DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pawanc99d2c6d-4053-43ed-91cb-141e7b60d193-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pawanc99d2c6d-4053-43ed-91cb-141e7b60d193-415x250-IndiaHerald.jpgఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లు గురించి చాలా మందికి తెలుసు. రాజకీయ పార్టీల జయాపజయాల గురించి ఇలానే ఆన్ లైన్, ఆఫ్ లైన్ పందేలు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా రూ. కోట్లలో పందేలు కాస్తుంటారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో లోక్ సభ ఎన్నికల కూడా జరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు బెట్టింగ్ రాయుళ్ల దృష్టి వీటిపై పడింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది. టీడీపీ కి వచ్చే సీట్ల సంఖ్య ఎంత. ఇలాంటి అంశాల చుట్టూనే ప్రస్తుతం జోరుగా పందేలు సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైpawan{#}Godavari River;Krishna River;Maharashtra;Cricket;Elections;Assembly;Andhra Pradesh;YCP;TDP;CBN;Tamilషాకింగ్‌: పవన్ కల్యాణ్‌పై పందేల జోరు?షాకింగ్‌: పవన్ కల్యాణ్‌పై పందేల జోరు?pawan{#}Godavari River;Krishna River;Maharashtra;Cricket;Elections;Assembly;Andhra Pradesh;YCP;TDP;CBN;TamilThu, 07 Mar 2024 00:00:00 GMTఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లు గురించి చాలా మందికి తెలుసు. రాజకీయ పార్టీల జయాపజయాల గురించి ఇలానే ఆన్ లైన్, ఆఫ్ లైన్ పందేలు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా రూ. కోట్లలో పందేలు కాస్తుంటారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో లోక్ సభ ఎన్నికల కూడా జరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు బెట్టింగ్ రాయుళ్ల దృష్టి వీటిపై పడింది.


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది. టీడీపీ కి వచ్చే సీట్ల సంఖ్య ఎంత. ఇలాంటి అంశాల చుట్టూనే ప్రస్తుతం జోరుగా పందేలు సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ 70కి మించి స్థానాలు రావని కొందరు కాస్తుంటే.. మరికొందరు… చంద్రబాబు కుప్పంలో ఓడిపోబోతున్నారు అని కాస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు చేసే ఖర్చులకు పదింతలు డబ్బు బెట్టింగ్ రూపంలో పెడుతున్నారు.


ఏపీ ఫలితాలపై ఒక్క ఏపీలోనే కాకుండా.. తెలంగాణ, కర్ణాటక, తమిళ నాడు, మహారాష్ట్ర లో సైతం వేలమంది పందేలు కాస్తున్నారు. ఏపీలో బెట్టింగ్ లకు పేరొందిన ఉభయ గోదావరి జిల్లాలతో పాటు.. గుంటూరు, కృష్ణా లో కూడా ఇప్పటికే పందేలు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు ఇది తారా స్థాయికి చేరింది. పిచ్చి పలు రకాలు అన్నట్లు ఇప్పుడు గెలుపోటములపై కాకుండా పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.. ఎన్ని స్థానాల్లో బరిలో ఉంటారు అనే అంశాలపై కూడా బెట్టింగ్ లు కాస్తున్నారు అంట.


అయితే సులభంగా సంపాదన పేరుతో బెట్టింగ్ లకు కొంతమంది అలవాటు పడుతున్నారు. పందేలు కాసి సర్వం కోల్పోయి ప్రాణాలు కోల్పోయిన వారు చాలామందే ఉన్నారు. కాబట్టి బెట్టింగ్ లో డబ్బులు పోగోట్టుకోకుండా వాటిని పిల్లల అభివృద్ధి కోసం.. కుటుంబం సంక్షేమం కోసం ఖర్చు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్లి రావాలని సూచిస్తున్నారు. అంతే కానీ జూదంలో ఇరుక్కుపోయి కుటంబాన్ని రోడ్డు మీదకి లాగొద్దంటూ పలువురు హెచ్చరిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>