EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bjp27ab1f16-6853-4cb5-8758-a6d63e2c1e00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bjp27ab1f16-6853-4cb5-8758-a6d63e2c1e00-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తుంది. ఆ మేరకు బీజేపీ అధిష్ఠానం సన్నద్దమవుతోంది. కానీ ఏపీ విషయంలో కాషాయ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మాత్రం తెలియరావడం లేదు. టీడీపీతో పొత్తు విషయంలో ఇంకా ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు టీడీపీ, అటు బీజేపీ రెండు పార్టీలు మైండ్ గేమ్ ఆడుతూనే ఉన్నాయి. దీంతో ఈ పొత్తుల వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ఎవరికి వారే పట్టు వీడకపోవడంతో.. రోజులు కరుగుతున్నాయి తప్ప. పొత్తు పెట్టుకునేందుకు ఎవరూ మొగ్గు చూపడం లేదు. మరోవైపు టీడీపీ , జనసేన తొలి జాబితానbjp{#}GEUM;Amith Shah;media;Andhra Pradesh;Assembly;Janasena;CBN;TDP;Bharatiya Janata Partyఎల్లో మీడియా వల్లే బీజేపీ బాబును ఇబ్బంది పెడుతోందా?ఎల్లో మీడియా వల్లే బీజేపీ బాబును ఇబ్బంది పెడుతోందా?bjp{#}GEUM;Amith Shah;media;Andhra Pradesh;Assembly;Janasena;CBN;TDP;Bharatiya Janata PartyFri, 08 Mar 2024 08:20:42 GMTదేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తుంది.  ఆ మేరకు బీజేపీ అధిష్ఠానం సన్నద్దమవుతోంది. కానీ ఏపీ విషయంలో కాషాయ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మాత్రం తెలియరావడం లేదు. టీడీపీతో పొత్తు విషయంలో ఇంకా ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు టీడీపీ, అటు బీజేపీ రెండు పార్టీలు మైండ్ గేమ్ ఆడుతూనే ఉన్నాయి. దీంతో ఈ పొత్తుల వ్యవహారం కొలిక్కి రావడం లేదు.


ఎవరికి వారే పట్టు వీడకపోవడంతో.. రోజులు కరుగుతున్నాయి తప్ప. పొత్తు పెట్టుకునేందుకు ఎవరూ మొగ్గు చూపడం లేదు. మరోవైపు టీడీపీ , జనసేన తొలి జాబితాను ప్రకటించేశాయి.  బీజేపీ వస్తే సరి.. లేకపోతే పొత్తులు లేనట్లే. నెల క్రితం చంద్రబాబు దిల్లీ వెళ్లి అమిత్ షా తో సమావేశం అయ్యారు.  ఆయన ఒక ప్రతిపాదన పెట్టారు. చంద్రబాబు తన ప్రతిపాదన తెలియజేశారు. తిరిగి వచ్చేశారు.


ఆ తర్వాత దాని గురించి మాట్లాడటం మానేశారు. అటు బీజేపీ పెద్దలు సైతం ఈ ప్రస్తావన తీసుకురాలేదు. చంద్రబాబు బృందం దిల్లీ వెళ్లడం కానీ.. బీజేపీ జాతీయ బృందం ఏపీకి రావడం కానీ జరగలేదు. మధ్యలో ఒప్పిస్తానన్న పవన్ కు నిన్నటి వరకు అపాయిట్ మెంట్ లభించలేదు. అన్ని పరిణామాల మధ్య అసలు బీజేపీతో పొత్తు ఉంటుందా.. లేదా అన్న అనుమానం బలంగా పెరిగింది. కానీ నిన్నరాత్రి దీనిపై అమిత్‌షా, చంద్రబాబు, పవన్ చర్చలు జరిపారు. అవి ఇంకా కొలిక్కి రాలేదు.  


బీజేపీకి కోపం రావడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కి నాలుగు ఎంపీ, నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇస్తారంటూ ఎల్లో మీడియా కథనం రాసుకొచ్చింది. పొత్తుల్లో ప్రతిష్టంభనకు ఇదే కారణమైందనే వాదన ఉంది. ప్రస్తుతం బీజేపీ ఇచ్చింది తీసుకునే స్థితిలో లేదు. వారు డిమాండ్లకు ఒప్పుకుంటేనే పొత్తు లేకపోతే లేదు. మరోవైపు పవన్ ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని దిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నారు. మరోవైపు దిల్లీ వెళ్తే వారి కోరికలను చంద్రబాబు తీర్చాల్సి వస్తుంది. అందుకే బీజేపీ తన వద్దకు రావాలని చంద్రబాబు కోరకుంటున్నారు. అదే సమయంలో బీజేపీ సైతం పట్టు బిగిస్తోంది.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>