EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pkfef38cb1-e188-47bd-b555-aab4976821bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pkfef38cb1-e188-47bd-b555-aab4976821bf-415x250-IndiaHerald.jpgరాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని తెలిపారు. అది కూడా భారీ ఓటమి అని తేల్చి చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన పత్రికా కంక్లేవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ ఓడిపోతున్నారని అన్నారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అందుకే సీఎం జగన్ ఏం చేసినా ఓటమి తప్పించుకోలేరని తేల్చేశారు. ఏపీలో టీడీపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. పథకాల పేరిట డబ్బులు ఇస్తే ఓట్లు పడవని.. ఆయన వ్యాఖ్యానించారు. సంక్షేమానికి అpk{#}KCR;prasanth;Andhra Pradesh;YCP;Hyderabad;Prashant Kishor;Jagan;Capital;Elections;CBN;TDP;Government;Congress;CMఇంత చిన్న లాజిక్‌.. పీకే ఎలా మిస్సయ్యాడు?ఇంత చిన్న లాజిక్‌.. పీకే ఎలా మిస్సయ్యాడు?pk{#}KCR;prasanth;Andhra Pradesh;YCP;Hyderabad;Prashant Kishor;Jagan;Capital;Elections;CBN;TDP;Government;Congress;CMThu, 07 Mar 2024 07:00:00 GMTరాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని తెలిపారు. అది కూడా భారీ ఓటమి అని తేల్చి చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన పత్రికా కంక్లేవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ ఓడిపోతున్నారని అన్నారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.


అందుకే సీఎం జగన్ ఏం చేసినా ఓటమి తప్పించుకోలేరని తేల్చేశారు. ఏపీలో టీడీపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. పథకాల పేరిట డబ్బులు ఇస్తే ఓట్లు పడవని.. ఆయన వ్యాఖ్యానించారు. సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని వివరించారు. ఇలా పీకే ఏపీ పై తన జోస్యాన్ని చెప్పారు. చదువుకున్న యువత ఉద్యోగాలు కోరుకుంటుంది. ఉచితాలు కాదని పీకే అభిప్రాయపడ్డారు. జగన్ ఉపాధి అవకాశాలపై కాకుండా ఉచితాలపై దృష్టి సారించారు అని ఇది తప్పుడు చర్యగా ఆయన అభివర్ణించారు.


ప్రస్తుతం పీకే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఆయన కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పీకే చిన్న లాజిక్ మిస్ అయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో అభివృద్ధి ఎజెండాగా ఎన్నికలు జరిగాయి.  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ఆ తర్వాత జరిగిన అభివృద్ధిని పలు పత్రికలు ప్రస్తావించాయి. దీంతో ఉపాధి కల్పన కూడా హైదరాబాద్ లో పెద్ద ఉంది. ఆంధ్రా నుంచి యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్ కి వలస వెళ్లారు. పలు కంపెనీలు రాజధాని నగరంలో ఇన్వెస్ట్ మెంట్ చేశాయి.


వీటితో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని పథకాలు కేసీఆర్ అమలు చేశారు. అభివృద్ధి జరిగింది. ప్రైవేట్ సెక్టార్ లో ఉద్యోగాలు కల్పించారు. అయినా ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించారు. ఎందుకంటే అంతకుమించి ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ఇస్తారని ప్రజలు నమ్మారు. అలాగే జగన్ ను మించి చంద్రబాబు సంక్షేమం ఇస్తారని నమ్మితే ఆయన పాలననే ప్రజలు కోరుకుంటారు. లేకపోతే లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>