PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan22052511-6707-4da9-a828-60e652bc221d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan22052511-6707-4da9-a828-60e652bc221d-415x250-IndiaHerald.jpgచంద్రబాబు సహజంగా తనకు తాను ఐటీ పితామహగా.. టెక్నాలజీ ప్రదాతగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ రైతన్నకు సాయం చేసే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశానని ఇప్పటి వరకు ఏ సభలో చెప్పినట్లు మనకు కనిపించదు. ఎందుకంటే చంద్రబాబు హయాంలో పూర్తి చేసిన ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జలయజ్ఙం పేరిట పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. కానీ వాటిని పూర్తి చేస్తే తనకు ఎక్కడ పేరు రాదో అనే ఉద్దేశంతో వాటిని పూర్తి చేయకుండా వదిలేశారు. తాజాగా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తునjagan{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Krishna River;Y. S. Rajasekhara Reddy;kadapa;Prakasam;mandalam;Nallamala Forest;Srisailam;Coronavirus;LG;dr rajasekhar;CM;CBN;Jagan;Fatherఅంత పెద్ద ప్రాజెక్టు.. జగన్ సైలంట్‌గా పూర్తి చేశాడు?అంత పెద్ద ప్రాజెక్టు.. జగన్ సైలంట్‌గా పూర్తి చేశాడు?jagan{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Krishna River;Y. S. Rajasekhara Reddy;kadapa;Prakasam;mandalam;Nallamala Forest;Srisailam;Coronavirus;LG;dr rajasekhar;CM;CBN;Jagan;FatherFri, 08 Mar 2024 08:53:46 GMTచంద్రబాబు సహజంగా తనకు తాను ఐటీ పితామహగా.. టెక్నాలజీ ప్రదాతగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ రైతన్నకు సాయం చేసే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశానని ఇప్పటి వరకు ఏ సభలో చెప్పినట్లు మనకు కనిపించదు. ఎందుకంటే చంద్రబాబు హయాంలో పూర్తి చేసిన ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జలయజ్ఙం పేరిట పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.


కానీ వాటిని పూర్తి చేస్తే తనకు ఎక్కడ పేరు రాదో అనే ఉద్దేశంతో వాటిని పూర్తి చేయకుండా వదిలేశారు. తాజాగా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ప్రజలు కల సాకారమైంది. వెలిగొండ ప్రాజెక్టును దశాబ్దాల కల నెరవేరింది. సీఎం జగన్ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఆసియాలోనే అత్యంత పొడవైన వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపాదికన చేపట్టి పూర్తి చేశారు.


ప్రకాశం జిల్లా దొర్నాల మండలం చెర్లోపల్లిలో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించారు. దీని ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని దుర్బిక్ష ప్రాంతాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. అంతేకాకుండా ఈ జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మందికి మంచినీరు అందుబాటులోకి వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమల సాగర్ కు కృష్ణా జలాలను తరలించేందుకు వీలుగా సొరంగాల నిర్మాణం చేపట్టారు.


ఈ ప్రాజెక్టు పనులు వైఎస్ హయాంలో 20.33 కి.మీ. మేర పనులు జరగ్గా చంద్రబాబు పాలనలో కేవలం 6.68 కి.మీ. మేర మాత్రమే జరిగాయి. రెండేళ్లు కరోనా కష్ట కాలం ఎదురైనా.. జగన్ పాలనలో 10.56 కి.మీ. మేర పనులు జరిగి ప్రాజెక్టు పూర్తైంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు ను తాను ప్రారంభించడం దేవుని స్ర్కిప్టుగా అభివర్ణించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పనులను వైఎస్సార్ కొడుకుగా తాను పూర్తి చేసి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>