Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-874c347a-0f0a-45ba-a6fc-707a5293f450-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-874c347a-0f0a-45ba-a6fc-707a5293f450-415x250-IndiaHerald.jpgఅతను పాతికేళ్లు కూడా నిండని ఒక కుర్రాడు.. అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్న అనుభవం కూడా అంతంతో మాత్రమే. అయినప్పటికీ మహా మహా బౌలర్లకు సైతం అతను వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. రికార్డులు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతను కూడా అందరిలాగానే అదృష్టం కొద్ది అవకాశం దక్కించుకున్నాడు. కానీ అందరిలా వచ్చిపోయే ఆటగాడిని కాదు అన్న విషయాన్ని అతి తక్కువ సమయంలో నిరూపించాడు . అతను బ్యాట్ జులిపిస్తున్నాడు అంటే స్కోర్ బోర్డు సైతం భయపడిపోతుంది. ఎక్కడ పరుగులు పెట్టి అలసిపోవాల్సి వస్తుందోనని. రికార్డులు సైతం ఎదురుCricket {#}VIRAT KOHLI;England;Tsunami;Legend;Yashasvi Jaiswal;Parugu;Maha;India;rahul;Rahul Sipligunj;INTERNATIONALజైష్వాల్ మామూలోడు కాదు.. మొన్నే జట్టులోకి వచ్చి.. అప్పుడే కోహ్లీని దాటేసాడు?జైష్వాల్ మామూలోడు కాదు.. మొన్నే జట్టులోకి వచ్చి.. అప్పుడే కోహ్లీని దాటేసాడు?Cricket {#}VIRAT KOHLI;England;Tsunami;Legend;Yashasvi Jaiswal;Parugu;Maha;India;rahul;Rahul Sipligunj;INTERNATIONALFri, 08 Mar 2024 09:05:00 GMTఅతను పాతికేళ్లు కూడా నిండని ఒక కుర్రాడు.. అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్న అనుభవం కూడా అంతంతో మాత్రమే. అయినప్పటికీ మహా మహా బౌలర్లకు సైతం అతను వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. రికార్డులు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతను కూడా అందరిలాగానే అదృష్టం కొద్ది అవకాశం దక్కించుకున్నాడు. కానీ అందరిలా వచ్చిపోయే ఆటగాడిని కాదు అన్న విషయాన్ని అతి తక్కువ సమయంలో నిరూపించాడు . అతను బ్యాట్ జులిపిస్తున్నాడు అంటే స్కోర్ బోర్డు సైతం భయపడిపోతుంది. ఎక్కడ పరుగులు పెట్టి అలసిపోవాల్సి వస్తుందోనని. రికార్డులు సైతం ఎదురుచూస్తున్నాయి తమను బద్దలు కొట్టేస్తాడు అని.


 అంతలా ప్రస్తుతం భారత క్రికెట్లో అతను టాక్ ఆఫ్ ది క్రికెటర్ గా మారిపోయాడు. అతను ఎవరో కాదు యశస్వి జైస్వాల్. అప్పటికే దేశవాళీ క్రికెట్లో వీరబాదుడు బాధి ఇక టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకున్న ఈ ఆటగాడు.. ఇక అంతర్జాతీయ క్రికెట్లోనూ అదే ఆట తీరును కొనసాగిస్తున్నాడు. ఇంగ్లాండుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఇప్పటికే వరుసగా డబుల్ సెంచరీలతో చెలరేగిపోయి.. రికార్డుల సునామీ సృష్టించిన యశస్వి జైస్వాల్.. ఇక ఇంకా ఈ రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్లో కూడా ఒక అరుదైన రికార్డును అందుకున్నాడు ఈ కుర్రాడు.


 ఏకంగా ప్రస్తుతం టీం ఇండియా జట్టులో స్టార్ ప్లేయర్ గా భారత క్రికెట్లో లెజెండ్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీనే.. వెనక్కి నేట్టేసాడు. ఏకంగా ఇంగ్లాండ్ జట్టుపై ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్గా నిలిచాడు. ఇటీవల ధర్మశాల వేదికగా జరుగుతున్న టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఒక పరుగు చేసి ఈ మైలురాయిని అందుకున్నాడు. మొన్నటి వరకు కోహ్లీ 655 పరుగులతో టాప్ లో ఉండగా ఇప్పుడు కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టాడు. ఇక ఆ తర్వాత స్థానంలో రాహుల్ ద్రావిడు 602 పరుగులతో ఉన్నాడు. ఈ సిరీస్లో యశస్వి జైష్వాల్ కి రెండు డబుల్ సెంచరీలు ఒక సెంచరీ ఉన్నాయి అని చెప్పాలి. ఇక మొదటి రోజు ఆటలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అవుట్ అయ్యాడు ఈ ఆటగాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>