Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-ffa826c1-d7fa-4221-8908-a75954ceedd4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-ffa826c1-d7fa-4221-8908-a75954ceedd4-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా.. ప్రస్తుతం ప్రపంచమంతా పాకిపోయింది. మనిషికి తెలియని ఎన్నో విషయాలను తెలిసేలా చేస్తుంది. ఇక అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తోనే ప్రపంచాన్ని మొత్తం చుట్టేసే సదుపాయం కేవలం సోషల్ మీడియాలోనే ఉంది. దీంతో ఎన్నో కొత్త కొత్త విషయాలను నేర్చుకోగలుగుతున్నాడు మనిషి. ఇక సోషల్ మీడియాకు బాగా అలవాటు పడిపోయి బయట ప్రపంచంతో సంబంధాలను కూడా తెచ్చుకుంటూ ఉన్నాడు. అయితే నేటి రోజుల్లో ఈ సోషల్ మీడియా ద్వారా ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో ఇదే సోషల్ మీడియాతో ఎన్నో అనర్ధాలు కూడా జరిగిపోతున్నాయి. ఎంతోమందిMurder {#}Hyderabad;Smart phone;Attapur;Mosque;Girl;chatting;Murder.;Shaheen Bhatt;police;media;Instagramతస్మాత్ జాగ్రత్త.. అమ్మాయిలా మాట్లాడి రాత్రికి పిలిచారు.. చివరికి?తస్మాత్ జాగ్రత్త.. అమ్మాయిలా మాట్లాడి రాత్రికి పిలిచారు.. చివరికి?Murder {#}Hyderabad;Smart phone;Attapur;Mosque;Girl;chatting;Murder.;Shaheen Bhatt;police;media;InstagramFri, 08 Mar 2024 08:50:00 GMTసోషల్ మీడియా.. ప్రస్తుతం ప్రపంచమంతా పాకిపోయింది. మనిషికి తెలియని ఎన్నో విషయాలను తెలిసేలా చేస్తుంది. ఇక అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తోనే ప్రపంచాన్ని మొత్తం చుట్టేసే సదుపాయం కేవలం సోషల్ మీడియాలోనే ఉంది. దీంతో ఎన్నో కొత్త కొత్త విషయాలను నేర్చుకోగలుగుతున్నాడు మనిషి. ఇక సోషల్ మీడియాకు బాగా అలవాటు పడిపోయి బయట ప్రపంచంతో సంబంధాలను కూడా తెచ్చుకుంటూ ఉన్నాడు. అయితే నేటి రోజుల్లో ఈ సోషల్ మీడియా ద్వారా ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో ఇదే సోషల్ మీడియాతో ఎన్నో అనర్ధాలు కూడా జరిగిపోతున్నాయి.


 ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయ్. ఇంకా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి కూడా సోషల్ మీడియా కారణం అవుతూ ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. పక్కన ఉన్న మనుషులతో మాట్లాడటం మానేసి సోషల్ మీడియా జనాలతోనే ఫ్రెండ్షిప్లు చేయడం మనిషి ఎప్పుడో మొదలుపెట్టేసాడు. అయితే ఇలాంటి ఆలోచన చివరికి మనిషిని ప్రమాదంలో పడేస్తుంది. ఇటీవల ఏకంగా ఒక దారుణమైన హత్యకు కారణమైంది అని చెప్పాలి. ఏకంగా ఒక వ్యక్తిపై పగ పెంచుకున్న మరి కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి పిలిపించి దారుణంగా హత్య చేశారు.


 హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వెలుగులోకి వచ్చింది. యువకుడు ఫయుమ్ హత్య కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. బాలాపూర్ పరిధి షాహిన్ నగర్ వాసి ఫయుమ్. ఇటీవల ఒక వ్యక్తితో గొడవపడ్డాడు. దీంతో ఆ వ్యక్తి పగ పెంచుకొని అతన్ని ను చంపేయాలి అనుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఇంస్టాగ్రామ్ లో యువతీ ఫోటో పెట్టి అతనితో అమ్మాయిలా మాట్లాడాడు. కలవాలంటూ మాయమాటలు చెప్పాడు. ఇక అత్తాపూర్ లోని మసీదు దగ్గరికి ఒంటరిగా పిలిపించి.. మరో నలుగురు సహాయంతో అతని దారుణంగా హత్య చేశాడు. పట్టుబడిన నిందితులు పోలీసు విచారణలో ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. అందుకే సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>