PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/high-court-tamilisai-kcr-f3b5837b-74b3-448c-aa4c-263a61b8363e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/high-court-tamilisai-kcr-f3b5837b-74b3-448c-aa4c-263a61b8363e-415x250-IndiaHerald.jpgగవర్నర్ రెండు సిఫారసులను చాలాకాలం పెండింగులో పెట్టేశారు. సరిగ్గా ఎన్నికలకు కొంతకాలం ముందు ఫైలును తిరస్కరించారు. దాంతో కేసీయార్ ప్రభుత్వానికి పెద్ద షాక్ కొట్టినట్లయ్యింది. దీనిపైన కేటీయార్, హరీష్ అండ్ కో ఎంతగోలచేసినా గవర్నర్ ఏమాత్రం లెక్కచేయలేదు. ఇంతలో ఎన్నికలు జరగటం, ప్రభుత్వం మారిపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్, ఆలీఖాన్ ను నియమించింది. వెంటనే ఇదే విషయంపై అభ్యంతరం వ్యక్తంచేస్తు శ్రవణ్, కుర్రా హైకోర్టులో పిటీషన్ వేశారు. high court tamilisai kcr {#}KCR;revanth;Professor;Revanth Reddy;High court;Governor;Government;Electionsహైదరాబాద్ : గవర్నర్ కు హైకోర్టు ఊహించని షాక్హైదరాబాద్ : గవర్నర్ కు హైకోర్టు ఊహించని షాక్high court tamilisai kcr {#}KCR;revanth;Professor;Revanth Reddy;High court;Governor;Government;ElectionsFri, 08 Mar 2024 09:00:00 GMT

తెలంగాణా గవర్నర్ తమిళిసైకి హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన ఇద్దరు ఎంఎల్పీల నియామకాలు చెల్లవని తీర్పిచ్చింది. అలాగే ప్రభుత్వం నుండి వచ్చిన సిఫారసులను వెనక్కుపంపే అధికారమే కాని తిరస్కరించే అధికారంలేదని స్పష్టంగా చెప్పింది. ఈ విషయం ఎందుకు చెప్పిందంటే కేసీయార్ ఎంఎల్సీలుగా నియమించిన ఇద్దరు నియామకాన్ని గవర్నర్ హోల్డులో పెట్టారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎంఎల్సీలుగా నియమిస్తు కేసీయార్ ప్రభుత్వం గవర్నర్కు సిఫారసుచేసింది.





గవర్నర్ రెండు సిఫారసులను చాలాకాలం పెండింగులో పెట్టేశారు. సరిగ్గా ఎన్నికలకు కొంతకాలం ముందు ఫైలును తిరస్కరించారు. దాంతో కేసీయార్ ప్రభుత్వానికి పెద్ద షాక్ కొట్టినట్లయ్యింది. దీనిపైన కేటీయార్, హరీష్ అండ్ కో ఎంతగోలచేసినా గవర్నర్ ఏమాత్రం లెక్కచేయలేదు. ఇంతలో ఎన్నికలు జరగటం, ప్రభుత్వం మారిపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్, ఆలీఖాన్ ను నియమించింది. వెంటనే ఇదే విషయంపై అభ్యంతరం వ్యక్తంచేస్తు శ్రవణ్, కుర్రా హైకోర్టులో పిటీషన్ వేశారు.





దానిపై ఇంతకాలం విచారణచేసిన హైకోర్టు ఈరోజు తీర్పిచ్చింది. ఆ తీర్పే గవర్నర్ తమిళిసైకి పెద్ద షాక్ ఇచ్చినట్లయ్యింది. ప్రభుత్వంచేసిన సిఫారసులను తిరస్కరించే అధికారం గరవ్నర్ కు ఎక్కడిదని నిలదీసింది. ప్రభుత్వం సిఫారసులను హోల్డ్ లో పెట్టచ్చేకాని తిరస్కరించే అధికారంలేదని స్పష్టంగా చెప్పింది. అప్పటి గవర్నర్ చర్యను ఇపుడు హైకోర్టు తప్పపడటం ఆశ్చర్యమే. అయితే ఇదే సమయంలో ఇప్పటి రేవంత్ ప్రభుత్వం చేసిన నియామకాలను రద్దుచేయటం మరింత ఆశ్చర్యంగా ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు గవర్నర్ తీసుకున్న నిర్ణయం తప్పుపట్టడం వరకు ఓకేనే.





అయితే ఇపుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన నియామకాలను ఎందుకు రద్దుచేసిందో అర్ధంకావటంలేదు. అప్పటి గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టి ఇప్పటి నియామకాన్ని రద్దుచేయటంలో హైకోర్టు ఉద్దేశ్యం ఏమిటో అర్ధంకావటంలేదు. ఇపుడు ఎంఎల్సీలుగా నియమితులైన ఇద్దరు ఏమిచేయాలి ?  చూస్తుంటే హైకోర్టు తీర్పును వీళ్ళిద్దరు సవాలు చేసేట్లే ఉన్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>