EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/vhandrababu08d373b8-33c4-413f-87f8-ca9536701f25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/vhandrababu08d373b8-33c4-413f-87f8-ca9536701f25-415x250-IndiaHerald.jpgఎట్టకేలకు అనుకున్నది అనుకున్నట్లుగా బీజేపీతో పొత్తు కోసం తెగ ప్రయత్నించిన చంద్రబాబు దానిని సాధించగలిగారు. ఈ మేరకు దిల్లీలో ఆ పార్టీ అగ్రనేతలతో పవన్ కల్యాణ్ తో కలిసి సమావేశం అయ్యారు. ఇరు పార్టీల మధ్య పొత్తు పొడిచింది. ఈమేరకు ప్రకటనలు కూడా విడుదల చేశారు. సీట్ల విషయమై స్పష్టత రాకున్నా.. మరో రెండు రోజుల్లో దీనిపై కూడా అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మేరకు.. బీజేపీ జనసేన కి కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రతిపాదననే ఆయన బీvhandrababu{#}mithra;AdiNarayanaReddy;Pawan Kalyan;advertisement;MP;Janasena;TDP;Assembly;Bharatiya Janata Party;Party;CBNబాబు ప్లాన్‌: పొత్తు పొత్తే.. వెన్నుపోటు వెన్నుపోటే?బాబు ప్లాన్‌: పొత్తు పొత్తే.. వెన్నుపోటు వెన్నుపోటే?vhandrababu{#}mithra;AdiNarayanaReddy;Pawan Kalyan;advertisement;MP;Janasena;TDP;Assembly;Bharatiya Janata Party;Party;CBNMon, 11 Mar 2024 09:00:00 GMTఎట్టకేలకు అనుకున్నది అనుకున్నట్లుగా బీజేపీతో పొత్తు కోసం తెగ ప్రయత్నించిన చంద్రబాబు దానిని సాధించగలిగారు. ఈ మేరకు దిల్లీలో ఆ పార్టీ అగ్రనేతలతో పవన్ కల్యాణ్ తో కలిసి సమావేశం అయ్యారు. ఇరు పార్టీల మధ్య పొత్తు పొడిచింది. ఈమేరకు ప్రకటనలు కూడా విడుదల చేశారు. సీట్ల విషయమై స్పష్టత రాకున్నా.. మరో రెండు రోజుల్లో దీనిపై కూడా అధికారిక ప్రకటన రానుంది.


ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మేరకు..  బీజేపీ జనసేన కి కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు.  ఈ ప్రతిపాదననే ఆయన బీజేపీ పెద్దల వద్ద పెట్టారు. అయితే ఇప్పటికే జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు , మూడు ఎంపీ సీట్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంటే బీజేపీకి ఆరు ఎంపీ, ఐదు లేదా ఆరు లోక్ సభ స్థానాలు దక్కనున్నాయి.


ఆది నుంచి చంద్రబాబు వ్యూహం ఏంటంటే.. 145 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులనే బరిలో దింపాలి. ఇందులో 100కి పైగా స్థానాలు గెలిచి.. ఒంటరిగా అధికారం దక్కించుకోవాలి. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎవరిపై ఆధారపడకూడదు. అందుకే మిత్ర పక్షాలకు 30 సీట్లే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఇచ్చారు కూడా. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు 24 సీట్లు కేటాయించి ఆయన్ను ఒప్పించగలిగారు. బీజేపీని ఆరు సీట్లకే పరిమితం చేశారు.


దీనిని బట్టి గమనిస్తే చంద్రబాబు ఎక్కడా కూడా తగ్గలేదని కనిపిస్తోంది. తద్వారా 30 సీట్లకే పరిమితం చేయాలన్న చంద్రబాబు పంతం నెగ్గిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం ఇంత తక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు తమ అధిష్ఠానం ఒప్పుకోదని భావించారు.  కనీసం 15 స్థానాలు అయినా ఇస్తారని ఆశించారు. కానీ టీడీపీ అధినేత తన చాణక్యంతో బీజేపీ పెద్దలను తన బుట్టలో వేసుకోగలిగారు.  తాను అనుకున్నది సాధింగలిగారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>