PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mla-nani-slams-chandrababude7f847f-7851-4fa2-a1c5-ea28f4e92375-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mla-nani-slams-chandrababude7f847f-7851-4fa2-a1c5-ea28f4e92375-415x250-IndiaHerald.jpgఅయితే కేంద్రంలోని పెద్దలను శాసించేస్ధితిలో లేరు కాబట్టి వాళ్ళని బతిమలాడుకుంటున్నారు. అయితే ఈ విషయంలో పెద్దలు సానుకూలంగా స్పందించటంలేదు. ఇపుడు సమస్య ఏమిటంటే బీజేపీతో పొత్తును కాదనుకోలేరు అలాగని మనస్పూర్తిగా పొత్తు పెట్టుకోలేరు. ఎందుకంటే బీజేపీ 8-10 పార్లమెంటు స్ధానాలు, 25 అసెంబ్లీ నియోజకవర్గాలు కావాలని గట్టిగా పట్టుబట్టింది. ఇందులో ఎన్ని ఇవ్వటానికి చంద్రబాబు సుముఖంగా ఉంటారో తెలీదు. chandrababu bjp pawan{#}Pawan Kalyan;Jagan;Parliament;Janasena;CBN;TDP;Reddy;Assembly;Party;Bharatiya Janata Partyఢిల్లీ : చంద్రబాబు గట్టిగా ఇరుక్కుపోయారా ?ఢిల్లీ : చంద్రబాబు గట్టిగా ఇరుక్కుపోయారా ?chandrababu bjp pawan{#}Pawan Kalyan;Jagan;Parliament;Janasena;CBN;TDP;Reddy;Assembly;Party;Bharatiya Janata PartySat, 09 Mar 2024 05:00:00 GMTబీజేపీతో పొత్తుల పేరుతో అర్రులు చాస్తున్న చంద్రబాబునాయుడు గట్టిగా ఇరుక్కుపోయినట్లే కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తులేకుండా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం కష్టమని చంద్రబాబుకు బాగా తెలుసు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదని అందరికీ తెలిసిందే. పవన్ తో పొత్తుపెట్టుకోవటం కేవలం కాపుల ఓట్లు పడతాయన్న అంచనాతో మాత్రమే. అయితే జనసేనతో పొత్తు కారణంగా కాపుల ఓట్లు టీడీపీకి పడతాయన్న గ్యారెంటీ ఏమీలేదు.





అందుకనే బీజేపీ-జగన్మోహన్ రెడ్డి సంబంధాలను తెగ్గొట్టాలన్నది చంద్రబాబు వ్యూహం. బీజేపీతో జగన్ సంబంధాలను కట్ చేస్తేకాని రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కష్టమని చంద్రబాబుకు బాగా తెలుసు. అయితే జగన్ కు బీజేపీతో ఎలాంటి సంబంధంలేదన్న విషయం వాస్తవం. కేంద్రప్రభుత్వం పెద్దలతో మాత్రమే జగన్ కు మంచి సంబంధాలున్నాయి. అయితే పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఒకరే కాబట్టే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. ఇదే సమయంలో చంద్రబాబు కోరుకున్నట్లుగా జగన్ను కేంద్రంలోని పెద్దలు దూరంగా పెట్టడంలేదు. ఒకవైపు చంద్రబాబుతో పొత్తుచర్చలు జరుపుతునే  మరోవైపు జగన్ తో కూడా భేటీ అవుతున్నారు. ఇక్కడే చంద్రబాబులో ఇరిటేషన్ పెరిగిపోతోంది.





అయితే కేంద్రంలోని పెద్దలను శాసించేస్ధితిలో లేరు కాబట్టి వాళ్ళని బతిమలాడుకుంటున్నారు. అయితే ఈ విషయంలో పెద్దలు సానుకూలంగా స్పందించటంలేదు. ఇపుడు సమస్య ఏమిటంటే బీజేపీతో పొత్తును కాదనుకోలేరు అలాగని మనస్పూర్తిగా  పొత్తు పెట్టుకోలేరు. ఎందుకంటే బీజేపీ 8-10 పార్లమెంటు స్ధానాలు, 25 అసెంబ్లీ  నియోజకవర్గాలు కావాలని గట్టిగా పట్టుబట్టింది. ఇందులో ఎన్ని ఇవ్వటానికి చంద్రబాబు సుముఖంగా ఉంటారో తెలీదు.





ఢిల్లీ వర్గాల ప్రకారం ఆరు పార్లమెంటు స్ధానాలు, 8 అసెంబ్లీ సీట్లు ఇవ్వటానికి చంద్రబాబు సుముఖంగా ఉన్నారట. అయితే అందుకు బీజేపీ పెద్దలు అంగీకరిస్తారా అన్నది పాయింట్. ఇక్కడ విషయం ఏమిటంటే పొత్తు చంద్రబాబుకే అవసరంకాని బీజేపీకి అవసరంలేదు. ఎందుకంటే ఏపీలో బీజేపీకి వచ్చే సీట్లు లేవు పోయే సీట్లూలేవు. పార్లమెంటు సీట్లు ఎన్ని తీసుకున్నా ఒక్కటికూడా గెలుస్తుందన్న నమ్మకం పెద్దగా లేదు.  మరి చివరకు ఎవరెవరికి ఎన్నిసీట్లు ఫైనల్ అవుతాయో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>