Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle362bcfc6-4768-4521-9a1c-eea58e1be26a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle362bcfc6-4768-4521-9a1c-eea58e1be26a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ యువ హీరో కిరణ్ అబ్బవరం త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ కోసం ముహూర్తం సైతం ఖరారైనట్లు తెలుస్తున్నది.ఈ నెల 13న ఇద్దరూ ఎంగేజ్‌మెంట్‌ జరుగనున్నట్లు సమాచారం. అయితే, వధువు ఎవరూ అంటూ అందరూ ఆరా తీస్తున్నారు. కిరణ్‌ అబ్బవరం తొలిచిత్రం 'రాజావారు రాణిగారు' హీరోయిన్‌ రహస్య గోరక్‌ను పెళ్లి చేసుకోనున్నారు. ఇద్దరు తొలి సినిమాతోనే ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. మొదటల్లో స్నేహితులుగా ఉన్నా.. ఆ తర్వాత ప్రేమగా మారిందని టాలీవుడ్‌లో టాక్‌. గతంలో ఇద్దరూ పలు జంటగా వెకేషన్స్‌కు వsocialstars lifestyle{#}wednesday;vishnu;Yuva;marriage;Cinema;News;kiran;Tamilపెళ్లి పీటలు ఎక్కనున్నా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం...!!!పెళ్లి పీటలు ఎక్కనున్నా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం...!!!socialstars lifestyle{#}wednesday;vishnu;Yuva;marriage;Cinema;News;kiran;TamilTue, 12 Mar 2024 13:45:00 GMTటాలీవుడ్‌ యువ హీరో కిరణ్ అబ్బవరం త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ కోసం ముహూర్తం సైతం ఖరారైనట్లు తెలుస్తున్నది.ఈ నెల 13న ఇద్దరూ ఎంగేజ్‌మెంట్‌ జరుగనున్నట్లు సమాచారం. అయితే, వధువు ఎవరూ అంటూ అందరూ ఆరా తీస్తున్నారు. కిరణ్‌ అబ్బవరం తొలిచిత్రం 'రాజావారు రాణిగారు' హీరోయిన్‌ రహస్య గోరక్‌ను పెళ్లి చేసుకోనున్నారు. ఇద్దరు తొలి సినిమాతోనే ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. మొదటల్లో స్నేహితులుగా ఉన్నా.. ఆ తర్వాత ప్రేమగా మారిందని టాలీవుడ్‌లో టాక్‌. గతంలో ఇద్దరూ పలు జంటగా వెకేషన్స్‌కు వెళ్లారు.ఇద్దరు ప్రేమను దాచేందుకు ప్రయత్నించినా.. ఇద్దరు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోల్లో బ్యాక్‌గ్రౌండ్‌లో లొకేషన్‌ ఒకటే ఉండంతో తెలిసిపోయేది. అయితే, గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో రహస్య పేరు వినిపించగానే కిరణ్ అబ్బవరం తెగ సిగ్గుపడిపోయారు. రహస్యతో ప్రేమలో ఉన్నారా? అని ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు మెలికలు తిరిగినా అసలు విషయం దాటవేశారు. తాజాగా ఇద్దరు తమ ఐదేళ్ల ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారని టాక్‌. బుధవారం వీరి ఇంగేజ్‌మెంట్‌ హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో జరుగనున్నట్లు తెలుస్తున్నది. కుటుంబ సభ్యులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారని.. ఆగస్టులో పెళ్లి జరుగనున్నదని సమాచారం. మరో వైపు అభిమానులు ప్రేమజంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇదిలా ఉండగా.. కిరణ్‌ అబ్బవరం 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎస్‌ఆర్‌ కల్యాణమండపం, సెబాస్టియన్ పీసీ, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరోభాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రుక్సార్‌ థిల్లాన్‌ హీరోయిన్‌గా కనిపించనున్నారట. షూటింగ్‌ సైతం చివరి దశకు వచచిందని.. ఈ చిత్రానికి దిల్‌ రూబా టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాక్‌ ఈ చిత్రంపై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. అయితే, రహస్య గోరక్‌ రాజావారు రాణిగారు చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత తమిళ చిత్రం 'షర్బత్‌'లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత మరే సినిమా చేయలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>