాథోడ్ బాపూ అండ్ కో ఢిల్లీ బాటపట్టారు. వీళ్ళంతా ఢిల్లీకి ఎందుకు వెళ్ళారనే విషయం కూడా ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇదే సమయంలో నగేష్ ను పార్టీలో చేర్చుకోవటాన్ని ఆదిలాబాద్ బీజేపీలో చాలామంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో పార్టీలో గందరగోళం పెరిగిపోతోంది.





నగేష్ ను పార్టీలోకి చేర్చుకున్న విషయమై బంజారా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. మొత్తంమీద అధిష్టానం ఆలోచనలు ఏమిటో ఒకపట్టాన ఎవరికీ అర్ధంకావటంలేదు. నగేష్ ను చేర్చుకోవటం అంటే రాబోయే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వటం కోసమే అని అందరికీ అర్ధమవుతోంది.  అయితే బాపూరావుకు టికెట్ ఇవ్వటంలేదని కాని, నగేష్ కే టికెట్ కేటాయించబోతున్నట్లు కాని అధిష్టానం ఎక్కడా ప్రకటించలేదు. దాంతో పార్టీలో ఏమి జరుగుతోందో కూడా చాలామందికి అర్ధంకావటంలేదు.





బాపూరావుకు టికెట్ ఇచ్చే విషయాన్ని అధిష్టానం పెండింగులో ఉంచింది. ఈ విషయంమీదైనా క్లారిటి ఇస్తే మిగిలిన విషయాలు నెమ్మదిగా అందరికీ అర్ధమవుతాయి. కాని ఏ విషయమూ చెప్పకుండా, క్లారిటి ఇవ్వకుండా ఎందుకని పెండింగ్ పెట్టిందో అర్ధంకావటంలేదు. ఈ విషయం తేల్చుకోవటానికే ఆదిలాబాద్ జిల్లాలోని బీజేపీ నేతలంతా ఢిల్లీ బాటపట్టారు. సడెన్ డెవలప్మెంటుతో ఆదిలాబాద్ టికెట్ విషయం చివరకు ఏమి జరుగుతుందో కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. మరీ గందరగోళం ఎప్పటికి సెట్ అవుతుందో చూడాలి.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>