Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cricket-94294c22-737a-4f82-bdb8-57a3d12ee419-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cricket-94294c22-737a-4f82-bdb8-57a3d12ee419-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడూ ఎవరి కెరియర్ ఎలా మలుపు తిరుగుతుంది అని ఊహించడం చాలా కష్టం. కొంతమంది కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకునీ చివరికి సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏకంగా వ్యక్తిగత కారణాలతో కెరీర్ నాశనం చేసుకుంటూ ఉంటారు ఇక మరి కొంతమంది ఏకంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే చెడు వ్యసనాలకు బానిసలుగా మారిపోయి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఇలాంటి హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి లిస్టులో రచన బెనరCricket {#}bus;rachana;srikanth;Bengali;Chiranjeevi;Car;marriage;Industry;Hindi;Congress;Venkateshమందుకు బానిసైన చిరంజీవి హీరోయిన్.. ఇప్పుడు ఎంపీగా పోటీ?మందుకు బానిసైన చిరంజీవి హీరోయిన్.. ఇప్పుడు ఎంపీగా పోటీ?Cricket {#}bus;rachana;srikanth;Bengali;Chiranjeevi;Car;marriage;Industry;Hindi;Congress;VenkateshMon, 11 Mar 2024 09:40:00 GMTసినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడూ ఎవరి కెరియర్ ఎలా మలుపు తిరుగుతుంది అని ఊహించడం చాలా కష్టం. కొంతమంది కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకునీ చివరికి సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏకంగా వ్యక్తిగత కారణాలతో కెరీర్ నాశనం చేసుకుంటూ ఉంటారు  ఇక మరి కొంతమంది ఏకంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే చెడు వ్యసనాలకు బానిసలుగా మారిపోయి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఇలాంటి హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి లిస్టులో రచన బెనర్జీ పేరు కూడా ఉంటుంది.


 ఇప్పుడంటే ఈమె పేరు పెద్దగా సినీ ప్రేక్షకులకు తెలియదు. కానీ ఒకానొక టైం లో ఈమె తన అందం అభినయంతో కుర్రర్ కారు ఆరాధ్య దేవతగా మారిపోయింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ఇలా ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న అందరితో కూడా సినిమాల్లో నటించింది. ఉపేంద్ర, జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి హీరోల సరసన కూడా నటించి సూపర్ హిట్లు కొట్టింది. కేవలం తెలుగులో మాత్రమే కాదు ఒడియా, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించింది ఈమె. మెగాస్టార్ చిరంజీవితో బావగారు బాగున్నారా,  శ్రీకాంత్ తో కన్యాదానం, మావిడాకులు, పిల్లనచ్చింది సినిమాల్లో నటించి మెప్పించింది.


 ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్గా కొనసాగుతున్న రచన బెనర్జీ ఒక్కసారిగా కనుమరుకైపోయింది. ఆమె ఇలా ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం చెడు వ్యసనాలకు బానిసలుగా మారిపోవడమే   మద్యం సిగరెట్లకు బానిసగా మారింది రచన బెనర్జీ. చేతిలో ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకుంది. చివరికి అప్పుల పాలు అయింది. ఇక బెంగాలీ సినీ పరిశ్రమకు చెందిన ప్రోబల్ బస్సు అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. ఇక తర్వాత చెడు అలవాటులకు దూరమై గృహిణిగా బాధ్యతగా మెలిగింది. అయితే ఇక ఇప్పుడు ఏకంగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపింది. పశ్చిమ బెంగాల్లో ఎంపీగా పోటీ చేయబోతుంది. హుగ్లీ నియోజకవర్గం నుంచి ఎంపిక పోటీ చేస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన వార్త వైరల్ గా మారిపోయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>