Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sacjin630207dc-32e5-49ed-a040-ab44dd7cc1a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sacjin630207dc-32e5-49ed-a040-ab44dd7cc1a4-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఇంగ్లాండ్ జట్టు సాంప్రదాయమైన టెస్ట్ క్రికెట్లో కొత్త ఆట తీరుని పరిచయం చేసింది అన్న విషయం తెలిసిందే. అందరిలా నెమ్మదిగా ఆడితే ఏం వస్తుంది కిక్కు.. ఎటాకింగ్ గేమ్ తో ప్రత్యర్థి పై ఒత్తిడి పెంచితేనే అసలైన కిక్కు అని బజ్ బాల్ అనే కొత్త పద్ధతిని అవలంబిస్తుంది. అయితే కొన్ని కొన్ని సార్లు విఫలమై విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఇలాంటి ఆట తీరును మాత్రం మానుకోవడం లేదు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు టీమ్ ఇండియాతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో కూడాSacjin{#}Sachin Tendulkar;VIRAT KOHLI;Cricket;Australia;England;Kurradu;Yashasvi Jaiswal;Indian;GEUMఇది కలా నిజమా.. సచిన్ కెరియర్ మొత్తంలో సాధించిన రికార్డుని.. జైస్వాల్ ఒక్క సిరీస్ లో బద్దలు కొట్టాడు?ఇది కలా నిజమా.. సచిన్ కెరియర్ మొత్తంలో సాధించిన రికార్డుని.. జైస్వాల్ ఒక్క సిరీస్ లో బద్దలు కొట్టాడు?Sacjin{#}Sachin Tendulkar;VIRAT KOHLI;Cricket;Australia;England;Kurradu;Yashasvi Jaiswal;Indian;GEUMFri, 08 Mar 2024 11:00:00 GMTఈ మధ్యకాలంలో ఇంగ్లాండ్ జట్టు సాంప్రదాయమైన టెస్ట్ క్రికెట్లో కొత్త ఆట తీరుని పరిచయం చేసింది అన్న విషయం తెలిసిందే. అందరిలా నెమ్మదిగా ఆడితే ఏం వస్తుంది కిక్కు.. ఎటాకింగ్ గేమ్ తో ప్రత్యర్థి పై ఒత్తిడి పెంచితేనే అసలైన కిక్కు అని బజ్ బాల్ అనే కొత్త పద్ధతిని అవలంబిస్తుంది. అయితే కొన్ని కొన్ని సార్లు విఫలమై విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఇలాంటి ఆట తీరును మాత్రం మానుకోవడం లేదు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు టీమ్ ఇండియాతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో కూడా బజ్ బాల్ ఆట తీరని కనబరిస్తుంది అని చెప్పాలి.


 ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్ బజ్ బాల్ కి భారీ షాక్ ఇచ్చాడు అటు టీమిండియా లో ఛాన్స్ దక్కించుకున్న ఓ కుర్రాడు. బజ్ బాల్ కాదు తన అటతీరు అంతకుమించి ఉంటుంది అని నిరూపించుకున్నాడు. ఏకంగా టెస్ట్ ఫార్మాట్లో టి20, వన్డే తరహా ఆట తీరుతో సంచలనమే సృష్టిస్తున్నాడు అని చెప్పాలి. అలోకగా సెంచరీలు డబుల్ సెంచరీలు చేసేస్తున్నాడు. అంతేకాదు ఎంతోమంది లెజెండరీ ప్లేయర్స్ కెరియర్ కాలం మొత్తంలో టెస్ట్ ఫార్మాట్లో సాధించిన సిక్సర్ లను ఇక జైస్వాల్ ఒక్క మ్యాచ్ లోనే.. లేదంటే ఒక సిరీస్లోనే సాధిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాడు. దీంతో ఇండియన్ క్రికెట్లో మాత్రమే కాదు వరల్డ్ క్రికెట్లో కూడా ఈ కుర్రాడు ఆ టాక్ ఆఫ్ దిక్రికెట్ గా మారిపోయాడు అని చెప్పాలి.


 అయితే ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో కూడా హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. 58 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఏకంగా భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డ్ నే బద్దలు కొట్టేసాడు. పాతికేళ్లు కూడా నిండని ఈ కుర్రాడు సచిన్ రెండు దశాబ్దాల కెరియర్ కాలంలో  సాధించిన సిక్సర్ల రికార్డును ఒకే సిరీస్లో బద్దలు కొట్టేసాడు. ఒకే ప్రత్యర్థి పై అత్యధిక సిక్సర్లు (26) కొట్టిన ప్లేయర్గా నిలిచాడు. అంతకుముందు ఆస్ట్రేలియా పై 74 ఇన్నింగ్స్ లో సచిన్ 25 సిక్సర్లు బాదాడు. ఇదే టాప్ లో ఉంది. ఇక ఇప్పుడు జైష్వాల్ రికార్డును బద్దలు కొట్టాడు. అతనికి రికార్డులు దాసోహం అవుతున్న తీరు చూస్తే టీమ్ ఇండియాకు అతను మరో కోహ్లీ కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>