Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef65e166f-d62f-46c6-970e-c9046384b5ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef65e166f-d62f-46c6-970e-c9046384b5ce-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటన కల్గిన ఈయన ఎన్నెన్నో సినిమాల్లో హీరోగా చేశారు.అనేక మంది స్టార్ హీరోయిన్లతో కలిసి పని చేసిన ఈయనను అందరూ ఇష్ట పడేవారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తనకు వచ్చిన పెళ్లి ప్రపోజల్స్ గురించి చెప్పారు. ముఖ్యంగా అలనాటి అందాల తార శ్రీదేవిని తనకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మురళీ మోహన్ అసలు పేరు మాగంటిsocialstars lifestyle{#}editor mohan;poorna;tara;Athadu;Chitram;Sridevi Kapoor;Manam;marriage;Director;Telugu;Cinemaఆ టాప్ హీరోయిన్లతో పెళ్లి మిస్ చేసుకున్న మురళీమోహన్..???ఆ టాప్ హీరోయిన్లతో పెళ్లి మిస్ చేసుకున్న మురళీమోహన్..???socialstars lifestyle{#}editor mohan;poorna;tara;Athadu;Chitram;Sridevi Kapoor;Manam;marriage;Director;Telugu;CinemaSun, 10 Mar 2024 16:30:00 GMTటాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటన కల్గిన ఈయన ఎన్నెన్నో సినిమాల్లో హీరోగా చేశారు.అనేక మంది స్టార్ హీరోయిన్లతో కలిసి పని చేసిన ఈయనను అందరూ ఇష్ట పడేవారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తనకు వచ్చిన పెళ్లి ప్రపోజల్స్ గురించి చెప్పారు. ముఖ్యంగా అలనాటి అందాల తార శ్రీదేవిని తనకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మురళీ మోహన్ అసలు పేరు మాగంటి రాజబాబు. అయితే ఈయన ముందుగా వ్యాపారం చేసేవారు. అయితే సినీ ఇండస్ట్రీలో తనకు స్నేహితులు ఎక్కువగా ఉండడం... అందులో ఆయన చూసేందుకు బాగుండడంతో నువ్వు కూడా సినిమాలు చేయు అంటూ చెప్పేవారట. మొదట్లో తాను పట్టించుకోకపోయినప్పటికీ.. అట్లూరి పూర్ణ చంద్రరావు పిలిచి ఆయనకు సినిమా అవకాశం ఇస్తానని చెప్పారట. దీంతో నో చెప్పలేక సినిమా చేశారట. రెండేళ్ల పాటు అటు బిజినెస్ చేస్తూనే ఇటు సినిమాలు చేశారట.
అయితే ఆయన ఎంట్రీ ఇచ్చిన రెండేళ్ల తర్వాత ఆఫర్లు ఎక్కువవడం ప్రారంభం కావండతో పూర్తిగా బిజినెస్ మానేసి సినిమాల్లోకి వచ్చారట. అయితే అప్పటికే ఆయనకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసిన శ్రీదేవి హీరోయిన్ గా తొలి చిత్రం ఈయనతోనే చేసిందట. ఆ తర్వాత కూడా వీరిద్దరూ కలిసి చాలా చిత్రాలు చేయడంతో.. సెట్ కు వచ్చిన శ్రీదేవి తల్లి మురళీ మోహన్ ను చూసిందట. చాలా మంచివాడు, అందగాడు.. అనుకుని తన కూతురు శ్రీవేదిని ఈయనకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుందట.

అయితే ఈ విషయం కూతురు శ్రీవేదికి చెప్పకుండానే.. తనకు తెలిసిన వాళ్లను అడగ్గా ఆయనకు పెళ్లి అయిపోయిందని చెప్పారట. కానీ ఆమె దీని గురించి నమ్మకపోయేసరికి మనం ఓసారి వాళ్ల ఇంటికి వెళ్దాం అతడు నా స్నేహితుడే అంటూ శ్రీదేవితో పాటు ఆమె తల్లిని ఈయన ఇంటికి తీసుకు వచ్చారట. ఇలా మురళీ మోహన్ భార్యా, పిల్లలను చూసిన ఆమె అప్పుడు నమ్మి పెళ్లి ఊసు ఎత్తలేదట. అయితే ఆ తర్వాత కొంత కాలానికి ఈయన జయచిత్రతో కలిసి ఎక్కువ చిత్రాలు చేయడంతో.. ఆమెది, ఈయనది కలిపి పేపర్ లో ఫొటోలు వేశారట.వీళ్లిద్దరూ కలిసి పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందట. అయితే అదంతా చూసిన ఆయన చాలా భయపడ్డారట. ఇదేం లేదండీ నాకు ఇప్పటికే పెళ్లి అయిపోయిందని చెప్పినా కొంతమంది వినలేదట. కానీ ఈయనను హీరోను చేసిన డైరెక్టర్ అట్లూరి వెంటనే తన వద్దకు వచ్చి పేపర్ చూపించి... ఇదేంటని అడిగారట. అదేం లేదండి.. నేను ఇలాంటి పని అస్సలే చేయను అంటూ చెప్పగా.. గుడ్.. ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నా వదులుకో అంటూ వివరించారట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>