Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/smithc82e47e1-eb56-4c80-8e40-3f3a378530b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/smithc82e47e1-eb56-4c80-8e40-3f3a378530b3-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఉన్నప్పుడు దేని వాల్యూ తెలియదు. లేనప్పుడే దాని యొక్క అసలు వాల్యూ తెలుస్తూ ఉంటుంది అనే ఒక మాట అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మాట కేవలం కొన్ని సందర్భాలలో మాత్రమే కాదు అన్ని సందర్భాలలో కూడా సరిగ్గా సరిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ విషయంలోనూ ఇక ఈ పోలిక సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా జట్టు తరుపున ఆడుతున్న సమయంలో.. అతని విలువ ఎవరికి తెలియలేదు. ఇక ఆస్ట్రేలియా క్రికెట్ అయితే అతనికి పెద్దSmith{#}Cricket;Australiaవార్నర్ వాల్యూ.. క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇప్పుడు తెలిసొస్తుందిగా?వార్నర్ వాల్యూ.. క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇప్పుడు తెలిసొస్తుందిగా?Smith{#}Cricket;AustraliaTue, 12 Mar 2024 12:30:00 GMTసాధారణంగా ఉన్నప్పుడు దేని వాల్యూ తెలియదు. లేనప్పుడే దాని యొక్క అసలు వాల్యూ తెలుస్తూ ఉంటుంది అనే ఒక మాట అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మాట కేవలం కొన్ని సందర్భాలలో మాత్రమే కాదు అన్ని సందర్భాలలో కూడా సరిగ్గా సరిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ విషయంలోనూ ఇక ఈ పోలిక సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా జట్టు తరుపున ఆడుతున్న సమయంలో.. అతని విలువ ఎవరికి తెలియలేదు. ఇక ఆస్ట్రేలియా క్రికెట్ అయితే అతనికి పెద్దగా గుర్తింపును కూడా ఇవ్వలేదు. ఏకంగా అతనిపై విధించిన జీవితకాల కెప్టెన్సీ నిషేధం విషయంలో కాస్తయినా కనికరం చూపించలేకపోయింది.


 ఈ విషయంపై డేవిడ్ వార్నర్ ఎన్నిసార్లు అసంతృప్తిని వ్యక్తం చేసిన అటు క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం తమ ఆలోచన తీరులో మార్చుకోలేదు. అయితే అతను ఎంతలా ఆస్ట్రేలియా జట్టు తరుపున అద్భుతమైన ప్రదర్శనలు చేసిన మిగతా క్రికెటర్లకు ఇచ్చిన ప్రాధాన్యత మాత్రం అతనికి ఇవ్వలేదు. అయితే ఇక ఇప్పుడు డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించారు. టెస్టులతో పాటు వన్డే ఫార్మాట్ నుంచి కూడా వీడ్కోలు తీసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. కేవలం టి20 ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతూ ఉన్నాడు. అయితే అతను జట్టులో ఉన్నప్పుడు ఓపెనర్ గా అతను అద్భుతంగా రాణిస్తూ అందించిన ఆరంబాల విలువ ఎవరికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అతను దూరమైన తర్వాత అతని వ్యాల్యూ ఏంటో అందరికీ అర్థమవుతుంది.


 ఎందుకంటే డేవిడ్ వార్నర్ రిటర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇక జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న స్మిత్ కి ఓపెనింగ్ బాధ్యతలు అప్పగించింది క్రికెట్ ఆస్ట్రేలియా. కానీ అతను మాత్రం ఓపెనర్ గా అసలు ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఎనిమిది ఇన్నింగ్స్ లలో 28.5 సగటుతో 171 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వీటిలో ఒక్క అర్థ సెంచరీ మాత్రమే ఉంది. స్మిత్ లాంటి అనుభవిజ్ఞుడు డేవిడ్ వార్నర్ ను మరిపిస్తాడు అనుకుంటే ఇక ఇప్పుడు డేవిడ్ వార్నర్ లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అయితే ఇక స్మిత్ ఆటతీరుతో  అతని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అతనికి అచ్చోచ్చిన రెగ్యులర్ స్థానంలోనే బ్యాటింగ్కు పంపాలని ఓపనర్ గా మరొకరిని పంపితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు అభిమానులు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>