Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodde4a2ad5-976c-4456-b73e-4038d72d042a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodde4a2ad5-976c-4456-b73e-4038d72d042a-415x250-IndiaHerald.jpgమిల్కి బ్యూటీ తమన్న గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు గత దశాబ్దన్నర కాలం నుంచి కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ. తన అందం అభినయంతో ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా ప్రత్యేకమైన గుర్తింపు కూడా సంపాదించుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించింది ఈ సొగసరి. ఇక ప్రస్తుతం యంగ్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్న హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా జోడి కడ్డీ అదరగొట్టింది. ఇక ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను తన ఖాతTollywood{#}ashok;sampath nandi;tamannaah bhatia;BEAUTY;Heroine;Director;Cinema19 ఏళ్ల కెరియర్లో.. ఇలాంటి డైరెక్టర్ ను చూడలేదు : తమన్నా19 ఏళ్ల కెరియర్లో.. ఇలాంటి డైరెక్టర్ ను చూడలేదు : తమన్నాTollywood{#}ashok;sampath nandi;tamannaah bhatia;BEAUTY;Heroine;Director;CinemaMon, 11 Mar 2024 11:15:00 GMTమిల్కి బ్యూటీ తమన్న గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు గత దశాబ్దన్నర కాలం నుంచి కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ. తన అందం అభినయంతో ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా ప్రత్యేకమైన గుర్తింపు కూడా సంపాదించుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించింది ఈ సొగసరి. ఇక ప్రస్తుతం యంగ్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్న హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా జోడి కడ్డీ అదరగొట్టింది. ఇక ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. అయితే ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.



 ఇంకోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది అని చెప్పాలి.  అయితే ప్రస్తుతం తమన్న ప్రధాన పాత్రలో ఓదెలా 2 అనే సినిమా తెరకెక్కుతుంది  అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పార్ట్ అటు ఓటీటీలో విడుదలై మంచి గుర్తింపును సంపాదించుకుంది అన్న విషయం తెలిసిందే . ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఇక ఈ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్పాలి. కాగా ఈ సినిమాకు సంపత్ నంది రూపొందిస్తున్నారు. ఇకపోతే ఓదెలా 2 సినిమా గురించి, డైరెక్టర్ సంపత్ నంది గురించి హీరోయిన్ తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


 సినిమా అనేది ఒక్కరి ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. కానీ అంతిమంగా సమిష్టి కృషితో పూర్తవుతుంది. సంపత్ నంది ప్రతి విభాగంలోని వారి ప్రతిభను గుర్తిస్తారు. ఆయన లాంటి డైరెక్టర్లు నేను ఇప్పటి వరకు చూడలేదు. అలా వచ్చిందే ఓదెల 2 ఫస్ట్ లుక్. దీని వెనుక ఎంతో మంది కృషి ఉంది. ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను అంటూ తమన్న చెప్పుకొచ్చింది. కాగా 2020లో ఓదెల రైల్వే స్టేషన్ సినిమా ఓటిటి వేదికగా విడుదలైంది. అశోక్ తేజ దర్శకత్వంలో డి మధు తో కలిసి సంపత్ నంది ఈ సినిమాను నిర్మించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతున్న ఓదెలా 2పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>