PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vizag-jagand07da2a5-7104-4642-b468-26c5e580647f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vizag-jagand07da2a5-7104-4642-b468-26c5e580647f-415x250-IndiaHerald.jpgఒకవైపు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ సభల్లో మాట్లాడుతు అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అని చెబుతున్నారు. అయితే వాళ్ళిద్దరి మాటల్లో కాన్ఫిడెన్స్ పెద్దగా కనబడటంలేదు. క్యాపిటల్ గా జగన్ వైజాగ్ అన్నారు కాబట్టి తాము వ్యతిరేకించాలన్న పట్టుదలే కనబడుతోంది. అందుకనే అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని చెబుతున్నారు. నిజానికి చంద్రబాబు చెప్పే అమరావతి రాజధానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. పైగా ఆ రాజధాని ఒకస్ధాయికి చేరుకోవటానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో ఎవరు చెప్పలేరు. అసలు రాజధానిని నిర్మించిన చరిత్ర దేశమొంత్తంvizag jagan{#}raj;Amaravati;High court;Jagan;Andhra Pradesh;Reddy;YCP;Pawan Kalyan;CBN;Capital;Vishakapatnam;Government;Yevaru;historyఉత్తరాంధ్ర : వైజాగ్ లోనే ప్రమాణస్వీకారంఉత్తరాంధ్ర : వైజాగ్ లోనే ప్రమాణస్వీకారంvizag jagan{#}raj;Amaravati;High court;Jagan;Andhra Pradesh;Reddy;YCP;Pawan Kalyan;CBN;Capital;Vishakapatnam;Government;Yevaru;historyWed, 06 Mar 2024 03:00:00 GMT

వచ్చేఎన్నికల్లో గెలుపుపై జగన్మోహన్ రెడ్డి బాగా విశ్వాసంతో ఉన్నట్లున్నారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రమాణస్వీకారాన్ని విశాఖపట్నంలోనే చేస్తానని ప్రకటించారు. విశాఖ విజన్ పేరుతో వైజాగ్ లో ఏపీ డెవలప్మెంట్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో దేశంలోని పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమన్నారు. అందుకనే తన ప్రమాణస్వీకారం కూడా వైజాగ్లోనే ఉంటుందని బల్లగుద్దకుండానే చెప్పేశారు.





ఒకవైపు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ సభల్లో మాట్లాడుతు అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అని చెబుతున్నారు. అయితే వాళ్ళిద్దరి  మాటల్లో కాన్ఫిడెన్స్ పెద్దగా కనబడటంలేదు. క్యాపిటల్ గా జగన్ వైజాగ్ అన్నారు కాబట్టి తాము వ్యతిరేకించాలన్న  పట్టుదలే కనబడుతోంది. అందుకనే అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని చెబుతున్నారు. నిజానికి చంద్రబాబు చెప్పే అమరావతి రాజధానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. పైగా ఆ రాజధాని ఒకస్ధాయికి చేరుకోవటానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో ఎవరు చెప్పలేరు. అసలు రాజధానిని నిర్మించిన చరిత్ర దేశమొంత్తంమీద ఏ రాష్ట్రంలో కూడా లేదు.





రాజధానిని ఏ ప్రభుత్వం కూడా నిర్మించదు. ప్రభుత్వానికి అవసరమైన భవనాలను ప్రభుత్వం నిర్మించుకుంటుంది. అంటే సెక్రటేరియట్, అసెంబ్లీ, రాజ్ భవన్, హైకోర్టు లాంటివాటి ఒకటిరెండు భవనాలను మాత్రమే ప్రభుత్వం నిర్మిస్తుంది. మిగిలిన అభివృద్ధిని జనాలకే వదిలేస్తుంది. కాకపోతే జనాలు వచ్చి ఉండటానికి డెవలప్ అవటానికి అవసరమైన మౌళిక సదుపాయాలను మాత్రం ప్రభుత్వం కల్పిస్తుంది. కానీ చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించి ప్రపంచ ప్రఖ్యాత రాజధానిని కడతానని చెప్పి అందరినీ భ్రమల్లో ముంచాడు. చివరకు తాను ముణగటమే కాకుండా తనను నమ్మిన వాళ్ళందరినీ కూడా ముంచేశారు.





ఇపుడు దాన్నే జగన్ తప్పుపడుతున్నారు. ఆల్రెడీ డెవలప్ అయిన వైజాగ్ లో కొద్దిపాటు ఏర్పాట్లు చేసుకుంటే చాలు బ్రహ్మాండమైన రాజధానిగా వైజాగ్ తయారవుతుందని జగన్ పదేపదే చెబుతున్నారు. అందుకనే తాను ముఖ్యమంత్రిగా వైజాగ్ లోనే ప్రమాణస్వీకారం చేస్తానని, ఇక్కడే ఉంటానని నమ్మకంగా, కాన్ఫిడెంటుగా చెబుతున్నది.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>