Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-9539f811-cda0-4574-b4d1-435aec39d819-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-9539f811-cda0-4574-b4d1-435aec39d819-415x250-IndiaHerald.jpgఈ ఏడాది జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ పైనే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టి ఉంది అన్న విషయం తెలిసిందే. ఈసారి ఇక ఈ మెగా ఈవెంట్ కి అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రపంచ కప్ టోర్నీకి సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ ని కూడా విడుదల చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అన్ని జట్లు కూడా ఇక ఈ వరల్డ్ కప్ లో టైటిల్ విజేతగా నిలబడమే లక్ష్యంగా అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నాయి. Cricket {#}West Indies;Australia;ICC T20;England;World Cup;Yevaru;Cricket;Event;June;Winner;Indiaమా జట్టు వరల్డ్ కప్ గెలవదు.. ఇంగ్లాండ్ మాజీ షాకింగ్ కామెంట్స్?మా జట్టు వరల్డ్ కప్ గెలవదు.. ఇంగ్లాండ్ మాజీ షాకింగ్ కామెంట్స్?Cricket {#}West Indies;Australia;ICC T20;England;World Cup;Yevaru;Cricket;Event;June;Winner;IndiaWed, 06 Mar 2024 14:20:26 GMTఈ ఏడాది జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ పైనే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టి ఉంది అన్న విషయం తెలిసిందే. ఈసారి ఇక ఈ మెగా ఈవెంట్ కి అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రపంచ కప్ టోర్నీకి సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ ని కూడా విడుదల చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అన్ని జట్లు కూడా ఇక ఈ వరల్డ్ కప్ లో టైటిల్ విజేతగా నిలబడమే లక్ష్యంగా అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నాయి.


 అయితే ఇక టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఈసారి విజేతగా నిలవబోయేది ఎవరు అనే విషయంపై కూడా ఎంతో మంది మాజీ ఆటగాళ్లు రివ్యూల మీద రివ్యూలు ఇచ్చేస్తున్నారు అని చెప్పాలి. అయితే గత ఏడాది ఫైనల్ వరకు దూసుకు వచ్చి ఇక ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియా విశ్వవిజేతగా నిలిచే అవకాశం ఉంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే విషయం పై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ టి20 వరల్డ్ కప్ విజేత ఎవరు అనే విషయంపై రివ్యూ ఇచ్చేసాడు.


 తన టి20 వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్ జట్టును ఎన్నుకున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023ను సొంతం చేసుకుని విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టే అటు t20 వరల్డ్ కప్ విజేతగా కూడా నిలుస్తుంది అంటూ జోష్యం చెప్పాడు మైఖేల్ వాన్. ఆస్ట్రేలియా మరోసారి t20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంటుందని నేను భావిస్తున్నాను. నాకు వారిపై 100% నమ్మకం ఉంది. అదేవిధంగా ఇటీవల వరల్డ్ కప్ ను కూడా కైవసం చేసుకున్నారు. అదే విశ్వాసంతో ఈ టోర్నీలో కూడా దిగుతారు. వారి బ్యాటింగ్ అద్భుతం. జట్టులో హెడ్, వార్నర్, మార్ష్, మాక్స్వెల్, ఇంగ్లీస్, డేవిడ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్ పరంగా కూడా ఆస్ట్రేలియా పటిష్టంగానే ఉంది. ఫేస్, స్పిన్ తో సమతూకంగా కనిపిస్తుంది ఆ జట్టు. అందుకే ఆస్ట్రేలియానే టైటిల్ విజేత కనిపించే అవకాశాలు ఉన్నాయి అంటూ మైకల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ ప్లేయర్ అయ్యుండి ఇంగ్లాండ్ జట్టు గెలుస్తుంది అనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేయలేదు మైఖేల్వాన్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>