PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap--elections3d4224f1-2231-4036-8b53-ab732da93e5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap--elections3d4224f1-2231-4036-8b53-ab732da93e5b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా 'వైఎస్సార్‌ చేయూత' నాలుగో విడత నిధుల విడుదల సందర్భంగా అనకాపల్లి జిల్లా పిసినికాడలో జగన్‌ మోహన్ రెడ్డి పర్యటించారు.అక్కడ బటన్‌ నొక్కి చేయూత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు జగన్. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్‌ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు నాయుడు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయని జగన్ ధ్వజమెత్తారు. ఇంకా అలాగే ఆయన పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తAP - Elections{#}SV Mohan Reddy;Anakapalle;gold;kalyan;Elections;Government;Car;Jagan;YCP;CBNమళ్ళీ పవన్ పై జగన్ పర్సనల్ ఎటాక్.. బాబుపై కూడా?మళ్ళీ పవన్ పై జగన్ పర్సనల్ ఎటాక్.. బాబుపై కూడా?AP - Elections{#}SV Mohan Reddy;Anakapalle;gold;kalyan;Elections;Government;Car;Jagan;YCP;CBNThu, 07 Mar 2024 16:25:36 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా 'వైఎస్సార్‌ చేయూత' నాలుగో విడత నిధుల విడుదల సందర్భంగా అనకాపల్లి జిల్లా పిసినికాడలో జగన్‌ మోహన్ రెడ్డి పర్యటించారు.అక్కడ బటన్‌ నొక్కి చేయూత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు జగన్. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్‌ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు నాయుడు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయని జగన్ ధ్వజమెత్తారు. ఇంకా అలాగే ఆయన పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుందన్నారు. ఇక దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడని జగన్ మండిపడ్డారు. కార్లను మార్చినట్లు ఈజీగా భార్యలను మార్చేస్తాడంటూ మరోసారి జగన్‌... పవన్‌ కళ్యాణ్‌ పై ఒక రేంజ్ లో నిప్పులు చెరిగారు.పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి 2014లో వాగ్ధానాలు ఇచ్చి మోసం చేశారని జగన్‌ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తామంటూ దగా చేశారని జగన్ దుయ్యబట్టారు.


2014లో ఇచ్చిన ఒక్క వాగ్ధానం అయినా చంద్రబాబు నాయుడు అమలు చేశాడా? అని నిలదీశారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు.పండంటి బిడ్డ పథకం పేరుతో కూడా చంద్రబాబు మోసం చేశారని జగన్‌ ఆరోపించారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ ను నడిపించిన ప్రభుత్వం చంద్రబాబుదని జగన్ తూర్పూరబట్టారు. ఆయనను నమ్మడం అంటే ఖచ్చితంగా కాటేసే పామును నమ్మడమేనని ఎద్దేవా చేశారు. వీరిని నమ్మడం అంటే తినేసే పులిని మన ఇంటికి తెచ్చకోవడమేనన్నారు.అసలు చంద్రబాబు నాయుడు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదని జగన్‌ మోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబు నాయుడుకు బీసీలు గుర్తొస్తారని మండిపడ్డారు. బీసీలకు చంద్రబాబు నాయుడు చేసింది సున్నా అని తెలిపారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మరిన్ని అబద్ధాలు చెబుతారని ప్రజలను హెచ్చరించారు.అలాగే కేజీ బంగారం, ప్రతీ ఇంటికీ కూడా బెంజ్‌ కారు ఇస్తామంటారన్నారు. చంద్రబాబు నాయుడు, దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ కలిసి మేనిఫెస్టో పేరుతో మోసం చేస్తారన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారని జగన్‌ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>