Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny50c7911d-22b9-495f-88ca-4930328b2cb4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny50c7911d-22b9-495f-88ca-4930328b2cb4-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంతటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021 లో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ హట్టు కొట్టింది. అయితే ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకి సినీ ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది అని చెప్పాలి. ఇక అల్లు అర్జున్ ను టాలీవుడ్ నుంచి ఏకంగా పాన్ ఇండియా రేంజ్ హీరోగా మార్చేసింది పుష్ప సినిమా. ఇక ఇప్పుడు ఈ మూవీకి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాపై ఉన్న అంచనాల గురించి ఎంత చెప్పినా తక్కBunny{#}sukumar;Joseph Vijay;Ajay Devgn;Fidaa;Arjun;Allu Arjun;Tollywood;shankar;India;Indian;Cinema;Hindiఅల్లు అర్జున్ కి కొత్త చిక్కులు.. 'పుష్ప 2' విషయంలో వెనక్కి తగ్గాల్సిందేనా?అల్లు అర్జున్ కి కొత్త చిక్కులు.. 'పుష్ప 2' విషయంలో వెనక్కి తగ్గాల్సిందేనా?Bunny{#}sukumar;Joseph Vijay;Ajay Devgn;Fidaa;Arjun;Allu Arjun;Tollywood;shankar;India;Indian;Cinema;HindiMon, 11 Mar 2024 10:30:00 GMTఅల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంతటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021 లో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ హట్టు కొట్టింది. అయితే ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకి సినీ ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది అని చెప్పాలి. ఇక అల్లు అర్జున్ ను టాలీవుడ్ నుంచి ఏకంగా పాన్ ఇండియా రేంజ్ హీరోగా మార్చేసింది పుష్ప సినిమా. ఇక ఇప్పుడు ఈ మూవీకి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాపై  ఉన్న అంచనాల గురించి ఎంత చెప్పినా తక్కువే.


 పుష్ప 2 మూవీ తప్పకుండా 1000 కోట్లకు పైగా గ్రాస్ రాబడుతుంది అనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తామని.. ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీ కోసం అటు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కు పుష్ప మూవీ విషయంలో కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా వసూళ్లకి ఇతర పరిశ్రమలకు చెందిన బడా సినిమాలు గండి కొట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పుష్ప 2 సినిమాని ఆగస్టు 15న విడుదల చేస్తామని ప్రకటించేశారు.


 అయితే అదే సమయంలో హిందీ సూపర్ హిట్ మూవీ సీక్వల్ అయిన సింగం అగైన్ ఆగస్టు 15న విడుదల కాబోతుంది. అజయ్ దేవగన్ ఈ మూవీలో హీరో. ఇక ఈ సిరీస్ కి మంచి క్రేజ్ ఉంది అని చెప్పాలి.  ఇక ఈ సినిమా ఆగస్టు 15న విడుదలయితే నార్త్ లో పుష్ప 2 వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక తమిళనాట విజయ్ హీరోగా నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమాని ఆగస్టు 15న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇక కమల్ హాసన్, శంకర్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన ఇండియన్ 2 సినిమా రిలీజ్ ని కూడా ఇదే డేట్ లో ఫిక్స్ చేసే అవకాశం ఉంది. దీంతో పుష్ప 2కి కావాల్సిన థియేటర్లు దొరకపోవడంతో.. పాటు కలెక్షన్లకు భారీగా గండిపడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఏమైనా వెనక్కి తగ్గి విడుదల తేదీని మారుస్తాడా.. లేదంటే పోటీలోకి దిగుతాడు అన్నది ఆసక్తికరంగా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>