PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tdp-bjp4566f84e-02bf-4c2a-bc84-9485d94513ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tdp-bjp4566f84e-02bf-4c2a-bc84-9485d94513ec-415x250-IndiaHerald.jpgమొదటిది ఏమిటంటే 48 ఓట్లశాతంతో వైసీపీనే అధికారంలోకి రాబోతున్నదట. టీడీపీ, జనసేన కూటమికి 46.5 శాతం ఓట్లు రాబోతున్నది. అంటే కేవలం 1.5 శాతం ఓట్ల ఆధిక్యంతో వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందని తేలింది. ఏ పార్టీకి ఓట్లేయాలో తేల్చుకోలేని ఓటర్ల శాతం 2.25 శాతం ఉందట. దీని ప్రకారం సీట్ల విషయానికి వస్తే వైసీపీకి 106-110 వస్తాయని తేలింది. టీడీపీ, జనసేనకు 64-68 మధ్య సీట్లు వస్తాయట. ఇతరులకు వచ్చే సీట్లేమీలేవు. ycp tdp bjp{#}Survey;YCP;Janasena;Bharatiya Janata Partyఅమరావతి : వైసీపీ లేటెస్టు సర్వే రిపోర్టిదేనా ?అమరావతి : వైసీపీ లేటెస్టు సర్వే రిపోర్టిదేనా ?ycp tdp bjp{#}Survey;YCP;Janasena;Bharatiya Janata PartySat, 09 Mar 2024 03:00:00 GMT

ఒక సర్వేరిపోర్టు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే రాబోయే ఎన్నికలపై గెలుపోటముల విషయంలో  వైసీపీ చేయించుకున్న రిపోర్టట.  వైసీపీ చేయించుకున్న సర్వే రెండురకాలుగా ఉంది. ఎలాగంటే  వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన పొత్తుపెట్టుకుంటే ఫలితం ఎలాగుంటుందనేది మొదటి పద్దతి. ఇక రెండోపద్దతి ఏమిటంటే వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తే ఎలాగుంటుందని. ఈ తాజా సర్వే ప్రకారం రెండురకాల ఫీడ్ బ్యాకులు వచ్చాయట.





మొదటిది ఏమిటంటే 48 ఓట్లశాతంతో వైసీపీనే అధికారంలోకి రాబోతున్నదట. టీడీపీ, జనసేన కూటమికి 46.5 శాతం ఓట్లు రాబోతున్నది. అంటే కేవలం 1.5 శాతం ఓట్ల ఆధిక్యంతో వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందని తేలింది. ఏ పార్టీకి ఓట్లేయాలో తేల్చుకోలేని ఓటర్ల శాతం 2.25 శాతం ఉందట. దీని ప్రకారం సీట్ల విషయానికి వస్తే వైసీపీకి 106-110 వస్తాయని తేలింది. టీడీపీ, జనసేనకు 64-68 మధ్య సీట్లు వస్తాయట. ఇతరులకు వచ్చే సీట్లేమీలేవు.





ఇక రెండో పద్దతిలో వైసీపీ 49 శాతం ఓట్లొస్తాయట. టీడీపీ, జనసేన, బీజేపీ 45 శాతం ఓట్లు వస్తాయట. ఇతరులకు 4 శాతం ఓట్లు వస్తాయట. ఏపార్టీకి ఓట్లేయాలో తేల్చుకోలేని ఓటర్ల శాతం 2 ఉంటుందని అంచనా. ఇక సీట్ల విషయానికి వస్తే 115-122 సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయట. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 60-65 సీట్లు వస్తుందని తేలిందట. ఇతరులకు వచ్చే సీట్లేవి లేవని తేలిపోయింది.





ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే టీడీపీ, జనసేన కలిసినప్పటకికన్నా టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తేనే వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని సర్వేలో తేలటం. విచిత్రం ఏమిటంటే రెండు పార్టీలకు మూడోపార్టీకి కలవటం వల్ల కూటమికి ఎక్కువసీట్లు రావాలి. కాని ఇక్కడ కూటమికి సీట్లు తగ్గుతున్నాయి. కాబట్టి వైసీపీ నేతలు టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కూడా కలవాలని కోరుకుంటున్నారు. మరి సర్వే వాస్తవం అవుతుందా ? లేకపోతే ఇందుకు విరుద్ధంగా ఉంటుందా అన్నది చూడాలి.  




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>