Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood4197be40-29b7-43ea-be11-972d796abcbc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood4197be40-29b7-43ea-be11-972d796abcbc-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అయిన అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ వేడుక గురించి చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. ఇన్ని రోజుల వరకు కన్నుల పండుగ ఒక వేడుక జరుగుతుంది అని వార్తల్లో చూడటం.. మాట్లాడుకోవడం మాత్రమే చేసాం. కానీ కన్నుల పండుగగా జరగడం అంటే ఎలా ఉంటుందో అన్నది ఇక అపర కుబేరుడి ఇంట పెళ్లి వేడుక జరిగినప్పుడు చూస్తే ప్రతి ఒక్కరికి అర్థం అయ్యింది. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిరథ మహారధులు అందరూ కూడా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ప్రత్యక్షమయ్యారు. Bollywood{#}Kangana Ranaut;Rakhi Sawant;festival;marriage;Mukesh;bollywoodఅంబానీజీ.. నన్ను కూడా కొనుక్కుంటే సరిపోయేదిగా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?అంబానీజీ.. నన్ను కూడా కొనుక్కుంటే సరిపోయేదిగా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?Bollywood{#}Kangana Ranaut;Rakhi Sawant;festival;marriage;Mukesh;bollywoodFri, 08 Mar 2024 08:23:23 GMTప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అయిన అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ వేడుక గురించి చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. ఇన్ని రోజుల వరకు కన్నుల పండుగ ఒక వేడుక జరుగుతుంది అని వార్తల్లో చూడటం.. మాట్లాడుకోవడం మాత్రమే చేసాం. కానీ కన్నుల పండుగగా జరగడం అంటే ఎలా ఉంటుందో అన్నది ఇక అపర కుబేరుడి ఇంట పెళ్లి వేడుక జరిగినప్పుడు చూస్తే ప్రతి ఒక్కరికి అర్థం అయ్యింది. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిరథ మహారధులు అందరూ కూడా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ప్రత్యక్షమయ్యారు.


 బడాబడా హీరోలు సైతం ఈవెంట్లో కాలు కలిపి డాన్సులు చేశారు. విదేశాల నుంచి వచ్చిన సెలబ్రిటీలు సైతం స్పెషల్ పెర్ఫార్మెన్సులతో అదరగొట్టేశారు. ఇక వేల కోట్లు ఖర్చుపెట్టి మరి ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించాడు ముఖేష్ అంబానీ. మార్చ్  ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ వేడుక గురించి ఇప్పటికి కూడా ఇండియాలో అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఏకంగా పెళ్లికి అతిథులుగా వెళ్లడం మానేసి ఏకంగా పారితోషికం తీసుకొని ఈవెంట్లో కొంతమంది సెలబ్రిటీలు డాన్సులు చేయడంపై.. అటు విమర్శలు కూడా వస్తున్నాయి అని చెప్పాలి.


 తాను మాత్రం అలాంటి పని చేయను. నాకు గౌరవమే ముఖ్యం అంటూ బాలీవుడ్ లోని ముగ్గురు ఖాన్స్ ని ఇండైరెక్టుగా ప్రస్తావిస్తూ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారిపోయాయ్. ఇక ఇప్పుడు ఇదే విషయంపై నటి రాఖీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంబానీజి.. రిహానాకు కోట్ల రూపాయలు ఇచ్చిన ఆమె చిరిగిన బట్టలతో వచ్చింది. నాకు 10 కోట్లు ఇచ్చి ఉంటే మీకు ఎన్నో ప్రయోజనాలు ఉండేవి. అనంత్ బాగా బరువు పెరిగారు. ఒకవేళ నా దగ్గరికి వచ్చి ఉంటే ఐదు రోజుల్లోనే బరువు తగ్గేలా చేసేదాన్ని.. నన్ను కూడా కొనుక్కోండి.. నా సేవలను వాడుకోండి అంటూ రాఖీసావంత్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>