MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/oscars-2024--oppenheimer4b9b8bc6-4f24-4106-8b08-cf1ba3e3f792-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/oscars-2024--oppenheimer4b9b8bc6-4f24-4106-8b08-cf1ba3e3f792-415x250-IndiaHerald.jpg96వ ఆస్కార్ అవార్డులను జూరీ ప్రకటించింది. ఆస్కార్స్ 2024లో అసలు ఎవరూ ఊహించిన విధంగా క్రిస్టోఫర్ నోలాన్ ఓపెన్‌హైమర్ పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అవతార్, అవేంజర్స్ రేంజ్ లో వసూళ్లు రాబట్టలేకపోయినా మంచి ప్రశంసలు మాత్రం దక్కించుకుంది.ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్కోర్, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ చలనచిత్ర ఎడిటింగ్ తో కలిపి ఏకంగా ఏడు అవార్డులను ఈ సినిమా కైవసం చేసుకుంది.సిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ మూవీలో వారి పాత్రలకు ఉత్తమ నటుడు , ఉత్తమ సహాయ నటుడి విభాగాలOscars 2024 - Oppenheimer{#}Husband;Christopher Nolan;Red;Oscar;Jr NTR;Hero;Cinema;Wife2024 ఆస్కార్స్ లో సత్తా చాటిన ఓపెన్‌హైమర్!2024 ఆస్కార్స్ లో సత్తా చాటిన ఓపెన్‌హైమర్!Oscars 2024 - Oppenheimer{#}Husband;Christopher Nolan;Red;Oscar;Jr NTR;Hero;Cinema;WifeMon, 11 Mar 2024 13:38:42 GMT96వ ఆస్కార్ అవార్డులను జూరీ ప్రకటించింది. ఆస్కార్స్ 2024లో అసలు ఎవరూ ఊహించిన విధంగా క్రిస్టోఫర్ నోలాన్ ఓపెన్‌హైమర్ పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అవతార్, అవేంజర్స్ రేంజ్ లో వసూళ్లు రాబట్టలేకపోయినా మంచి ప్రశంసలు మాత్రం దక్కించుకుంది.ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్కోర్, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ చలనచిత్ర ఎడిటింగ్ తో కలిపి ఏకంగా ఏడు అవార్డులను ఈ సినిమా కైవసం చేసుకుంది.సిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ మూవీలో వారి పాత్రలకు ఉత్తమ నటుడు , ఉత్తమ సహాయ నటుడి విభాగాలకు గాను అకాడమీ అవార్డును గెలుచుకున్నారు. అలాగే ఎమిలీ బ్లంట్ ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేట్ అయింది. ది హోల్డోవర్స్‌లో పాత్రకు గాను డావిన్ జాయ్ రాండోల్ఫ్ ఈ విభాగంలో ఆస్కార్ గెలుపొందారు.ఇక హీరో సిలియన్ మర్ఫీ తన భార్య వైవోన్నే మెక్‌గిన్నిస్‌తో కలిసి 96వ అకాడమీ అవార్డులకు వచ్చారు. అతను ఈ 2024 ఆస్కార్ రెడ్ కార్పెట్ వేదికపై ఆధునిక ప్లీటెడ్ వైట్ షర్ట్ , హై-వెయిస్ట్ బ్లాక్ స్ట్రెయిట్-ఫిట్టెడ్ ప్యాంట్‌.. శాటిన్ నాచ్ లాపెల్‌తో టైలర్డ్ బ్లేజర్ లో తో స్టైల్ ఐకాన్ ని తలపించాడు.


అలాగే ప్రపంచం మెచ్చిన సూపర్ హీరో ఐరన్ మ్యాన్ పాత్రతో అదరగొట్టిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఓపెన్‌హైమర్‌లో తన పాత్రకు ఉత్తమ సహాయ నటుడు అకాడమీ అవార్డును గెలుచుకోవడంతో .. ఇది తన కెరీర్ లో మొదటి ఆస్కార్ గా రికార్డులకెక్కింది. రాబర్ట్ తన భార్య సుసాన్ డౌనీతో కలిసి ఈ రెడ్ కార్పెట్ మీదికి వచ్చాడు. ఒపెన్‌హైమర్ లో అత్యుత్తమ నటనకు గాను ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేట్ అయిన ఎమిలీ బ్లంట్, ఆస్కార్ 2024 రెడ్ కార్పెట్‌లో షియాపరెల్లి నుండి అద్భుతమైన కస్టమ్ డ్రెస్‌లో కనిపించి కనువిందు చేసింది. ఆమె తన భర్త జాన్ క్రాసిన్స్కితో కలిసి అకాడమీ అవార్డ్స్‌కు హాజరైంది. ఇక ఓపెన్ హైమర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 960.8 మిలియన్ డాలర్ల వసూళ్ళని రాబట్టింది.ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే 100 మిలియన్ డాలర్లు అయింది. ఇక 2024 ఆస్కార్స్ లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'బార్బీ' సాంగ్ 'వాటీజ్ ఐ మేడ్ ఫర్' గెలిచింది.బిల్లీ ఐలిష్ ఈ సాంగ్ ని పాడగా, ఫిన్నియాస్ ఒకానెల్ రచించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>