Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rape5caae46c-decb-40aa-896e-33e716ec3ff0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rape5caae46c-decb-40aa-896e-33e716ec3ff0-415x250-IndiaHerald.jpgఈ లోకంలో ఆడపిల్లలుగా పుట్టడమే మేము చేసిన పాపమా..? ఆడపిల్లగా పుడితే ఇంత దుర్భరమైన జీవితాన్ని గడపాల్సిందేనా? ఎప్పుడు ఎవడు దాడి చేసి లైంగిక వేధింపులకు పాల్పడతాడో అని భయపడుతూ బ్రతకాల్సిందేనా?.. ఓ దేవుడా మమ్మల్ని ఈ భూమి మీద ఎందుకు ఆడపిల్లల పుట్టించావ్.. ప్రస్తుతం ప్రతి ఒక ఆడపిల్ల వేదన కూడా ఇదే. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని అనుక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ప్రతి ఆడపిల్లకు ఏర్పడింది. ఇక వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఆడపిల్లల రక్షణ ఎంత ప్రRape{#}Traffic police;Police Station;Parents;Girl;police;Hyderabadపాఠాలు చెప్పాల్సిన టీచర్ కామంతో ఊగిపోయాడు.. చివరికి?పాఠాలు చెప్పాల్సిన టీచర్ కామంతో ఊగిపోయాడు.. చివరికి?Rape{#}Traffic police;Police Station;Parents;Girl;police;HyderabadMon, 11 Mar 2024 09:30:00 GMTఈ లోకంలో ఆడపిల్లలుగా పుట్టడమే మేము చేసిన పాపమా..? ఆడపిల్లగా పుడితే ఇంత దుర్భరమైన జీవితాన్ని గడపాల్సిందేనా? ఎప్పుడు ఎవడు దాడి చేసి లైంగిక వేధింపులకు పాల్పడతాడో అని భయపడుతూ బ్రతకాల్సిందేనా?.. ఓ దేవుడా మమ్మల్ని ఈ భూమి మీద ఎందుకు ఆడపిల్లల పుట్టించావ్.. ప్రస్తుతం ప్రతి ఒక ఆడపిల్ల వేదన కూడా ఇదే. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని అనుక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ప్రతి ఆడపిల్లకు ఏర్పడింది. ఇక వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఆడపిల్లల రక్షణ ఎంత ప్రశ్నార్థకంగా మారిపోయింది అన్నది అర్థమవుతూనే ఉంది.



 ఏకంగా ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న మానవ మృగాలు ప్రతి చోట కూడా కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కూడా మహిళకు రక్షణ అనేది పూర్తిగా కనుమరుగైపోయింది అని చెప్పాలి. అయితే ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన దగ్గర చదువుకుంటున్న విద్యార్థులను సొంత కూతురు లాగా భావించి విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను చేయాల్సిన ఉపాధ్యాయుడు.. నీచమైన బుద్ధితో ఆలోచించాడు. ఈ క్రమంలోనే తన దగ్గర చదువుకుంటున్న బాలికపైనే కన్నేసి చివరికి కిడ్నాప్ చేసి మరీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.


 బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది అని చెప్పాలి  బోరబండ లోని ఓ పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల బాలిక కనిపించడం లేదని.. తల్లిదండ్రులు ఈనెల 8వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంబించారు. ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికపై కన్నేసిన ఉపాధ్యాయుడు.. ఏకంగా ఆ బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడినట్లు ఇక గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలోనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>