EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/cbn87963321-5100-4b50-97fe-260e0417268e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/cbn87963321-5100-4b50-97fe-260e0417268e-415x250-IndiaHerald.jpgఉమ్మడి ఏపీ సీఎంగా హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశాను అని చెప్పుకునే చంద్రబాబు లో ప్రచార ఆర్భాటం ఎక్కువే. ఇక ఆయన సీఎంగా ఉండగా జరిగిన అవకతవకలు, అవినీతి వ్యవహారాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపిన ప్రతిసారీ చంద్రబాబు అనుకూల మీడియా అవన్నీ తప్పు అంటుంది. అది చంద్రబాబు విజనరీ అని కీర్తిస్తోంది. అయితే విజనరీ వెనుక ఉన్న డొల్లతనాన్నిఐఎంజీ భూముల పందేరం ఎత్తి చూపింది. సంస్థ పెట్టిన నాలుగు రోజులకే ఏకంగా 850 ఎకరాల ప్రభుత్వ భూమిని కారు చౌకగా కట్టబెట్టిన నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది చంద్రబాబు సీఎంగా ఉన్cbn{#}anil kumar singhal;2020;Telangana;Heart;CBI;Huzur Nagar;Car;court;Hyderabad;India;Government;media;CBN;Andhra Pradeshచంద్రబాబు మెడపై సీబీఐ కత్తి వేలాడుతోందా?చంద్రబాబు మెడపై సీబీఐ కత్తి వేలాడుతోందా?cbn{#}anil kumar singhal;2020;Telangana;Heart;CBI;Huzur Nagar;Car;court;Hyderabad;India;Government;media;CBN;Andhra PradeshSun, 10 Mar 2024 13:00:00 GMTఉమ్మడి ఏపీ సీఎంగా హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశాను అని చెప్పుకునే చంద్రబాబు లో ప్రచార ఆర్భాటం ఎక్కువే. ఇక ఆయన సీఎంగా ఉండగా జరిగిన అవకతవకలు, అవినీతి వ్యవహారాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపిన ప్రతిసారీ చంద్రబాబు అనుకూల మీడియా అవన్నీ తప్పు అంటుంది. అది చంద్రబాబు విజనరీ అని కీర్తిస్తోంది. అయితే విజనరీ వెనుక ఉన్న డొల్లతనాన్నిఐఎంజీ భూముల పందేరం ఎత్తి చూపింది. సంస్థ పెట్టిన నాలుగు రోజులకే ఏకంగా 850 ఎకరాల ప్రభుత్వ భూమిని కారు చౌకగా కట్టబెట్టిన నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది.


ఇది చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జరిగింది. 2003లో ఐఎంజీ భారత్ కి ఎకరం రూ.50 వేల చొప్పున మొత్తం 850 ఎకరాలను ఆ కంపెనీకి చంద్రబాబు కేటాయించారు. అవన్నీ కూడా నాటి హైదరాబాద్ సిటీలో హార్ట్ గా ఉన్న ప్రాంతాలు కావడం విశేషం. గచ్చి బౌలిలో సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 400 ఎకరాలు, సరూర్ నగర్ దగ్గర విమానాశ్రయానికి అత్యంత చేరువలో మరో 450 ఎకరాలను కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. అప్పట్లోనే ఎకరం రూ.10 కోట్లు ఉండగా.. రూ.50వేలకు అస్మదీయులకు ముట్టజెప్పింది.  


ఇది కూడా ఎన్నికల వేళ అపధర్మ సీఎంగా ఉన్న సమయంలో ఈ భూములను ఇవ్వడం తప్పు పట్టే చర్యగానే ఉంది.  ఇంత విలువైన భూములు ఇవ్వడానికి కారణం క్రీడా మైదానాలను నిర్మించి 2020 నాటికి ఒలింపిక్స్ కు క్రీడాకారులను సిద్ధం చేస్తామని ఐఎంజీ హామీ ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ ప్రభుత్వం ఐఎంజీకి ఇచ్చిన భూములను రద్దు చేశారు. దీని మీద కోర్టుకి దాని అధినేత బిల్లీరావు వెళ్లారు.


సుదీర్ఘకాలం వాదనలు విన్న న్యాయస్థానం చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలోని తెలంగాణ న్యాయస్థానం ఈ భూములు ప్రభుత్వానివే అని తీర్పు చెప్పింది. నాలుగు రోజుల వ్యవధిలో ఎనిమిది వందల ఎకరాలు ఎలా కట్టబెడతారని ప్రశ్నించింది. ఏకపక్షంగా భూములను కట్టబెట్టారని చంద్రబాబు తీరుని విమర్శించింది. అంతేకాదు మొత్తం ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని అభిప్రాయపడింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>