Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral3e30772a-bf16-46bb-89c7-1d2607792cc3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral3e30772a-bf16-46bb-89c7-1d2607792cc3-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తున్న సాయి పల్లవి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఫిదా అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తన మాటలతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అందరు హీరోయిన్ల లాగా గ్లామర్ పాత్రలు చేయకుండా కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ కెరీర్ను సాగిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సాయి పల్లవి ఏదైనా సినిమాలో నటిస్తుంది అంటే చాలు అందులో ఏదో కొత్తదనం ఉంటుంది అని ప్రేక్షకులు అనుకునే విధంగా.. ఈ హీరోయిన్ సినిమాల Viral{#}junaid khan;Sai Pallavi;Heroine;Fidaa;Party;Audience;Hero;Tollywood;Telugu;bollywood;Tamilపబ్ లో సాయి పల్లవి చిందులు.. షాక్ అవుతున్న ఫ్యాన్స్?పబ్ లో సాయి పల్లవి చిందులు.. షాక్ అవుతున్న ఫ్యాన్స్?Viral{#}junaid khan;Sai Pallavi;Heroine;Fidaa;Party;Audience;Hero;Tollywood;Telugu;bollywood;TamilSun, 10 Mar 2024 15:05:00 GMTప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తున్న సాయి పల్లవి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఫిదా అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తన మాటలతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అందరు హీరోయిన్ల లాగా గ్లామర్ పాత్రలు చేయకుండా కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ కెరీర్ను సాగిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సాయి పల్లవి ఏదైనా సినిమాలో నటిస్తుంది అంటే చాలు అందులో ఏదో కొత్తదనం ఉంటుంది అని ప్రేక్షకులు అనుకునే విధంగా.. ఈ హీరోయిన్ సినిమాల సెలెక్షన్ ఉంటుంది అని చెప్పాలి.


 మరిముఖ్యంగా సాయిపల్లవి డాన్సులకి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రస్తుతం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. అయితే ఈ ఏడాది సాయి పల్లవి బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది అని చెప్పాలి. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.



 ఇటీవల చిత్రబృందం ఏకంగా జపాన్లో షూటింగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. అయితే ఇలా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇక చిత్ర బృందం అందరూ కలిసి ఒక చిన్న పార్టీ చేసుకున్నారు  ఈ క్రమంలోనే సాయి పల్లవి ఏకంగా పబ్ లో డాన్స్ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి  ఇక ఇది చూసి ఫాన్స్ షాక్ అవుతున్నారు. అదేంటి సాయి పల్లవి పబ్ లాంటి వాటికి ఎంతో దూరంగా ఉంటుంది  అలాంటిది ఏకంగా పబ్బుకు వెళ్లి డాన్స్ చేయడమేంటి అని షాక్ అవుతున్నారు. అయితే సాయి పల్లవి ఇలా పబ్బులు, క్లబ్ల జోలికి వెళ్లకుండా కాస్త ఖాలి సమయం దొరికిన దైవ చింతనలో మునిగిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>