SpiritualityDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/happy-shivaratri-upavasam5cb61ec4-b1e8-43d9-bb3c-db470ba529bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/happy-shivaratri-upavasam5cb61ec4-b1e8-43d9-bb3c-db470ba529bc-415x250-IndiaHerald.jpgసాధారణంగా శివరాత్రిని మాఘమాసం బహుళ చతుర్దశి నాడు జరుపుకుంటారు.ఎందుకంటే ఆ రోజున ఆ పరమేశ్వరుడు లింగ రూపం దాల్చిన రోజు కనుక. అంతేకాక దేవతలు,రాక్షసులు అమృతం కోసం పాలసముద్రం చిలికినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి.అలాంటి సమయంలోనే ఒకసారి విషం బయటికి వస్తుంది.ఆ విషం ఎవరు తీసుకోవాలన్నా భయపడతారు.ఆ విషంగరళంలో దాచుకోవడానికి శివుడు ముందుకొచ్చి కంఠంలోనే ఉంచుకుంటాడు.ఆ విషం వల్ల కలిగే బాధతో శివుడు ఆరోజు రాత్రంతా నిద్రపోడు.అదే శివరాత్రిగా జరుపుకుంటారు. ఈ రోజున చాలామంది ఉపవాసం చేసి,జాగారన చేయడంHAPPY SHIVARATRI;UPAVASAM{#}Kanna Lakshminarayana;lord siva;Shiva;Yevaru;marriageశివరాత్రి రోజున ఉపవాసం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలివే..!శివరాత్రి రోజున ఉపవాసం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలివే..!HAPPY SHIVARATRI;UPAVASAM{#}Kanna Lakshminarayana;lord siva;Shiva;Yevaru;marriageFri, 08 Mar 2024 06:00:00 GMTసాధారణంగా శివరాత్రిని మాఘమాసం బహుళ చతుర్దశి నాడు జరుపుకుంటారు.ఎందుకంటే ఆ రోజున ఆ పరమేశ్వరుడు లింగ రూపం దాల్చిన రోజు కనుక. అంతేకాక దేవతలు,రాక్షసులు అమృతం కోసం పాలసముద్రం చిలికినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి.అలాంటి సమయంలోనే ఒకసారి విషం బయటికి వస్తుంది.ఆ విషం ఎవరు తీసుకోవాలన్నా భయపడతారు.ఆ విషంగరళంలో దాచుకోవడానికి శివుడు ముందుకొచ్చి కంఠంలోనే ఉంచుకుంటాడు.ఆ విషం వల్ల కలిగే బాధతో శివుడు ఆరోజు రాత్రంతా నిద్రపోడు.అదే శివరాత్రిగా జరుపుకుంటారు.

ఈ రోజున చాలామంది ఉపవాసం చేసి,జాగారన చేయడం వల్ల శివుని కృపకు పాత్రులు అవుతారు.కానీ ఉపవాసం చేసేటప్పుడు చాలామంది నియమాలను పాటించకుండా ,అరిష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొన్ని నియమాలు పాటించడం వల్ల కష్టాలు,సకల బాధలు తొలగిపోయి,వారికి మంచి రోజులు వస్తాయని చెబుతున్నారు వేద పండితులు.అస్సలు శివరాత్రి రోజున ఉపవాసం ఎలా చేయాలో మనము తెలుసుకుందాం పదండి..

శివరాత్రి రోజున ముందుగా ఉదయాన్నే తెల్లార తలస్నానం చేసి శుభ్రం చేసుకోవాలి.ఈ సమయంలో చాలామంది ఉపవాసం పేరు చెప్పుకొని అన్నం బదులుగా,మిగతావన్నీ ఎక్కువే ఎక్కువగా తింటూ ఉంటారు.అసలు ఉపవాసం అంటే మరియు ఆహారంపై యావ తగ్గించుకొని,శివుని యందు మనసు లగ్నం చేయడం ద్వారా,భగవంతుని కృపకు లోనవుతారు.

ఆ రోజంతా జాగారం చేయడానికి శివరాత్రి మొత్తం శివనామంతో,ఓం నమ:శివాయ అనే పంచాక్షరీ మహమంత్రం జపం,స్మరణతో జాగరణ మీలో నిక్షప్తమై ఉన్న శక్తిని బయటకు వచ్చేలా చేస్తుంది.శివరాత్రి తర్వాత రోజు కచ్చితంగా శివాలయానికి వెళ్లాలి.ఆ తర్వాతనే ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేయాలి.దానితో ఉపవాసం ముగుస్తుంది.

శివరాత్రి నాడు ఉపవాసం,జాగరణ చేసేవారు తర్వాత రోజు రాత్రి వరకు నిద్రించకూడదు.మరుసటి రోజున చంద్రుణ్ణి చూసిన తర్వాత నిద్రించాలి.అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుంది అంటున్నారు వేద పండితులు. మహాశివరాత్రి రోజు శివ ప్రతిష్ట చేసినా,శివపార్వతుల కళ్యాణం చేసినా చాలా మంచిది.ఈ రోజున మహాశివరాత్రి రోజు శివుణ్ణి పూజిస్తే,తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఎక్కువ ఇష్టపడతాడట ఆ పరమేశ్వరుడు.మరియు త్రయోదశి నాడు కచ్చితంగా ఒంటిపొద్దు ఉండి,చతుర్థశి నాడు ఉపవాసం చేయాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>