PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp--bjp--janasenaafefd7a5-d7c7-4f54-b1d6-c3a6ff8dcba8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp--bjp--janasenaafefd7a5-d7c7-4f54-b1d6-c3a6ff8dcba8-415x250-IndiaHerald.jpgమొత్తానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తు కుదిరింది. ఎన్డీయేలోకి టీడీపీ రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. ఈ అంశంపై చర్చించేందుకు రెండు రోజుల క్రితం ఢిల్లీ చేరుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్..ఈ రోజు 11 గంటలకు అమిత్ షాతో సమావేశమవ్వడం జరిగింది. ఏకంగా గంటపాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. బీజేపీకి ఆఫర్ చేసే సీట్లపై చంద్రబాబు, పవన్ అమిత్ షాతో చర్చించడం జరిగింది. బీజేపీకి కోరుకుంటున్న సీట్ల వివరాలను ఆ పార్టీ నాయకత్వం చంద్రబాబు ముందుంచినట్టు సమాచారం తెలిTDP - BJP - Janasena{#}Telugu Desam Party;Amith Shah;CBN;Delhi;Janasena;TDP;MP;Amit Shah;Assembly;March;Party;News;Loksabha;Bharatiya Janata Partyటీడీపీ- బీజేపీ-జనసేన: మొత్తానికి ఒక్కటయ్యారు?టీడీపీ- బీజేపీ-జనసేన: మొత్తానికి ఒక్కటయ్యారు?TDP - BJP - Janasena{#}Telugu Desam Party;Amith Shah;CBN;Delhi;Janasena;TDP;MP;Amit Shah;Assembly;March;Party;News;Loksabha;Bharatiya Janata PartySat, 09 Mar 2024 17:58:56 GMTమొత్తానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తు కుదిరింది. ఎన్డీయేలోకి టీడీపీ రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. ఈ అంశంపై చర్చించేందుకు రెండు రోజుల క్రితం ఢిల్లీ చేరుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్..ఈ రోజు 11 గంటలకు అమిత్ షాతో సమావేశమవ్వడం జరిగింది. ఏకంగా గంటపాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. బీజేపీకి ఆఫర్ చేసే సీట్లపై చంద్రబాబు, పవన్ అమిత్ షాతో చర్చించడం జరిగింది. బీజేపీకి కోరుకుంటున్న సీట్ల వివరాలను ఆ పార్టీ నాయకత్వం చంద్రబాబు ముందుంచినట్టు సమాచారం తెలిసింది. ఇప్పటికే వీరి మధ్య ప్రాథమిక చర్చలు పూర్తయిన నేపథ్యంలో.. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీలు కూడా ఓ అంగీకారానికి వచ్చినట్టు సమాచారం తెలుస్తోంది.బీజేపీ ముఖ్యనేత అమిత్‌ షాతో జరిగిన ఈ కీలక చర్చల్లో బీజేపీకి ఇవ్వనున్న లోక్‌సభ సీట్లపై ఓ క్లారిటీ వచ్చినట్టు సమాచారం తెలిసింది. బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించినట్టు సమాచారం తెలుస్తోంది.


ఇక అసెంబ్లీ సీట్ల అంశంపై అమిత్ షాతో జరిగిన చర్చల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై రాష్ట్రస్థాయిలో చర్చించాలని, బీజేపీ పరిశీలకులు ఇంకా రాష్ట్ర బీజేపీ చీఫ్‌తో మాట్లాడాలని అమిత్ షా సూచించినట్లు సమాచారం తెలుస్తోంది. సీట్ల పంపకం అంశంపై  టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రకటన చేయబోతుంది. ఈ సీట్ల సర్దుబాటు వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచబోతున్నారు. చర్చలు ఫలప్రదం కావడంతో మార్చి 14వ తేదీన జరగబోయే ఎన్డీయే సమావేశానికి టీడీపీకి ఆహ్వానం అందినట్టు తెలుస్తుంది.టీడీపీ, జనసేన ఇంకా అలాగే బీజేపీ మధ్య పొత్తులు కుదరడంతో.. సీట్ల పంపకం ఏ విధంగా ఉంటుందనే అంశం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు సమాచారం తెలుస్తుంది. దీంతో ఏయే సీట్లు బీజేపీకి ఇస్తారనే దానిపై ఉత్కంఠ మొదలైంది. సీట్ల పంపకంపై టీడీపీ, జనసేన ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చాయి. పొత్తుల్లో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ ఇంకా 3 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. మొత్తం 94 సీట్లకు టీడీపీ అభ్యర్థులను కూడా ప్రకటించింది. దీంతో మిగిలిన సీట్లలోనే బీజేపీకి సర్దుబాటు చేస్తారా ? లేక మళ్లీ మార్పులు చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>