MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgబాలీవుడ్ బ్యూటీ ఆదాశర్మ రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్ గా రాణించలేకపోవడంతో తన ఉనికిని చాటుకోవడానికి వివాదాస్పద సినిమాలు చేస్తోంది. గత సంవత్సరం విడుదలైన ‘కేరళ స్టోరీస్’ మూవీతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగి పోయింది. కేరళలో జరిగిన ఒక యదార్థ సంఘటనను ఆధారంగా తీసుకుని తీయబడ్డ ఆమూవీ జాతీయస్థాయిలో ఘనవిజయం సాధించడమే కాకుండా ఆసినిమా అనేక వివాదాలకు చిరునామాగా మారింది.ఇప్పుడు మళ్ళీ మరో వివాదాస్పద సినిమాలో ఆమె నటిస్తూ జాతీయ మీడియా దృష్టిని ఆమె ఆకర్షిస్తోంది. లేటెస్ట్ గా ఆమె నటిస్తున్న ‘బస్తర్ ది నక్సల్’aadasharma{#}Kerala;BEAUTY;Heroine;Cinema;police;media;Newsఆదాశర్మ చుట్టూ వివాదాలు !ఆదాశర్మ చుట్టూ వివాదాలు !aadasharma{#}Kerala;BEAUTY;Heroine;Cinema;police;media;NewsThu, 07 Mar 2024 08:21:25 GMTబాలీవుడ్ బ్యూటీ ఆదాశర్మ రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్ గా రాణించలేకపోవడంతో తన ఉనికిని చాటుకోవడానికి వివాదాస్పద సినిమాలు చేస్తోంది. గత సంవత్సరం విడుదలైన ‘కేరళ స్టోరీస్’ మూవీతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగి పోయింది. కేరళలో జరిగిన ఒక  యదార్థ సంఘటనను ఆధారంగా తీసుకుని తీయబడ్డ ఆమూవీ జాతీయస్థాయిలో ఘనవిజయం సాధించడమే కాకుండా ఆసినిమా అనేక వివాదాలకు చిరునామాగా మారింది.



ఇప్పుడు మళ్ళీ మరో వివాదాస్పద సినిమాలో ఆమె నటిస్తూ జాతీయ మీడియా దృష్టిని ఆమె ఆకర్షిస్తోంది. లేటెస్ట్ గా ఆమె నటిస్తున్న ‘బస్తర్ ది నక్సల్’ మూవీతో ఆమె ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈమూవీ ట్రైలర్ వివాదాలకు చిరునామాగా మారింది. 14 ఏళ్ళ క్రితం ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులతో జరిగిన ఎన్ కౌంటర్ లో 75 సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించడం అప్పట్లో దేశాన్ని కుడివేసింది.



ఈపాయింట్ ని తీసుకుని ‘బస్తర్’ మూవీని తీశారు. అనేకమంది పోలీసులు సీఆర్పీఎఫ్ జవానులతో పాటు అనేకమంది నక్సలైట్లు ఆ ఎన్ కౌంటర్ లో మరణించారు. ఈ వాస్తవ సంఘటనను ఆధారంగా తీసుకుని తీసిన ఈమూవీ కూడ కేరళ స్టోరీస్ లా ఘన విజయం సాధించే ఆస్కారం ఉంది. మరొక 10 రోజులలో విడుదలకాబోతున్న ఈ మూవీని ఏదోవిధంగా అడ్డుకోవాలని కొందరు కోర్టుకు వెళ్ళేప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.



ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరం వచ్చే అవకాశం ఉంది అన్నవార్తలు కూడ వస్తున్నాయి. ఈ మూవీట్రైలర్ లో ప్రభుత్వ వ్యవస్థ మీద రాజకీయ నాయకుల ద్వంద్వ వైఖరి మీద శత్రుదేశం చేసిన అరాచకాల మీద బలమైన కౌంటర్లు, ఎపిసోడ్లు ఉన్నట్టు కనిపిస్తూ ఉండటంతో ఈమూవీ కూడ వివాదాస్పద మూవీగా మారే ఆస్కారం ఉంది అంటున్నారు. అయితే కొందరు ‘ది కేరళ స్టోరీ’ లాగే ఇది కూడా ఒక ఉద్దేశ్యంతో తీశారని కేవలం వివాదాలు సృష్టించి ఘనవిజయం సాధించడమే ఈ మూవీ దర్శకుడు లక్ష్యం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>