MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgసంక్రాంతి సినిమాల తరువాత ప్రేక్షకులు సినిమాలను పట్టించుకోవడం పూర్తిగా మానివేయడంతో ధియేటర్లు అన్నీ కలక్షన్స్ లేక బోసిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్న సినిమా ‘గామి’ సాధారణంగా రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు ఒక సినిమాను 2 నుండి 3 సంవత్సరాల సమయంలో తీస్తూ ఉంటాడు. అయితే ‘గామి’ సినిమా పూర్తి చేయడానికి 6 సంవత్సరాలు పట్టింది. నిర్మాత ఆర్ధికసమస్యలు వల్ల కాదు. ఈ సినిమాను క్వాలిటీ పరంగా చాల బాగా తీయాలి అన్న దర్శకుడి ఆలోచన వల్ల. ఈ సినిమాలోని విజువల్స్ చూసిన visweksen{#}Episode;Darsakudu;Rajamouli;Hollywood;Hero;producer;Producer;Director;Audience;Cinema;Indiaటాలీవుడ్ కి పాఠాలు నేర్పుతున్న గామి !టాలీవుడ్ కి పాఠాలు నేర్పుతున్న గామి !visweksen{#}Episode;Darsakudu;Rajamouli;Hollywood;Hero;producer;Producer;Director;Audience;Cinema;IndiaMon, 11 Mar 2024 08:00:00 GMTసంక్రాంతి సినిమాల తరువాత ప్రేక్షకులు సినిమాలను పట్టించుకోవడం పూర్తిగా మానివేయడంతో ధియేటర్లు అన్నీ కలక్షన్స్ లేక బోసిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్న సినిమా ‘గామి’ సాధారణంగా రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు ఒక సినిమాను 2 నుండి 3 సంవత్సరాల సమయంలో తీస్తూ ఉంటాడు.



అయితే ‘గామి’ సినిమా పూర్తి చేయడానికి 6 సంవత్సరాలు పట్టింది. నిర్మాత ఆర్ధికసమస్యలు వల్ల కాదు. ఈ సినిమాను క్వాలిటీ పరంగా చాల బాగా తీయాలి అన్న దర్శకుడి ఆలోచన వల్ల. ఈ సినిమాలోని విజువల్స్ చూసిన ప్రేక్షకులు ఈ సినిమా భారీ సినిమాలోని వజువల్స్ స్థాయిలో ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు అంటే ఒక కొత్త దర్శకుడి సమర్థత ఎలా ఉందో అర్థం అవుతుంది.    



ఈసినిమాకు పబ్లిసిటీ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ఈమూవీని మొదటిరోజు మొదటి షో చూసిన ప్రేక్షకులు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో ఈ మూవీకి ప్రేక్షకుల నుండి స్పందన బాగానే వస్తోంది. అఘోరాల నేప‌థ్యంలో వ‌చ్చే తొలి ఎపిసోడ్ నుంచే ఈమూవీ విజువ‌ల్‌ గా క‌ట్టిప‌డేస్తుంది. ఆ త‌ర్వాత మ‌హా కుంభ‌మేళా హిమాల‌యాలు అలాగే ఇండియా చైనా బోర్డ‌ర్లో ఉండే ఒక సీక్రెట్ లేబొరేట‌రీ ఇలా అన్ని సన్నివేశాలు ప్రేక్షకులను మరొక లోకానికి తీసుకు వెళ్లిపోతాయి.



ఇక సీక్రెట్ ల్యాబ్ లో వ‌చ్చే సీన్ల‌యితే హాలీవుడ్ సినిమాల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా క్వాలిటీ పరంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అంతా కొత్తవాళ్ళు. బడ్జెట్ పరంగా ఈ సినిమాకు భారీ బడ్జెట్ లేదు. టాప్ హీరోలను పెట్టుకుని వందల కోట్లు గుమ్మరించుకుని రొటీన్ సినిమాలు తీసే మన భారీ నిర్మాతలు ‘గామి’ నుండి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రొటీన్ సినిమాలకు భిన్నంగా హీరో విశ్వక్ సేన్ చేసిన ఈ ప్రయోగానికి ప్రశంసలు బాగా వస్తున్నాయి..  








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>