Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-18777d9a-727c-4ceb-8373-e3054e61b157-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-18777d9a-727c-4ceb-8373-e3054e61b157-415x250-IndiaHerald.jpgనేటి రోజుల్లో పరిస్థితులు చూస్తూ ఉంటే సాటి మనిషిని ముట్టుకుంటే పాపం పలకరిస్తే నేరం అనే విధంగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే తెలిసినవాళ్లు కదా అంటూ పలకరించిన కూడా వాళ్ళు ఎక్కడ ఫీలయ్యి ఏం చేసుకుంటారో అనే అందరూ భయపడిపోతున్నారు. ఎందుకంటే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు ఇలాగే ఉన్నాయి. ఒకప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడి ఎదురుకునేవాడు మనిషి. పరిస్థితులను బట్టి విచక్షణతో వ్యవహరించేవాడు. కానీ ఇటీవల కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఒక్కటే ఆత్మహత్య అన్న విధంగా మనిషి ఆలోచSuicide {#}Sucide;Parents;Siddipet;Uri;marriage;policeతరచూ పుట్టింటికి వస్తున్న కూతురు.. తల్లి అలా చేయొద్దన్నందుకు.. ఏం చేసిందో తెలుసా?తరచూ పుట్టింటికి వస్తున్న కూతురు.. తల్లి అలా చేయొద్దన్నందుకు.. ఏం చేసిందో తెలుసా?Suicide {#}Sucide;Parents;Siddipet;Uri;marriage;policeTue, 12 Mar 2024 08:50:00 GMTనేటి రోజుల్లో పరిస్థితులు చూస్తూ ఉంటే సాటి మనిషిని ముట్టుకుంటే పాపం పలకరిస్తే నేరం అనే విధంగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే తెలిసినవాళ్లు కదా అంటూ పలకరించిన కూడా వాళ్ళు ఎక్కడ ఫీలయ్యి ఏం చేసుకుంటారో అనే అందరూ భయపడిపోతున్నారు. ఎందుకంటే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు ఇలాగే ఉన్నాయి.  ఒకప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడి ఎదురుకునేవాడు మనిషి.  పరిస్థితులను బట్టి విచక్షణతో వ్యవహరించేవాడు. కానీ ఇటీవల కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఒక్కటే ఆత్మహత్య అన్న విధంగా మనిషి ఆలోచన తీరు మారిపోయింది.



 వెరసి చిన్న చిన్న సమస్యలకు కూడా కుంగిపోతూ అక్కడితో జీవితం ముగిసిపోయింది అని భావిస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజు రోజుకు తెర మీదకి వస్తూనే ఉన్నాయి. ఏకంగా తల్లిదండ్రులు మందలించిన.. స్నేహితులతో గొడవ జరిగినా.. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా.. ఇలా ఏ చిన్న విషయం జరిగిన కూడా చివరికి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇక ఇలాంటి తరహా ఘటనలు చూస్తూ ఉంటే సభ్య సమాజం తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కూడా ఇలాంటి ఒక విషాదకర ఘటనే. సాధారణంగా తల్లిదండ్రులు అన్న తర్వాత పిల్లలకు మంచి చెడు చెబుతూ కొన్ని కొన్ని సార్లు మందలిస్తూ ఉంటారు.


 ఇలా మందలించడంలో తప్పు కూడా ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఓ తల్లి కూతురుని మందలించడమే చివరికి కూతురు ప్రాణం పోవడానికి కారణమైంది. తల్లి మందలించిందని ఒక వివాహిక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో జరిగింది. సోమలపల్లికి చెందిన చిగుళ్ల నరసింహులు కుమార్తె నవనీతకు ఏడాదిన్నర క్రితం మరుపడ్గకు చెందిన యాదగిరితో పెళ్లి జరిగింది.  అయితే పెళ్లి తర్వాత నవనీత తరచూ పుట్టింటికి వస్తూ ఉండడంతో.. అలా చేయకూడదు. పెళ్లయ్యాక అత్తారింట్లోనే ఉండి బాధ్యతగా వ్యవహరించాలి అంటూ తల్లి మందలించింది. దీంతో మనస్థాపం చెందిన నవనీత చివరికి ఇంట్లో ఉరి వేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>