PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rojabf95164c-4f18-433b-b64e-27f87fc12b2b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rojabf95164c-4f18-433b-b64e-27f87fc12b2b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఓటమి తప్పదని మంత్రి రోజా అన్నారు. ఇక పొత్తులో భాగంగా జనసేన 24 సీట్లు తీసుకుందని, అయితే, మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఆ సీట్లు కూడా రావని ఆమె విమర్శించడం జరిగింది.రాబోయే ఎన్నికల్లో వైసీపీ 175కు 175 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కనిపించరని, వారు తప్పకుండా హైదరాబాద్‌కు పారిపోతారని విమర్శించారు. టీడీపీ, జనసేన కూటమికి ఓటు వేస్తే జనాలకు మళ్లీ కష్టాలు మొదలవుతాయని, మోసగాళ్ల చేతికి రాష్ట్రాRoja{#}Roja;Nagari;Iron;Survey;Janasena;kalyan;Minister;News;Telugu;YCP;CBNరోజా పెద్ద ఐరన్ లెగ్.. వైసీపీకి నష్టమట?రోజా పెద్ద ఐరన్ లెగ్.. వైసీపీకి నష్టమట?Roja{#}Roja;Nagari;Iron;Survey;Janasena;kalyan;Minister;News;Telugu;YCP;CBNThu, 07 Mar 2024 16:45:00 GMTఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఓటమి తప్పదని మంత్రి రోజా అన్నారు. ఇక పొత్తులో భాగంగా జనసేన 24 సీట్లు తీసుకుందని, అయితే, మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఆ సీట్లు కూడా రావని ఆమె విమర్శించడం జరిగింది.రాబోయే ఎన్నికల్లో వైసీపీ 175కు 175 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కనిపించరని, వారు తప్పకుండా హైదరాబాద్‌కు పారిపోతారని విమర్శించారు. టీడీపీ, జనసేన కూటమికి ఓటు వేస్తే జనాలకు మళ్లీ కష్టాలు మొదలవుతాయని, మోసగాళ్ల చేతికి రాష్ట్రాన్ని అప్పగించేందుకు ప్రజలు రెడీగా లేరని రోజా దుయ్యబట్టారు.చిత్తూరు జిల్లాలో పుత్తూరులో'జగనన్న మహిళా మార్ట్‌ను స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు కారణంగానే తెలుగు రాష్ట్రాలు విడిపోయాయని, ఆయన లాంటి మోసకారి ఈ ప్రపంచంలో నే ఎవరూ లేరని విమర్శించారు. ఖచ్చితంగా మరోసారి నగరి నియోజకవర్గంలో గెలిచి హ్యాట్రిక్ కొడతానని, ఇందులో ఎటువంటి డౌట్ లేదని రోజా అన్నారు.


ఎండాకాలంలో చల్లగా ఉండాలంటే ఖచ్చితంగా 'ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక ఇదిలా వుంటే.. సొంత నియోజకవర్గంలో అయితే పాపం రోజాకు సెగ తగులుతూనే ఉంది. ఆమెకు టికెట్ ఇవ్వవద్దంటూ ఐదు మండలాలకు చెందిన వైసీపీ నేతలు తాజాగా మరో తీర్మానం చేయడం జరిగింది.రోజాకు కనుక టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా ఓడించి తీరుతామని అధిష్టానానికి హెచ్చరికలు పంపారు. రాజకీయాల్లో రోజా పెద్ద ఐరన్ లెగ్ అని, ఆమెకు టికెట్ ఇస్తే వైసీపీకి ఖచ్చితంగా నష్టమని విమర్శిస్తున్నారు. కేవలం తమ వల్లనే రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, అయితే ఆమె నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు రోజా పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో కమిషన్లు రౌడీయిజం, భూకబ్జాలు పెరిగిపోయాయని ఇంకా ఆమె లాంటి మంత్రిని ఇప్పటి దాకా చూడలేదని ఐదు మండలాలకు చెందిన వైసీపీ ఇంచార్జ్‌లు తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో రోజా గెలిచే పరిస్థితి అస్సలు లేదని పలు సర్వే నివేదికలు జగన్‌కు అందినట్లు తెలుస్తోంది. దీంతో రానున్న ఎన్నికల్లో రోజాకు టికెట్ దక్కదని సమాచారం తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>