NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/nrid1aeff6d-5b17-4674-b906-784fb569b3f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/nrid1aeff6d-5b17-4674-b906-784fb569b3f9-415x250-IndiaHerald.jpgఒకప్పుడు భిక్షాటన చేసే వాళ్ళని చూస్తే అయ్యో పాపం అని అనుకునేవారు అందరూ. ఈ క్రమంలోనే సంపన్నుల దగ్గర నుంచి సామాన్యుల వారికి ప్రతి ఒక్కరు కూడా తోచిన సహాయం చేసేవారు. అయితే ఇటీవల కాలంలో ఇలా భిక్షాటన చేసేవారు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నారు. రోడ్డుపై సిగ్నల్ పాయింట్స్ దగ్గర.. ఇక గుడి మెట్లపై ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ ఇక్కడ అని తేడా లేదు అనే చోట్ల ఇలా బిక్షాటన చేసేవారు కనిపిస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే విశాఖన చేసే వారిని చూసి జాలిపడే వారేమో. కానీ ఇప్పుడు మాత్రం వారిని చూసి అయ్యబాబోయ్ అనNri{#}templeభిక్షాటన చేస్తూ.. ఏకంగా రూ.కోటి సంపాదిస్తున్నాడు?భిక్షాటన చేస్తూ.. ఏకంగా రూ.కోటి సంపాదిస్తున్నాడు?Nri{#}templeSat, 09 Mar 2024 14:30:00 GMTఒకప్పుడు భిక్షాటన చేసే వాళ్ళని చూస్తే అయ్యో పాపం అని అనుకునేవారు అందరూ. ఈ క్రమంలోనే సంపన్నుల దగ్గర నుంచి సామాన్యుల వారికి ప్రతి ఒక్కరు కూడా తోచిన సహాయం చేసేవారు. అయితే ఇటీవల కాలంలో ఇలా భిక్షాటన చేసేవారు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నారు. రోడ్డుపై సిగ్నల్ పాయింట్స్ దగ్గర.. ఇక గుడి మెట్లపై ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ ఇక్కడ అని తేడా లేదు అనే చోట్ల ఇలా బిక్షాటన చేసేవారు కనిపిస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే విశాఖన చేసే వారిని చూసి జాలిపడే వారేమో. కానీ ఇప్పుడు మాత్రం వారిని చూసి అయ్యబాబోయ్ అని తల పట్టుకుంటున్నారు అందరూ.


 ఎందుకంటే పెద్ద పెద్ద చదువులు చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వారికి సైతం రానంత ఆదాయం ఏకంగా భిక్షాటన చేస్తూనే వారికి వస్తూ ఉండడం లాంటి ఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏకంగా ఒక్క నెలకి లక్ష నుంచి రెండు మూడు లక్షల వరకు సంపాదిస్తున్న  యాచకులు కూడా నేటి రోజుల్లో కనిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి వ్యక్తి గురించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది. అతను ఒక నటుడు. అయితే నటన వృత్తిలో అతనికి సరిపడా డబ్బులు రావట్లేదు అనిపించిందో ఏమో ఏకంగా యాచకుడిగా మారిపోయాడు. ఇక ఇప్పుడు ఏకంగా నెలకు 8 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు సదరు వ్యక్తి.


 ఇలా ఒక చైనాకు చెందిన నటుడు యాచిస్తూ ఎనిమిది లక్షలు సంపాదిస్తుండడం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. అంటే ఇలా ఏడాదికి దాదాపు కోటి రూపాయల వరకు అర్జిస్తున్నాడు. సదరు వ్యక్తి చైనా నటుడు జింగాంగ్ హెనాన్ ప్రావిన్స్  లోని క్వింగ్ మింగ్ షాంగే గార్డెన్ వద్ద 12 ఏళ్లుగా భిక్షాటన చేస్తున్నాడు. మంచి డ్రెస్సులో అక్కడికి వచ్చి ఆ తర్వాత మాసిపోయిన బట్టలు వేసుకుంటాడు. ఇక అతడిని చూసి జాలేసి అక్కడికి వచ్చిన పర్యటకులు డబ్బులు ఇవ్వడం చేస్తూ ఉంటారు. ఇలా అతను నెలకి 70 వేల యువాన్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా ఎనిమిది లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>