MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rachana-benarju-tmc-party-mpcfd3a03f-1bc1-4729-9a69-c251d9e6a3cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rachana-benarju-tmc-party-mpcfd3a03f-1bc1-4729-9a69-c251d9e6a3cb-415x250-IndiaHerald.jpgప్రస్తుతం లోక్ సభ ఎన్నికల హడావిడి అప్పుడే మొదలవుతోంది. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రధాన పార్టీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించేస్తూ ముందుకు వెళుతున్నారు.. ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థులను సైతం విడతల వారీగా ప్రకటిస్తూ ఉన్నారు.. ఇప్పుడు తాజాగా TMC తరపున పశ్చిమబెంగాలలో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులను సైతం మమతా బెనర్జీ ఇటీవలే ప్రకటించారు. ఇందులో 42 మంది అభ్యర్థులను సైతం ప్రకటించింది. ఇందులో క్రికెటర్ యూసఫ్ పఠాన్ తో పాటు బాలీవుడ్ నటుడు శత్రుజ్ఞ సింహాను కూడా ప్రకటించడం జరిగింది. RACHANA BENARJU;TMC;PARTY;MP{#}benarjee;rachana;srikanth;Bengali;Mamta Mohandas;television;Chiranjeevi;Telugu;Heroine;Tamil;bollywood;West Bengal - Kolkata;Party;Bharatiya Janata Party;MP;Successపొలిటికల్ పరంగా ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ హీరోయిన్..!!పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ హీరోయిన్..!!RACHANA BENARJU;TMC;PARTY;MP{#}benarjee;rachana;srikanth;Bengali;Mamta Mohandas;television;Chiranjeevi;Telugu;Heroine;Tamil;bollywood;West Bengal - Kolkata;Party;Bharatiya Janata Party;MP;SuccessMon, 11 Mar 2024 07:00:00 GMTప్రస్తుతం లోక్ సభ ఎన్నికల హడావిడి అప్పుడే మొదలవుతోంది. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రధాన పార్టీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించేస్తూ ముందుకు వెళుతున్నారు.. ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థులను సైతం విడతల వారీగా ప్రకటిస్తూ ఉన్నారు.. ఇప్పుడు తాజాగా TMC తరపున పశ్చిమబెంగాలలో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులను సైతం మమతా బెనర్జీ ఇటీవలే ప్రకటించారు. ఇందులో 42 మంది అభ్యర్థులను సైతం ప్రకటించింది. ఇందులో క్రికెటర్ యూసఫ్ పఠాన్ తో పాటు బాలీవుడ్ నటుడు శత్రుజ్ఞ సింహాను కూడా ప్రకటించడం జరిగింది.


అయితే ఇప్పుడు ఈ జాబితా లోనే ప్రముఖ తెలుగు హీరోయిన్ కూడా టికెట్ అందుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. ఆ హీరోయిన్ ఎవరో కాదు రచన బెనర్జీ.. పశ్చిమ బెంగాలలోని హుగ్లి నుంచి మమతా బెనర్జీ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయబోతోంది రచన. రచన బెనర్జీ తెలుగులో చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సినిమాలో నటించడమే కాకుండా శ్రీకాంత్ తో కలిసి కన్యాదానం జగపతిబాబు తో మావిడాకులు వంటి సూపర్ హిట్ చిత్రాలలో కూడా నటించింది.


రచన బెనర్జీ తెలుగు తమిళ్ కన్నడ బెంగాలీ ఒరియా వంటి భాషలలో కూడా ఎన్నో చిత్రాలలో నటించింది. గత కొంతకాలంగా ఈమె సినిమాలకు దూరమైనప్పటికీ.. పలు రకాల బెంగాల్ సీరియల్స్ లో టీవీ షోలలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇప్పుడు TMC పార్టీ తరపున రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తూ బిజీగా గడిపేయాలని చూస్తోంది. గత ఎన్నికలలో ఎంపీగా గెలిచిన హీరోయిన్ నుజ్రత్ జహాన్ కు ఈసారి సీటు కేటాయించలేదు. ఇటీవల కాలంలో చాలామంది సిని సెలబ్రెటీలు సైతం రాజకీయాల పరంగా ఎంట్రీ ఇవ్వాలని మక్కువ చూపుతున్నారు.. మరి పొలిటికల్ పరంగా రచన బెనర్జీ సక్సెస్ కావాలని అభిమానులైతే కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>