Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anansuyae50f0602-8824-4f6b-803c-2af0aa9ed127-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anansuyae50f0602-8824-4f6b-803c-2af0aa9ed127-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెరపై సెన్సేషనల్ కామెడీ షో గా నిలిచిన జబర్దస్త్ లో యాంకర్ గా ఎన్నో ఏళ్లపాటు అలరించిన అనసూయ.. ఇక ఆ తర్వాత వెండితెరపై కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది అని చెప్పాలి. అయితే ఇక ఈమెకు అదృష్టం కూడా బాగానే కలిసి వచ్చింది. ఎందుకంటే ఇక ఎన్నో సినిమాల్లో మంచి పాత్రల్లో చాన్స్ దక్కించుకుంది. అయితే అప్పటికే అవకాశాలు అందుకుంటున్న అనసూయ కెరియర్ నిలబెట్టిన డైరెక్టర్ ఎవరు అంటే ఆ క్రెడిట్ మొత్తం సుకుమార్ కే దక్కుతుంది అని చెప్పాలి. ఎందుకంటే Anansuya{#}Ram Charan Teja;Allu Arjun;anasuya bharadwaj;sukumar;Jabardasth;Rangasthalam;Anasuya;Comedy;Director;Teluguపుష్ప 2లో.. అనసూయ పాత్రని సుకుమార్ అలా ప్లాన్ చేశాడా?పుష్ప 2లో.. అనసూయ పాత్రని సుకుమార్ అలా ప్లాన్ చేశాడా?Anansuya{#}Ram Charan Teja;Allu Arjun;anasuya bharadwaj;sukumar;Jabardasth;Rangasthalam;Anasuya;Comedy;Director;TeluguSat, 09 Mar 2024 11:27:03 GMTజబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెరపై సెన్సేషనల్ కామెడీ షో గా నిలిచిన జబర్దస్త్ లో యాంకర్ గా ఎన్నో ఏళ్లపాటు అలరించిన అనసూయ.. ఇక ఆ తర్వాత వెండితెరపై కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది అని చెప్పాలి. అయితే ఇక ఈమెకు అదృష్టం కూడా బాగానే కలిసి వచ్చింది. ఎందుకంటే ఇక ఎన్నో సినిమాల్లో మంచి పాత్రల్లో చాన్స్ దక్కించుకుంది. అయితే అప్పటికే అవకాశాలు అందుకుంటున్న అనసూయ కెరియర్ నిలబెట్టిన డైరెక్టర్ ఎవరు అంటే ఆ క్రెడిట్ మొత్తం సుకుమార్ కే దక్కుతుంది అని చెప్పాలి.


 ఎందుకంటే అప్పుడెప్పుడో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో అనసూయకు రంగమ్మత అనే ఒక అద్భుతమైన పాత్రను ఇచ్చాడు. ఇక ఈ పాత్రలో అనసూయ కూడా ఒదిగిపోయి నటించింది. దీంతో తెలుగు ప్రేక్షకులందరికీ కూడా జబర్దస్త్ యాంకర్ గా కాకుండా రంగమ్మత్తగా బాగా దగ్గరయింది అని చెప్పాలి. ఇంకా ఎన్నో ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఆమెను రంగమ్మత్త అంటూ పిలుస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అదే సుకుమార్ ఇక ఈ రంగమ్మత్తను దాక్షాయినిగా మార్చేశాడు.


 అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర అయినా దాక్షాయిని పాత్రకు అనసూయను సెలెక్ట్ చేశారు. దీంతో అప్పటినుంచి ఇక దాక్షాయిని అని అనసూయని పిలవడం మొదలుపెట్టారు తెలుగు ప్రేక్షకులు. అయితే మొదటి సినిమాలోనే అనసూయ పాత్ర ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది. ఇక ఇప్పుడు పార్ట్ 2 లో అనసూయ రోల్ అరాచకం సృష్టిస్తుంది అని ఒక టాక్ నడుస్తుంది. ఏకంగా పుష్ప మీద పగతో రగిలిపోయే బన్వర్  సింగ్ షెకావత్ తో కలిసి ఏకంగా ఒకసారి కొత్త సామ్రాజ్యాన్ని నిర్మిస్తుందట దాక్షాయిని. ఇక పుష్ప మీద పగ తీర్చుకోడానికి ప్రయత్నిస్తుందట. ఇలా అనసూయ పాత్ర పార్ట్ 2 లో ఎంతో కీలకంగా ఉండబోతుంది అని తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>