MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamil-hero-ajith-health-updatedb9f1077-118e-4225-9ec0-b020dde70445-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamil-hero-ajith-health-updatedb9f1077-118e-4225-9ec0-b020dde70445-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరో అజిత్‌ కుమార్‌ ఆరోగ్యం గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏమైందో క్లారిటీ లేకపోయినా.. ఏదో ఒకటి వస్తూ అదేదో పెద్ద ఇబ్బంది అనేలా వార్తలు వచ్చేశాయి.అయితే అజిత్‌ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడు ఫుల్‌ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే అజిత్ ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయ్యారు.అయితే అజిత్ ఖచ్చితంగా ఒక నెల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అజిత్‌ కుమార్ ఇటీవల చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు.అయితే ఈ విషయం నేరుగా తెAjith Kumar{#}Kumaar;Trisha Krishnan;ajith kumar;Ajit Pawar;Nijam;Heroine;Hero;News;Cinemaతమిళ హీరో అజిత్‌ ఆరోగ్యం ఎలా ఉందంటే?తమిళ హీరో అజిత్‌ ఆరోగ్యం ఎలా ఉందంటే?Ajith Kumar{#}Kumaar;Trisha Krishnan;ajith kumar;Ajit Pawar;Nijam;Heroine;Hero;News;CinemaSun, 10 Mar 2024 14:15:35 GMTతమిళ స్టార్ హీరో అజిత్‌ కుమార్‌ ఆరోగ్యం గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏమైందో క్లారిటీ లేకపోయినా.. ఏదో ఒకటి వస్తూ అదేదో పెద్ద ఇబ్బంది అనేలా వార్తలు వచ్చేశాయి.అయితే అజిత్‌ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడు ఫుల్‌ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే అజిత్ ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయ్యారు.అయితే అజిత్ ఖచ్చితంగా ఒక నెల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అజిత్‌ కుమార్ ఇటీవల చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు.అయితే ఈ విషయం నేరుగా తెలియకుండా దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో అజిత్‌ కుమార్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. ఏకంగా బ్రెయిన్‌ సర్జరీ అంటూ కొంతమంది గాసిప్స్ షికార్లు చేయించారు. మరికొంతమంది ఏమైందో అంటూ ప్రశ్నలు పుట్టించి ఇంకాస్త ఇబ్బంది పెట్టారు. దీంతో అభిమానుల్లో తీవ్రమైన ఆందోళన పెరిగింది. తాజాగా అజిత్‌ కుమార్ అనారోగ్య వార్తలపై అజిత్‌ వ్యక్తిగత టీం క్లారిటీ ఇచ్చారు.


కేవలం సాధారణ వైద్య పరీక్షల కోసం అజిత్‌ ఆస్పత్రిలో చేరారని, పరీక్షలు నిర్వహించిన వైద్యులు చెవి వెనక ఉన్న నరాలు బలహీనంగా ఉన్నాయని తెలిపారని అజిత్ టీమ్‌ చెప్పారు. అందుకే చెవి వెనుక నరాలకు చికిత్స చేశారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. అజిత్‌ ఆస్పత్రి నుండి ఇంటికి చేరుకున్నారని, ఇప్పటి దాకా ఆయన అనారోగ్యంపై వచ్చిన వార్తల్లో నిజం లేదని తేల్చేశారు. ఇంకా అంతేకాదు ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేయడం సరికాదని, దయచేసి ఇలాంటి పనులు చేయొద్దని కోరారు.దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం  మళిళ్‌ తిరుమేని దర్శకత్వంలో 'విదా ముయార్చి' అనే సినిమాలో అజిత్‌ కుమార్ నటిస్తున్నాడు. త్రిష  హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అర్జున్‌ సర్జా, రెజీనా కూడా నటిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ మీద అభిమానులకు ఎన్నో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే అజిత్ అనారోగ్యం కారణంగా ఈ సినిమా ఆలస్యం అవ్వొచ్చు అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>