PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vijayasaireddy31591068-484c-4d1c-a1fb-4a546c7dd683-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vijayasaireddy31591068-484c-4d1c-a1fb-4a546c7dd683-415x250-IndiaHerald.jpgఎన్నికల అంటేనే ట్విస్టులు సహజం. కానీ ఈ పరిణామాలు మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. ఆది నుంచి జగన్ వెన్నంటే నడిచిన వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాను చెప్పిన వారికి టికెట్లు కేటాయించలేదని పార్టీ మారి టీడీపీ గూటికి చేరారు. దీంతో నెల్లూరు జిల్లాలో వైసీపీ కి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఏపీలో నెల్లూరు కీలకమైన జిల్లా. ఇక్కడ వైసీపీకి గట్టి పట్టుంది. గత ఎన్నకల్లో నెల్లూరులో వైసీపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల అనంతరం ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఆనం రాvijayasaireddy{#}prabhakar reddy;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;AdiNarayanaReddy;Nellore;YCP;VijayaSaiReddy;Service;Jagan;Rajya Sabha;CM;Party;MP;TDPరంగంలోకి నేరుగా దిగిన విజయసాయిరెడ్డి?రంగంలోకి నేరుగా దిగిన విజయసాయిరెడ్డి?vijayasaireddy{#}prabhakar reddy;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;AdiNarayanaReddy;Nellore;YCP;VijayaSaiReddy;Service;Jagan;Rajya Sabha;CM;Party;MP;TDPFri, 08 Mar 2024 08:22:41 GMTఎన్నికల అంటేనే ట్విస్టులు సహజం. కానీ ఈ పరిణామాలు మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. ఆది నుంచి జగన్ వెన్నంటే నడిచిన వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి  ప్రభాకర్ రెడ్డి తాను చెప్పిన వారికి టికెట్లు కేటాయించలేదని పార్టీ మారి టీడీపీ గూటికి చేరారు. దీంతో నెల్లూరు జిల్లాలో వైసీపీ కి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఏపీలో నెల్లూరు కీలకమైన జిల్లా. ఇక్కడ వైసీపీకి గట్టి పట్టుంది. గత ఎన్నకల్లో నెల్లూరులో వైసీపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల అనంతరం ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఆనం రామ నారాయణరెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ మారారు. దీంతో పాటు వేమిరెడ్డి కూడా వైసీపీని వీడటం ఆ పార్టీ క్యాడర్ లో కొంత ఆందోళన మొదలైంది.


ఇలాంటి తరుణంలో ఎవరూ ఊహించని విధంగా సీఎం వైఎస్ జగన్ నెల్లూరు లోక్ సభ ఇన్ ఛార్జిగా విజయసాయి రెడ్డిని ప్రకటించారు. ఇది ఆయన సొంత జిల్లా. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. మరో వైపు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి దాదాపు ఖరారు అయినట్లే. ఈ ఇద్దరూ రాజ్యసభ సభ్యులే. ఇద్దరూ నెల్లూరు జిల్లాలో బలమైన నేతలే. పైగా ఆర్థికంగా బలవంతులు. ఒకరి  బలాలు-బలహీనతలపై మరొకరకి స్పష్టత ఉంది. వేమిరెడ్డి ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావడంతో విజయ సాయి రెడ్డిని దింపాలని జగన్ డిసైడ్ అయ్యారు.


అయితే ఎంపీ అభ్యర్థిగా విజయ సాయి ని ప్రకటించడంతో ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టి పెరిగిన గడ్డపై పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేస్తాను. వేమిరెడ్డి నాకు మంచి మిత్రుడు, రాజకీయం వేరు, స్నేహం వేరు అని అన్నారు. మరోవైపు జిల్లాపై తనకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. పార్టీకి, ప్రజలకు నిరంతంర అందుబాటులో ఉంటాను అని వ్యాఖ్యానించారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>