Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle75bed040-bf1a-47d6-9827-5b5c33de748a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle75bed040-bf1a-47d6-9827-5b5c33de748a-415x250-IndiaHerald.jpgసుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. తన పేరుని సాయి దుర్గ తేజ్ గా మార్చుకుంటూ కెరీర్ ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు. ఈక్రమంలోనే నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు.తన తల్లి విజయ దుర్గ పేరు మీద కొత్త నిర్మాణ సంస్థని ప్రారంభిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక ఈ నిర్మాణ సంస్థని స్టార్ట్ చేయడానికి తేజ్ ముందుగా తన మావయ్యల అశీసులు తీసుకున్నారు.ఈ కొత్త నిర్మాణ సంస్థ లోగోని ముందుగా చిరంజీవికి అందించి అశీసులు తీసుకున్నారు. ఆ తరువాత రెండో మావయ్య నాగబాబు, పవన్ నుంచి కూడా అశీసులు తీsocialstars lifestyle{#}Konidela Production;Pink;Dogs;Tammudu;V;Thammudu;Upasana;ram pothineni;kalyan;producer;Producer;Hero;Audience;House;Tollywood;kingనిర్మాతగా ఆడియన్స్ ముందుకు వస్తున్న మెగా అల్లుడు...!!!!నిర్మాతగా ఆడియన్స్ ముందుకు వస్తున్న మెగా అల్లుడు...!!!!socialstars lifestyle{#}Konidela Production;Pink;Dogs;Tammudu;V;Thammudu;Upasana;ram pothineni;kalyan;producer;Producer;Hero;Audience;House;Tollywood;kingSat, 09 Mar 2024 22:33:01 GMTసుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. తన పేరుని సాయి దుర్గ తేజ్ గా మార్చుకుంటూ కెరీర్ ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు. ఈక్రమంలోనే నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు.తన తల్లి విజయ దుర్గ పేరు మీద కొత్త నిర్మాణ సంస్థని ప్రారంభిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక ఈ నిర్మాణ సంస్థని స్టార్ట్ చేయడానికి తేజ్ ముందుగా తన మావయ్యల అశీసులు తీసుకున్నారు.ఈ కొత్త నిర్మాణ సంస్థ లోగోని ముందుగా చిరంజీవికి అందించి అశీసులు తీసుకున్నారు. ఆ తరువాత రెండో మావయ్య నాగబాబు, పవన్ నుంచి కూడా అశీసులు తీసుకున్నారు. టాలీవుడ్ స్టార్ట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ నిర్మాణ సంస్థని ప్రారంభించడంలో తేజ్ కి హెల్ప్ చేశారు. ఇక ఈ నిర్మాణ సంస్థలో మొదటి ప్రాజెక్ట్ గా తమ ఫ్రెండ్స్ అంతా కలిసి చేసిన ఫీచర్ ఫిలిం 'సత్య'ని తీసుకురాబోతున్నారు.ఇక సాయి దుర్గ తేజ్ తీసుకున్న ఈ కొత్త స్టెప్ ని విష్ చేస్తూ ఉపాసన తన ఇన్‌స్టాలో పోస్టు వేశారు. తేజ్ ఫోటోని షేర్ చేస్తూ కంగ్రాట్యులేషన్స్ తెలియజేసారు. కాగా ఈ నిర్మాణ సంస్థ లోగో కూడా నెటిజెన్స్ ని ఆకట్టుకుంటుంది. 'V' అనే పదంతో లోగోని డిజైన్ చేసిన తేజ్.. ఆ అక్షరంలోనే దుర్గ మాతని ప్రతిబింబించేలా ముక్కుపుడకని చూపించారు. ఇక ఆ v అక్షరం కింద ఇద్దరు పిల్లలు, ఒక కుక్క కనిపిస్తుంది. తేజ్ దగ్గర ఒక కుక్క ఉన్న సంగతి తెలిసిందే. ఆ కుక్కని, తనని, తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని ప్రతిబింబించేలా.. ఆ లోగో అలా చూపించినట్లు తెలుస్తుంది.కాగా మెగా ఫ్యామిలీలో ఇప్పటికే అరడజను వరకు ప్రొడక్షన్ హౌస్ లు ఉన్నాయి. అంజనా ప్రొడక్షన్ హౌస్‌తో నాగబాబు, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌తో పీకే, కొణిదెల ప్రొడక్షన్స్ అండ్ మెగా వి ప్రొడక్షన్స్‌తో రామ్ చరణ్, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌తో నిహారిక, గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్‌తో సుస్మిత.. ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఇప్పుడు తాజాగా సాయి దుర్గ తేజ్ కూడా కొత్త నిర్మాణ సంస్థతో వారి చెంతన చేరారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>