Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ashwina2314f4b-4534-4a52-b3be-ecf19569c7be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ashwina2314f4b-4534-4a52-b3be-ecf19569c7be-415x250-IndiaHerald.jpgరవిచంద్రన్ అశ్విన్.. ఇతను అందరిలా సాదాసీదా ఆటగాడు కాదు. ఒక లెజెండ్.. టెస్ట్ ఫార్మాట్ ను ఇష్టపడే ప్రేక్షకులందరికీ మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక ప్రత్యేకమైన ఆటగాడు. ఇతన్ని కేవలం స్పిన్నర్ మాత్రమే అనాలా లేకపోతే బ్యాటింగ్లో అదరగొట్టడం చూసి ఇక ఆల్ రౌండర్ అనాలా ఇప్పటికీ అటు ప్రేక్షకులందరికీ కూడా కన్ఫ్యూషన్.. ఎందుకంటే స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేసి ప్రత్యర్థులను వణికించడమే కాదు జట్టుకు అవసరమైనప్పుడు బ్యాట్ జులిపిస్తూ సెంచరీలు చేయగల సత్తా అశ్విన్ కు ఉంది. అంతే కాదు వరల్డ్ టెస్ట్ క్రికెట్లో అతనుAshwin{#}lakshman;Varsham;Cricket100వ టెస్టు ఆడుతున్న అశ్విన్ పై.. భారత మాజీ తీవ్ర ఆగ్రహం?100వ టెస్టు ఆడుతున్న అశ్విన్ పై.. భారత మాజీ తీవ్ర ఆగ్రహం?Ashwin{#}lakshman;Varsham;CricketThu, 07 Mar 2024 20:15:00 GMTరవిచంద్రన్ అశ్విన్.. ఇతను అందరిలా సాదాసీదా ఆటగాడు కాదు. ఒక లెజెండ్.. టెస్ట్ ఫార్మాట్ ను ఇష్టపడే ప్రేక్షకులందరికీ మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక ప్రత్యేకమైన ఆటగాడు. ఇతన్ని కేవలం స్పిన్నర్ మాత్రమే అనాలా లేకపోతే  బ్యాటింగ్లో అదరగొట్టడం చూసి ఇక ఆల్ రౌండర్ అనాలా  ఇప్పటికీ అటు ప్రేక్షకులందరికీ కూడా కన్ఫ్యూషన్.. ఎందుకంటే స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేసి ప్రత్యర్థులను వణికించడమే కాదు జట్టుకు అవసరమైనప్పుడు బ్యాట్ జులిపిస్తూ సెంచరీలు  చేయగల సత్తా అశ్విన్ కు ఉంది.


 అంతే కాదు వరల్డ్ టెస్ట్ క్రికెట్లో అతను ఒక తెలివైన ప్లేయర్ అని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభివర్ణిస్తూ ఉంటారు. అయితే టెస్ట్ ఫార్మాట్లో ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టించాడు రవిచంద్రన్ అశ్విన్. అయితే ఇక ఇటీవలే సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్లో ఒక అరుదైన రికార్డును అందుకున్నాడు అని చెప్పాలి. ఏకంగా100వ టెస్ట్ మ్యాచ్ ని పూర్తి చేసుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. ప్రస్తుతం ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్ తో అతను వందవ టెస్ట్ ఆడుతున్నాడు అని చెప్పాలి. టెస్ట్ ఫార్మాట్ లో కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమైన అరుదైన మైలురాయిని అందుకున్న అశ్విన్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తుంది.


 ఎంతోమంది మాజీ ఆటగాళ్ళు కూడా అశ్విన్ సాధించిన ఘనత పై స్పందిస్తూ ఇక ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి  అయితే ఇక భారత మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ మాత్రం ఇక అశ్విన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. అశ్విన్ 100వ టెస్టు ఆడుతున్న నేపథ్యంలో.. అతనికి కంగ్రాట్స్ చెప్పేందుకు కాల్ చేస్తే అశ్విన్ కట్ చేశాడని మెసేజ్ కి రిప్లై కూడా ఇవ్వట్లేదు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు లక్ష్మణ్ శివరామకృష్ణన్. అయితే ఈ పోస్ట్ పై అటు భారత క్రికెట్ ఫ్యాన్స్ భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. గతంలో అశ్విన్ రికార్డుల కోసమే ఆడతాడు అంటూ లక్ష్మణ్ శివరామకృష్ణన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. అలాంటి వ్యాఖ్యలు చేసిన మీతో అశ్విన్ ఎందుకు మాట్లాడాలి అంటూ ప్రశ్నిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>