Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/crickrt34bd1e14-33ed-4fd1-a8f8-8e42810e1746-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/crickrt34bd1e14-33ed-4fd1-a8f8-8e42810e1746-415x250-IndiaHerald.jpgఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ అనేది ఒక మతంగా ప్రేక్షకులు అందరూ కూడా భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఏకంగా క్రికెటర్లను దైవం లాగానే ఆరాధిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ఎన్ని పనులున్నా పక్కన పట్టేసి టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు అని చెప్పాలి. అయితే క్రికెట్ కి ఈ రేంజ్ లో క్రేజ్ ఉంది కాబట్టే ఇక ఎవరైనా ఆటగాడు గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది అంటే చాలు అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇలా క్రికెట్లో Crickrt{#}Vadodara;World Cup;Cricket;Audienceషాకింగ్ : బెట్టింగ్ మాఫియాతో చేతులు కలిపిన.. భారత మాజీ కోచ్?షాకింగ్ : బెట్టింగ్ మాఫియాతో చేతులు కలిపిన.. భారత మాజీ కోచ్?Crickrt{#}Vadodara;World Cup;Cricket;AudienceWed, 06 Mar 2024 16:30:00 GMTఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ అనేది ఒక మతంగా ప్రేక్షకులు అందరూ కూడా భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఏకంగా క్రికెటర్లను దైవం లాగానే ఆరాధిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ఎన్ని పనులున్నా  పక్కన పట్టేసి టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు అని చెప్పాలి. అయితే క్రికెట్ కి ఈ రేంజ్ లో క్రేజ్ ఉంది కాబట్టే ఇక ఎవరైనా ఆటగాడు గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది అంటే చాలు అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.


 అయితే ఇలా క్రికెట్లో కొనసాగుతున్న ఆటగాళ్లు గానీ లేదంటే వాళ్లకి కోచింగ్ ఇస్తున్న కోచ్ లు గాని ఎవరైనా బెట్టింగ్ పాల్పడ్డారు అంటే చాలు వారిపై బీసీసీ కఠిన చర్యలు తీసుకునేందుకు ఎప్పుడు సిద్ధమవుతూ ఉంటుంది. అయితే ఎవరైనా బెట్టింగ్ కి పాల్పడితే వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తాయి. ఇక ఇప్పుడు ఏకంగా భారత జట్టుకు ఒకప్పుడు హెడ్ కోచ్గా వ్యవహరించిన వ్యక్తి ఇక ఇప్పుడు బెట్టింగ్ మాఫియా తో సంబంధాలను కొనసాగిస్తున్నాడు అన్న విషయం కాస్త భారత క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 భారత మహిళల జాతీయ జట్టుకు ఎన్నో ఏళ్లపాటు కోచ్ గా వ్యవహరించారు తుషార్ ఆర్తేరి   అయితే ఆయన ఇంట్లో ఇటీవలే భారీగా నగదు పట్టుబడింది. వడోదర ప్రతాప్ గంజ్ లోని ఆయన నివాసంలో 1.01 కోట్ల నగదును ఎస్ఓజి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నగదుకు ఆయన దగ్గర సరైన ఆధారాలు లేకపోవడంతో అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా బెట్టింగ్ డబ్బు అయి ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు. కాగా తుషార్ 2017 లో వరల్డ్ కప్ ఫైనల్ చేరిన మహిళల జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించారు. ఆ తర్వాత 2018లో ఆసియా కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు ఓటమికి బాధ్యత వహిస్తూ హెడ్ కోచ్ పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు ఆయన.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>