EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modif6e72366-ca2f-435a-8c23-0746c1c1fbae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modif6e72366-ca2f-435a-8c23-0746c1c1fbae-415x250-IndiaHerald.jpgఎదురు చూపులకు శుభం కార్డు పడింది. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదిరింది. ఎవరికి ఎన్ని సీట్లు అన్నది కూడా క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ దేశంలో అధికార పక్షంగా ఉన్న బీజేపీ ఆరేళ్ల తర్వాత కలిశాయి. దీంతో రెండు పార్టీలకు ఇది మంచి ఊతం ఇస్తుందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. తమ పొత్తు సత్తాను వైసీపీకి చాటి చెప్పాలని టీడీపీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 17న చిలకలూరిపేటలో నిర్వహించే సభను వేదికగా చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే పొత్తులో భాగంగా టmodi{#}Tadepalli;TDP;Jagan;YCP;CBN;Andhra Pradesh;Father;KCR;Janasena;Prime Minister;Narendra Modi;Bharatiya Janata Party;Congress;Partyమోదీకి ఆంధ్రా ఊహించని ఇబ్బంది..?మోదీకి ఆంధ్రా ఊహించని ఇబ్బంది..?modi{#}Tadepalli;TDP;Jagan;YCP;CBN;Andhra Pradesh;Father;KCR;Janasena;Prime Minister;Narendra Modi;Bharatiya Janata Party;Congress;PartyTue, 12 Mar 2024 07:22:16 GMTఎదురు చూపులకు శుభం కార్డు పడింది. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదిరింది. ఎవరికి ఎన్ని సీట్లు అన్నది కూడా క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ దేశంలో అధికార పక్షంగా ఉన్న బీజేపీ ఆరేళ్ల తర్వాత కలిశాయి. దీంతో రెండు పార్టీలకు ఇది మంచి ఊతం ఇస్తుందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.


తమ పొత్తు సత్తాను వైసీపీకి చాటి చెప్పాలని టీడీపీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 17న చిలకలూరిపేటలో నిర్వహించే సభను వేదికగా చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన లు కలిసి సంయుక్తంగా తాడేపల్లి గూడెం, మంగళగిరిలో భారీ సభలు నిర్వహించింది. ఇప్పుడు ఇందులోకి బీజేపీ యాడ్ అవ్వడంతో చిలకలూరిపేటను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.


ఈ సభకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీని టీడీపీ అధినేత చంద్రబాబు ఆహ్వానించారు. ఒకవేళ తేదీలు వీలు కాకపోతే అటూ ఇటూ అయినా ఎదురుచూసి భారీ బహిరంగా సభ నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది. అయితే మోదీ ఎక్కడికి వెళ్లినా తన మాటలతో అక్కడి ప్రజలను ఆకట్టుకుంటారు. తన ప్రసంగంతో ఓట్లరను తన వైపునకు తిప్పుకుంటారు. పైగా మూడు పార్టీలు కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తే అది పార్టీ శ్రేణుల్లోకి ఉత్సాహం నింపుతుందని ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు.


ప్రధాని ఏ రాష్ట్రంలో పర్యటించినా అక్కడి ప్రతిపక్ష పార్టీల అవినీతిపై ప్రశ్నిస్తారు.  ఆ తర్వాత కుటుంబ పార్టీల నినాదాన్ని ఎత్తుకుంటారు. యూపీలో అఖిలేష్ యాదవ్, తమిళనాడులో స్టాలిన్, బిహార్ లో లాలూ ప్రసాద్, తెలంగాణలో కేసీఆర్ ఇలా కుటుంబ పార్టీలుగా అభివర్ణిస్తారు. కుటుంబ పార్టీలకు ఓటు వేయోద్దని పిలుపినిస్తారు. కానీ ఏపీ లో ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే టీడీపీ కూడా కుటుంబ పార్టీయే కాబట్టి.  మరోవైపు జగన్ కుటుంబ పార్టీ అందామంటే.. ఆయన తన తండ్రి పార్టీ అయిన కాంగ్రెస్ ను విభేదించి సొంతంగా వైసీపీ స్థాపించి అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఈ సారి ఏపీలో మోదీ ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>